1. ఏప్రిల్ 2న భద్రాద్రి రామయ్య కల్యాణం – ఆద్యాత్మిక వార్తలు – 27/01
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం ఏప్రిల్ 2న జరగనుంది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు శ్రీరామ నవమి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ వివరాలను ఈవో నరసింహులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. మార్చి 29వ తేదీన ఉత్సవాలకు అంకురార్పణ చేసి 30న గరుడాధివాసం నిర్వహిస్తారు. 31న అగ్నిని ప్రతిష్ఠించి దేవతలను ఆహ్వానిస్తారు. ఏప్రిల్ 1న ఎదుర్కోలు జరుగుతుంది. 2న శ్రీరామ నవమిని పురస్కరించుకుని సీతారాముల వారికి కల్యాణ మహోత్సవాన్ని కొనసాగిస్తారు. అదేరోజున శ్రీరామ పునర్వసు దీక్షలను ప్రారంభిస్తారు. 3న మహాపట్టాభిషేకం చేస్తారు. ఆ రోజు రథోత్సవం ఉంటుంది. బ్రహ్మోత్సవాల కారణంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు నిత్య కల్యాణాలు చేయరు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 8 వరకు దర్బారు సేవ సైతం ఉండదు.
2.ఘనంగా మేడారం జాతర
మేడారం మహాజాతరను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రులు, అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించి వచ్చే నెల 5 నుంచి జరిగే మహాజాతరకు ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని సజావుగా ఇళ్లకు వెళ్లేలా చూడాలన్నారు. జాతరను రాష్ట్ర పండగగా ప్రభుత్వం జరుపుతోందని.. ఈ మేరకు సకల వసతులు కల్పించాలని చెప్పారు. ఏ మాత్రం అలసత్వం చూపినా.. కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు మేడారం వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వీలుగా వచ్చే నెల 5 నుంచి 9 వరకు హైదరాబాద్లో రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచుతామని సీఎం తెలిపారు. మంత్రులు సత్యవతి రాఠోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఆలయ ట్రస్టు ప్రతినిధులు ఆదివారం ప్రగతిభవన్లో సీఎంను కలిసి మహాజాతర ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులు, సీఎస్ సోమేశ్కుమార్, ఇతర అధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ‘‘మేడారం జాతరకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. నిధులకు ఏ మాత్రం కొరత లేదు. క్యూ లైన్ల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తదితర విషయాల్లో సరైన వ్యూహాన్ని అనుసరించాలి. గతంలో వరంగల్ జిల్లాలో పనిచేసి.. మేడారం జాతరలో పాల్గొన్న అనుభవమున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అక్కడికి పంపాలి’’ అని సీఎం ఆదేశించారు.
3.శ్రీవారి హుండీలో రూ.కోటి కానుక
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి హుండీలో ఓ అజ్ఞాత భక్తుడు రూ.కోటి నగదును విరాళంగా వేశారు. శనివారం నాటి హుండీ కానుకలను ఆదివారం లెక్కించగా.. ఈ విషయం వెలుగుచూసింది.
4. జాతర తేదీలు ఇవే : మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి
రాష్ట్ర పండుగ మేడారం మహా జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఈసారి ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా ప్రచారం చేస్తున్నారు. భక్తులెవ్వరూ ప్లాస్టిక్ కవర్లు.. వస్తువులు తీసుకురావద్దని ఇప్పటికే తెలియజేశారు. ఆర్టీసీ బస్టాండ్లు, గ్రామ పంచాయతీల వద్ద ప్రచార బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. దేశ విదేశాల నుంచి కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసింది.గతేడాది సెప్టెంబర్‌లో పనులు మొదలుపెట్టారు. దాదాపు అన్ని అభివృద్ధి పనులు పూర్తి కావస్తున్నాయి. జాతర చుట్టుపక్కల ప్రాంతాల్లో 400 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. గద్దెల వద్దనే 30కి పైగా కెమెరాలను ఫిక్స్‌చేశారు. మేడారం జాతర జరిగే ప్రధాన రహదారులు, దేవాలయాల ప్రహరీలపై ఈసారి జాతర విశిష్టతను తెలియచేసే రంగు, రంగుల బొమ్మలను వేయించారు. చిలకల గుట్టకు పోయే దారి, జంపన్నవాగు వద్ద, మేడారం గద్దెల వద్ద వేసిన బొమ్మలు అందరిని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. జాతరలో 30 వేల మందికి పైగా ఉద్యోగులు సేవలందించనున్నారు. ఒక్క పోలీస్‌శాఖ తరఫునే 10 వేల మందికి పైగా డ్యూటీ చేస్తారు. మహా జాతర తేదీలు ఫిబ్రవరి 5: సారలమ్మ గద్దెకు వస్తుంది. ఫిబ్రవరి 6: సమ్మక్క గద్దెకు వస్తుంది. ఫిబ్రవరి 7: మొక్కులు సమర్పించుట. ఫిబ్రవరి 8: అమ్మవార్ల వన ప్రవేశం
5. బ్రహ్మరాత
అనగనగా ఓ ముని చాలా ప్రతిభావంతుడు. సకలశాస్త్రాలు, విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తూ అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్నబిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా, ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో, అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి. వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తనవద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో, తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు. ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమవద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు. ఇదిలావుండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించ…న్నాడు శంకరుడు. ముందు ఆ ఆవుని తోలుకుని పట్టణానికి వెళదాం పద అన్నాడు వసంతుడు. ఏమి మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఈ ఆవుని ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తరువాత అతను చెప్పిన ధరకు అమ్మేసాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా, వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరం అయిన సరుకులను, శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురుమని తిని ఆకలి తీర్చుకున్నారు. తర్వాత వసంతుడు శంకరుడితో తమ్ముడూ అన్నదానం చేద్దాం. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్యా! ఇంతవరకు ఆ ఆవు వుంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా వుంది అని అన్నాడు. దానికి వసంతుడు తమ్ముడూ, నువ్వు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో. ప్రొద్దునకంతా సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పాడు.
ప్రొద్దున్నే లేచి తలుపు తెరచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. శంకరుడి ఇంటిముందు ఒక ఆవు నిలబడి వుంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయే స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేసాడు.
ఆ రోజు కూడా ఆవును తీసుకెళ్ళి సంతలో అమ్మి, వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడూ, ఇక ఇలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు.
వసంతుడు వాళ్ళని, వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది. అన్నయ్యా! నేను మహాపాపిని. ఈ పాపపంకిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని బావురు మంది. ఊరుకో చెల్లీ! ఊరుకోమ్మా! ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన. ఆ రాత్రికి విటులు ఎవ్వరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. ఆమె ఆశ్చర్యపడుతూ అయ్యా! ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆ రాత్రి ఇద్దరు, ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కాని అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటిరోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని, లక్ష వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తూ ఆ బ్రహ్మే నని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటివరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమైంది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి, గురుదంపతుల రుణం తీర్చుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు, దానిని నిరూపించాడు. అలా బ్రహ్మ రాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపాడు వసంతుడు.
6. తిరుమల\|/సమాచారం
ఓం నమో వేంకటేశాయ!!
• ఈరోజు సోమవారం,
27.01.2020
ఉదయం 6 గంటల
సమయానికి,
తిరుమల: 16C°-28C°
• నిన్న 78,180 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 01 కంపార్ట్మెంట్ లో
సర్వదర్శనం కోసం భక్తులు
వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
04 గంటలు
పట్టవచ్చును,
• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
₹: 4 కోట్లు,
• నిన్న 18,950 మంది
భక్తులకు శ్రీ పద్మావతి
అమ్మవారి దర్శన భాగ్యం
కలిగినది,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
/ / గమనిక / /
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
ప్రత్యేక దర్శనాలు:
• జనవరి 28న వృద్ధులు,
దివ్యాంగులకు శ్రీవారి
ప్రత్యేక దర్శనం,
• జనవరి 29న 5 ఏళ్లలోపు
చిన్నపిల్లల తల్లిదండ్రులకు
ప్రత్యేక దర్శనం.
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ
పూర్వా సంధ్యా ప్రవర్తతే,
ఉత్తిష్ఠ నరశార్దూల
కర్తవ్యం దైవమాహ్నికమ్
తా: కౌసల్యాదేవికి
సుపుత్రుడవగు ఓ
రామా! పురుషోత్తమా!
తూర్పు తెల్లవారుచున్నది.
దైవ సంబంధములైన
ఆహ్నికములను
చేయవలసియున్నది
కావునమ్ము స్వామిttd Toll free
#18004254141తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం
కోసం క్రింద లింకు ద్వారా చేరండిhttps://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ
7. పంచాంగము 27.01.2020
సంవత్సరం: వికారి
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: మాఘ
పక్షం: శుక్ల
తిథి: తదియ రా.తె.05:39 వరకు
వారం: సోమవారం (ఇందు వాసరే)
నక్షత్రం: శతభిషం పూర్తి
యోగం: వరియాన, పరిఘ
కరణం: తైతిల
వర్జ్యం: ప.01:52 – 03:37
దుర్ముహూర్తం: 12:51 – 01:36
మరియు 03:07 – 03:52
రాహు కాలం: 08:13 – 09:38
గుళిక కాలం: 01:53 – 03:18
యమ గండం: 11:03 – 12:28
అభిజిత్ : 12:06 – 12:50
సూర్యోదయం: 06:49
సూర్యాస్తమయం: 06:08
వైదిక సూర్యోదయం: 06:52
వైదిక సూర్యాస్తమయం: 06:04
చంద్రోదయం: ఉ.08:32
చంద్రాస్తమయం: రా.08:17
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కుంభం
దిశ శూల: తూర్పు
చంద్ర నివాసం: పశ్చిమం
ఉమా పూజ
లలితా వ్రతం
మార్కండేయ జయంతి
హర తృతీయా వ్రతం
దేవ్యా ఆందోళన వ్రతం
గుడలవణ దానం
8. రాశిఫలం – 27/01/2020
తిథి:
శుద్ధ తదియ రా.తె.6.05 , కలియుగం-5121 తీశాలివాహన శకం-1941
నక్షత్రం:
శతభిషం పూర్తి
వర్జ్యం:
మ.1.17 నుండి 3.01 వరకు
దుర్ముహూర్తం:
మ.12.24 నుండి 01.12 వరకు, తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు
రాహు కాలం:
ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా నుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశముంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా నుండుట మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చినచో అనారోగ్య బాధలుండవు.
మిథు:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) అకాల భోజనాదులవల్ల అనారోగ్యమేర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో నుండుట అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా నుండుట మంచిది. మనోద్వేగానికి గురి అవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. క్రొత్త పనులు ప్రారంభించరాదు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) బంధు, మిత్రులతో కలుస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారంచేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్ర్తిల మూలకంగా లాభం వుంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. ఋణబాధలు తొలగును. ఆరోగ్యం మెరుగవుతుంది.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. క్రొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక దనలాభయోగముంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్ర్తిలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తపడుట మంచిది.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందుతారు.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) క్రొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసికానందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. వృత్తిరీత్యా క్రొత్త సమస్యలనెదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్ర్తిలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుంటాయి.
9. బ్లాక్‌లో శ్రీవారి ‘బ్రేక్’ టిక్కెట్లు…
తిరుమలలో శ్రీవారి సేవా టిక్కెట్లు, విఐపి బ్రేక్ దర్శనాల టిక్కెట్లు, వసతి గదులను బ్లాక్‌లో అమ్ముకునే ప్రహసనం యధేుచ్ఛగా నడుస్తోంది. విక్రయదారులను టిటిడి విజిలెన్స్ అధికారులు తరచూ పట్టుకుంటునే ఉన్నారు. అయినప్పటికీ బ్లాక్‌లో టిక్కెట్ అమ్మకాలు ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ ప్రహసనం వెనుక ఎవరున్నారన్న విషయానికి సంబంధించిన వివరాలు విజిలెన్స్ అధికారులకు తెలుసునన్న అభిప్రాయాలు బహిరంగంగానే వినవస్తున్నాయి. అప్పుడప్పుడు కొందరిని పట్టుకోవడమే తప్ప బ్లాక్ టిక్కెట్ల విక్రయాన్ని పూర్తిగా నిరోధించే దిశగా చర్యలు లేవన్న విమర్శలున్నాయి. అంతేకాదు… ఈ తతంగానికి సూత్రధారులైన వారి వైపు చూడడంలేదన్న ఆరోపణలు కూడా వినవస్తున్నాయి.
10. మేడారం జాతరకు పోటెత్తుతున్న భక్తులు
మేడారం జాతరకు రోజురోజుకు భక్తుల రద్దీ పోటెత్తుతుంది. దేశ నలుమూలల నుంచి భక్త జనం వచ్చి మేడారంలోని సమ్మక్క, సారలమ్మ లను దర్శించుకుంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో దాదాపు 2 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపా రు. రెండేళ్లకొకసారి జరిగే మేడారం జాతరకు సుమారు కోటి మంది భక్తులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జాతరలో సమ్మక్క సారలమ్మ లను కన్నెపెల్లి చిలకల గట్టు నుంచి తీసుకొస్తారు. అరణ్యం లాగా ఉండే చిలకల గుట్టు వద్ద జాతర సందర్భంగా భక్తులు పోటెత్తుతారు. సమ్మక్క వచ్చే దారిలో వేల సంఖ్యలో భక్తులు ఉంటారు. సమ్మక్క చిలకలగుట్టు నుంచి తీసుకొస్తుంటే భక్తులు ముగ్గులు వేసి తల్లిని ఆహ్వానిస్తారు. సమ్మక్క వచ్చే దారిలో నిష్టతో భక్తులు మొక్కుతారు. గురువారం సమ్మక్క గద్దెకు చేరుకుంటుంది. ఫిబ్రవరి 5 సాయంత్రం 7 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ ను భారీ బందోబస్తుతో వేల భక్తుల మధ్య గద్దెకు తీసుకొస్తారు. ఈ జాతరకు కోటికి పైగా భక్తులు చేరుకుని సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు దాదాపు వారం రోజుల పాటు ఉండి తల్లులను దర్శించుకుని ఎత్తు బంగారం, మొక్కులను తల్లులకు సమర్పించుకుంటారు. దట్టమైన అటవీ ప్రాంతంతో కూడిన ములుగు జిల్లాలో ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో గిరిజన సాంప్రదాయల ప్రకారం అన్ని విధాలుగా తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జనవరి 22 వ తేదిన గుడి శుద్ధి కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలతో నిర్వహిస్తారు. అనంతరం జాతర మొదటి ఘట్టం మొదలవుతుంది. ఇలా మొదలైన జాతర తల్లులు వన ప్రవేశానికి పోయేంత వరకు వేలసంఖ్యలో భక్తులు హాజరవుతుంటా రు. గిరిజన సాంప్రదాయం ప్రకారం గిరిజన మ్యూజి యం ముందు గిరిజనులు ప్రత్యేక వేష ధారణలతో, పాటలు పాడుతూ,నృత్యాలు చేస్తూ తల్లుల దీవెనల కొరకు గంటల తరబడి పూజలు నిర్వహిస్తారు. జాతర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు. జిల్లా కలెక్టర్, ఎస్‌పి, నోడల్ అధికారి నేతృత్వంలో మేడారం జాతర జరుగుతుంది. జంపన్న వాగులో భక్తులు పున్య స్నానాలు చేసి అక్కడి నుంచి కాలినడకన తల్లుల వద్దకు చేరుకుని సమ్మక్క సారలమ్మల దీవెనలు తీసుకుంటారు. జాతరలో ప్లాస్టిక్ లేకుండా చూడాలని ప్రత్యేక అధికారులను నియమించి చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంత్రులు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఉండే విధంగా రెండు రోజుల కొకసారి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. జాతర కోసం ప్రభుత్వం రూ.75 కోట్ల నిధులను కేటాయించి, భక్తులకు అన్ని సౌకర్యాలు కలిపించింది.
ఏప్రిల్ 2న భద్రాద్రి రామయ్య కళ్యాణం
Related tags :