Movies

బీ “కేర్”ఫుల్

Be Careful Along Side With Saiyami Kher

సయామీ ఖేర్‌తో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఆమె చాలా డేర్‌ అండ్‌ డాషింగ్‌. మరి.. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నవాళ్లకు ఆ మాత్రం దమ్ము ధైర్యం ఉంటాయి కదా. ఇంతకీ సయామీ ఈ ఆర్ట్స్‌ ఎందుకు నేర్చుకున్నారంటే ‘వైల్డ్‌డాగ్‌’ సినిమా కోసం. 2015లో ‘రేయ్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ చాలాకాలం తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రం ఇది. ఇందులో నాగార్జున ఎన్‌.ఐ.ఏ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆయన సరసన ఓ హీరోయిన్‌గా దియా మిర్జా నటిస్తుండగా మరో హీరోయిన్‌గా సయామీని తీసుకున్నారు.ఈ చిత్రంలో సయామీ పై హై యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నారట. దీనికోసం ఇప్పటికే ఆమె ముంబైలో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా సయామీ మాట్లాడుతూ– ‘‘ప్రెస్టేజియస్‌ చిత్రంలో భాగం కావడంతో పాటు నాగార్జునగారితో కలిసి నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ట్రైనింగ్‌ తీసుకుంటున్నాను’’ అన్నారు. పూర్తి స్థాయి యాక్షన్‌ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి అహిషోర్‌ సల్మాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు.