Kids

కోడిగుడ్డుతో కొవ్వొత్తులు-చిన్నారుల సరదా ఆటలు

Telugu Kids Fun Games-Egg Candles

మనం సరదాగా కోడిగుడ్డుతో కొవ్వొత్తి తయారు చేద్దామా! కోడిగుడ్డుతో కొవ్వొత్తి ఏంటి? అనుకుంటున్నారా?! ముందుగా మీరు ఎన్ని కొవ్వొత్తులు చేద్దామనుకుంటున్నారో.. అన్ని కోడి గుడ్లు తీసుకోండి. చిత్రంలో చూపించినట్లు వాటిపైన పగలకొట్టి లోపల ఉన్న సొన అంతా ఖాళీ చేయండి. వాటిని నెమ్మదిగా నీటితో కడగండి. కాసేపు ఆరనివ్వండి. తర్వాత కాస్తలావుపాటి దారాన్ని కోడిగుడ్డు లోపల నిలువుగా వత్తిలా పెట్టండి. ఇప్పుడు కరిగించిన కొవ్వొత్తి మైనాన్ని జాగ్రత్తగా కోడిగుడ్డు పెంకులో నింపండి. ఓ గంట గంటన్నర వాటిని వదిలేయండి. తర్వాత నెమ్మదిగా పెంకులు పగలగొట్టండి. ఇంకేం కోడిగుడ్డు కొవ్వొత్తి సిద్ధం. కొవ్వొత్తి మైనానికి మనకు నచ్చిన రంగులు కలిపీ ప్రయత్నించొచ్చు. ఇవి చేయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఇంట్లో పెద్దవాళ్ల సహాయం తీసుకోవడం మర్చిపోవద్దు.