నేనో మూలకాన్ని… మీకు అంతగా పరిచయం ఉండకపోయినా… నా పేరు మాత్రం వినే ఉంటారు… మీ పెద్దవాళ్లకు నా గురించి చాలానే తెలుసనుకోండి… మరి మీకూ తెలియాలి కదా… అందుకే ఇలా వచ్చా… మరి చెప్పేయనా? నా కబుర్లు… ఇంతకీ ఏ మూలకం? అని ఆలోచిస్తున్నారా? తినబోతూ రుచి అడగటం దేనికి? చదివేస్తే మీకే తెలుస్తుంది!
* నేనెవరంటే?నా పేరు రాగి. మీ తాతయ్యనో అమ్మమ్మనో అడిగి చూడండి. నాతో ఉంగరాలు, కడియాల్లాంటివి చేసి పెట్టుకునేవారు. ‘ఓ మాకూ తెలుసు’ అంటారా?!. నేనో మెత్తని లోహాన్ని. నాకు సాగే, వంగే గుణాలున్నాయి.
* అయినా మీరూ పుస్తకాల్లో చదువుకునే ఉంటారుగా. ‘్య అనే సంకేతంతో నన్ను పిలుస్తారు. నా పరమాణు సంఖ్య 29.
* ఆంగ్లంలో కాపర్ అంటారుగా. ఈ పేరు ఎలా వచ్చింది అంటే… ఇది లాటిన్ పదం క్యూప్రమ్ నుంచి వచ్చింది. అంటే సైప్రస్ దీవి. పురాతన రోమన్ ప్రపంచంలో సైప్రస్‌లోని గనుల నుంచి నన్ను ఉత్పత్తి చేసేవారు. ఇంకా నేను రోమన్‌ల దేవత వీనస్‌కు సంకేతాన్ని.
* నన్ను చూస్తే నాకే గొప్పగా ఉంటుంది. ఎందుకో తెలుసా? నా ఎరుపు రంగు నాకు మాత్రమే ప్రత్యేకం. మరి ఏ ఇతర మూలకానికీ ఈ రకం రంగు ఉండదు. ఆవర్తన పట్టికలో ఇలా మెరుపు ఉండే ఇంకో లోహం బంగారం. కాకపోతే అది పసుపు రంగులో ఉంటుంది
.* మీ పోషక పదార్థాల్లో నేను ముఖ్యమైన మూలకాన్ని.
* నాలో, కంచులో ఏ మాత్రం ఇనుము ఉండదు. ఇనుము మాత్రమే తుప్పు పడుతుంది. అయితే నన్ను అదేనండీ రాగిని తేమగాలికి లేదంటే కొన్ని ఆమ్లాల సమక్షంలో ఉంచినప్పుడు లోహపు ఆక్సైడ్ ఏర్పడుతుంది. దీంతో నా మెరుపుదనాన్ని కోల్పోతా. నాకు చిలుము పట్టడం అంటే ఇదే.
* నాతో లాభాలు!నేను అత్యుత్తమ విద్యుత్ వాహకాన్ని. అంటే విద్యుత్ నా ద్వారా వేగంగా వెళ్తుంది. అందుకే విద్యుత్ పరికరాల్లో నన్ను విరివిగా ఉపయోగిస్తారు
.* వెండి తర్వాత అత్యుత్తమ విద్యుత్‌వాహకం నేనే. నా గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు విద్యుత్ ప్రవాహంలో ఎటువంటి నష్టం ఉండదు. నా తీగలను ఉపయోగించి మీ ఇళ్లలో ఎలక్ట్రిక్ వైరింగ్ చేస్తారు
.* నేను చాలా ఆలస్యంగా తుప్పు పడతా. అందుకే ఇళ్ల పైకప్పుల నిర్మాణంలో, నీటి గొట్టాలుగా ఉపయోగిస్తారు. సాగే గుణమున్న లోహాన్ని కదా.. పైపులుగా, తీగలుగా ఆకృతి వచ్చేటట్లు చేయవచ్చు. నాతో చేసిన పైపులు తేలికగా ఉండటానికి కారణం గోడలు పలుచగా ఉంటాయి. మలుపుల దగ్గర సులువుగా వంచవచ్చు. ఇంకా ఈ పైపులకు అగ్నిభయం ఉండదు.ఎందుకంటే నేను మండను.
* నాకు కలుపుగోలుతనం ఎక్కువే. సులువుగా ఇతర లోహాలతో కలిసి మిశ్రమలోహంగా మారిపోతా. ఈ మిశ్రమలోహాలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఆయుధాల తయారీకి వీటిని వాడతారు. కిందపడినా చటుక్కున పగలవు అతి తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచినాపెళుసుగా మారవు.* మీ ఆరోగ్య పరిరక్షణలో నా పాత్ర ఎక్కువే.కళ్ళు చెదిరే కరెంట్ తీగను నేనే!
*సాగే గుణంతో పాటు దృఢంగా ఉంటా. నన్ను రీసైకిల్ చేసుకోవచ్చు.
* విద్యుత్ మోటార్ నిర్మాణంలోనూ నా తీగలను వాడతారు. ఈ మోటార్‌లు మీకెంతో ఉపయోగపడే గృహోపకరణాలైన వాషింగ్ మెషీన్స్, డిష్ వాషర్స్, ఫ్రిజ్‌లు, వాక్యూమ్ క్లీనర్స్, కార్లు, స్కూటర్లు, విద్యుత్ కిటికీలు, స్క్రీన్ వైపర్స్, కంప్యూటర్స్, డిస్క్ డ్రైవ్‌లు, ఫ్యాన్లు, డీవీడీ ప్లేయర్స్‌లో వినియోగిస్తారు.
* నా తీగలతో డైనమోలు నిర్మిస్తారు. ఇవి సైకిళ్లకు అమరుస్తారు. పవర్‌స్టేషన్‌ల్లో ఉపయోగిస్తారు.
* భూమిలోంచి పోయే కేబుల్స్‌లో కూడా నా తీగలే ఉంటాయి.
* నా ముక్కలను ఎత్తయిన భవంతుల శిఖరంపై మెరుపు వాహకాలుగా బిగిస్తారు. కారణం కరిగిపోకుండా ఎంతటి ఎక్కువ విద్యుత్ ప్రవాహాన్ని అయినా తట్టుకుంటా.
* ఎలక్ట్రిసిటీ సబ్‌స్టేషన్లు, పవర్‌స్టేషన్లు, మెయిన్ ఎడాప్టర్స్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌లు ఉపయోగిస్తారు. వీటి నిర్మాణంలోనూ నా తీగలు వాడతారు.
* అంతేనా? నగలు, ఆభరణాలు, విగ్రహాలు, భవనాలనిర్మాణంలో నన్ను ఉపయోగిస్తారు.
* నా మిశ్రమలోహాలన్ని, ఇత్తడి సహా నగలు, ఆభరణాల తయారీకి వాడతారు. బంగారంలో కలిసిన నా పరిమాణాన్ని బట్టి నగలకు ఎంతో ఆకర్షణీయమైన బంగారపు రంగు ఉంటుంది. ఈ రంగు నా పరిమాణాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
* ఎక్కడి నుంచి వస్తానంటే…క్యుప్రైట్, టెనోరైట్, మూలకైట్, చాల్‌కోసైట్, కోవిలైట్, బోర్నైట్ వంటివే నా ఖనిజాలు. ఇదిగో ఈ ఖనిజాల నుంచి నన్ను ఉత్పత్తి చేస్తున్నారు.
* నా లోహ ఖనిజనిల్వలు భారీగా చిలీ, జాంబియా, పెరూ, కెనడాల్లో ఉన్నాయి.
* నేను 1083.4 డిగ్రీల సెల్సియస్ దగ్గర కరుగుతుంటా. 2567 డిగ్రీల సెల్సియస్ దగ్గర మరుగుతుంటా.
* నన్ను ఉపయోగించి చేసిన ఎన్నో రకాల పనిముట్లు, అలంకరణవస్తువులు క్రీస్తుపూర్వం 9 వేల సంవత్సరాల నాడే ఉన్నాయి. కానీ మీ శాస్త్రవేత్తలు మాత్రం 5 వేల నుంచి 6వేల సంవత్సరాల పూర్వం మాత్రమే మెసొపొటేమియన్స్ తొలిసారిగా రాగిని ఉత్పత్తి చేశారని, ఆ ఆధారాలు దొరికాయని చెబుతుంటారు.
* ఎవరితో కలుస్తానంటే…కళ్ళు చెదిరే కరెంట్ తీగను నేనే!
నాతో తయారుచేసిన తొలి మిశ్రమలోహం కంచు. రాగి, తగరం (టిన్) లోహాల్ని కలిపి కరిగించి కంచు తయారు చేస్తారు. తెలుసా? ఈ ఆవిష్కరణ చరిత్రలో కంచు యుగంగా మిగిలిపోయింది.
* చాలాకాలం తర్వాత మిశ్రమలోహం ఇత్తడి తయారు చేశారు. రాగి, జింక్‌ల మిశ్రమలోహమే ఇత్తడి.
* మిశ్రమలోహాలు నా కన్నా బలంగా, గట్టిగా ఉంటాయి.
* నన్ను అల్యూమినియంతో కలిపిన మిశ్రమలోహాన్ని అల్యూమినియంబ్రాంజ్ అంటారు.
* నాతో టిన్, జింక్ లోహాలు కలిపితే గన్‌మెటల్ తయారవుతుంది.
అన్ని విధాల ఉపయుక్తం రాగి
Related tags :