Politics

ఇప్పుడు సెలెక్ట్ కమిటీ ఉంటుందా?

After YSJ Cancels MLC What Happens To Capital Bill

కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్నట్లుగా సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో శాసనమండలి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. శాసనసభ సైతం ఈ మేరకు తీర్మానం ఆమోదించనుంది. మండలిలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లులను తమ అభ్యంతరాలకు విలువ ఇవ్వకుండా..టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం సెలెక్ట్ కమిటీకి పంపారనేది వైసీపీ నేతల ఆగ్రహం. దీంతో..న్యాయ పరంగా సీఎం జగన్ నిపుణులతో చర్చలు చేసారు. అదే విధంగా మంత్రులు..పార్టీ ప్రముఖులతో చర్చించారు.రాజకీయంగా వైసీపీకే నష్టం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అయింది. అనేక మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామనే హామీని ప్రస్తావించారు. అన్నీ తాను చూసుకుంటానని..టీడీపీ ఆధిపత్యం..వాళ్లు బిల్లులకు అడ్డుపడటం మాత్రం ఇక కొనసాగకూడదని జగన్ నిర్ణయించారు. ప్రభుత్వం మండలి రద్దు చేస్తూ తీసుకున్న తాజా నిర్ణయం తో మరి.. సెలెక్ట్ కమిటీ భవిష్యత్ ఏంటి.. ఆ బిల్లులు ఏమవుతాయి..నిబంధనలు ఏం చెబుతున్నాయి..
**మండలిలో ఆ నిర్ణయం ఏమవుతుంది..
ప్రభుత్వం ప్రతిపాదించిన ఆ రెండు బిల్లులు మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. దీనికి కౌంటర్ గా ప్రభుత్వం మండలినే రద్దు చేయాలని నిర్ణయించింది. గతంలోనూ మండలి ప్రభుత్వం శాసన సభలో ఆమోదించిన ఎస్సీ కమిషన్.. ఇంగ్లీషు మీడియం స్కూళ్ల బిల్లులను సైతం మండలి సవరణల పేరుతో తిప్పి పంపింది. అప్పుడే ప్రభుత్వం మండలి కొనసాగించటం మంచిది కాదనే అభిప్రాయాని కి వచ్చింది. ఇక, ఇప్పుడు పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను తిరస్కరించటం తో ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించింది. ఇప్పుడు మండలి రద్దు తీర్మానం ఆమోదంతో..ఇప్పుడు ఈ తీర్మానం కేంద్రానికి చేరుతుంది. పార్లమెంట్ లో ఆమోదం పొంది..రాష్ట్రపతి ఆమోద ముద్రకు వెళ్లనుంది. అక్కడ ఆమోదం పడగానే చట్టం అవుతుంది. అప్పటి వరకు శాసనమండలి సభ్యులు సాంకేతికంగా ఎమ్మెల్సీలుగా ఉంటారు మండలి సైతం యధావిధిగా కొనసాగుతుందని..సమావేశాలు సైతం ఉంటయాని నిపుణులు చెబుతున్నారు.
**సెలెక్ట్ కమిటీ యధాతధం.
మండలిలో ఛైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. కానీ, ఇంకా కమిటీ ఏర్పాటు చేయలేదు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కోసం సభ్యుల పేర్లు ఇవ్వాలని మండలి చైర్మన్ రాసిన లేఖలు ఈ రోజు పార్టీలకు చేరనున్నాయి. మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల నుండి సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీకి మూడు నెలల నుండి సాద్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు మండలి రద్దు తీర్మానం ఆమోదించటంతో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అవుతుందని..మూడు నెలల నుండి సాధ్యమైంత త్వరగా నివేదిక కమిటీ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో మండలి సమావేశాలు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ అయ్యే వరకు యధాతధ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. దీంతో..బిల్లుల సైతం కమిటీ తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేసి నివేదిక ఇవ్వటంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవని యనమల సైతం స్పష్టం చేస్తున్నారు.
**ప్రక్రియ పూర్తయ్యేది ఎప్పుడు..
శాసనసభ ఏపీ మండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానం ఆమోదానికి దాదాపు ఆరు నెలల నుండి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఇక, శాసనసభలో మెజార్టీ ఉన్నప్పటికీ..మండలి రద్దు చేస్తూ తీర్మానం చేసినా.. తుది ఆమోదం వచ్చే వరకూ ఇప్పుడు అనుసరిస్తున్న ప్రక్రియనే కొనసాగించాల్సి ఉంటుంది. త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున సంయుక్త సమావేశాల నిర్వహణ…గవర్నర్ ప్రసంగం మామూలుగానే ఉంటుంది. దీంతో..ప్రభుత్వం తమ అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదనే కారణం..అన్నింటీకీ అడ్డుపడుతున్నారనే ఆగ్రహంతో మండలి రద్దు చేసిందని..తుది నోటిఫికేషన్ వచ్చే వరకూ ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ తరువాత నుండి ఇక అధికార ..ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తాయనేది కీలకంగా మారుతోంది.