DailyDose

భారీగా నష్టపోయిన మార్కెట్లు-వాణిజ్యం

Indian Stock Markets Witness Huge Losses-Telugu Business News Roundup

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ ఆరంభం నుంచే నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు అదే ధోరణిలో కొనసాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 458 పాయింట్లు నష్టపోయి 41,155 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయి 12,119 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.48 వద్ద కొనసాగుతోంది. చైనాలోని కరోనా వైరస్‌ క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తుండటం.. ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడి వంటి పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్‌ఎస్‌ఈలో డా.రెడ్డీస్‌ ల్యాబ్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, సిప్లా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐషర్‌ మోటర్స్‌ షేర్లు లాభాల్లో పయనించగా.. వేదాంత, టాటా స్టీల్‌, హిందాల్కో, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి.
* మనదేశంలో అమ్ముడవుతున్న ప్రతి పది ఫోన్లలో ఏడు ఫోన్లు చైనా కంపెనీలవేనని కౌంటర్ పాయింట్ తాజా స్టడీలో తేలింది. డ్రాగన్‌‌‌‌ కంపెనీలు ఇక్కడితో ఆగడం లేదు. వాటి దృష్టి ఇప్పుడు ఆటో మార్కెట్‌‌‌‌ మీద ఉంది. ఫోన్ల మాదిరే చవక ధరల్లో ఎక్కువ ఫీచర్లతో లేటెస్ట్‌‌‌‌ డిజైన్లతో కార్లను తీసుకొస్తూ మార్కెట్‌‌‌‌ షేరును పెంచుకుంటున్నాయి. హెక్టర్‌‌‌‌ పేరుతో ఎస్‌‌‌‌యూవీలను, ఈవీలను అమ్ముతున్న చైనా ఆటోమేకర్‌‌‌‌ ఎంజీ మోటార్స్‌‌‌‌ ఇండియాలో పాతుకుపోవడానికి ఇక్కడ ప్లాంట్లను నిర్మిస్తోంది. 2024 నాటికి ఇండియా జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మోడీ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎంజీ మోటార్స్‌‌‌‌, గ్రేట్‌‌‌‌వాల్‌‌‌‌ వంటి కంపెనీలు పావులు కదుపుతున్నాయి. ఇటీవల జరిగిన ‘ఆటో ఎక్స్‌‌‌‌ 2020’ను పరిశీలిస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది.
* ఎయిర్ ఇండియాలో నూరు శాతం వాటాను అమ్మేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ద‌మైంది. దీనికి సంబంధించిన ప్ర‌ణాళిక‌ల‌ను ఇవాళ‌ కేంద్రం ప్ర‌క‌టించింది. జాతీయ విమాన సంస్థ ఎయిర్ ఇండియా.. దివాళా వైపు అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ సంస్థ‌లో మెజారిటీ వాటాను అమ్మాల‌ని ప్ర‌భుత్వం భావించింది. కానీ 2018లో బిడ్‌ల‌కు ఆహ్వానం ప‌లికినా.. ఆ సంస్థలో వాటాను కొనేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు. దీంతో ఎయిర్ ఇండియాలో నూరు శాతం వాటాను కేంద్రం అమ్మ‌కానికి పెట్టింది. దేశీయ‌, విదేశీ విమానాల‌ను ఎయిర్ ఇండియా న‌డుపుతున్న విష‌యం తెలిసిందే. వాటాను కొనుగోలు చేసుకోవాల‌నుకునేవారికి మార్చి 17వ తేదీ వ‌ర‌కు డెడ్‌లైన్ విధించారు. 2018లో ఎయిర్ ఇండియా సుమారు 76 శాతం వాటాను అమ్మాల‌ని ప్ర‌య‌త్నించింది. కానీ ఆ ప్‌వయ‌త్నం స‌క్సెస్ కాలేదు. ఎయిర్ ఇండియా ప్ర‌స్తుతం 50 వేల కోట్ల అప్పులో ఉన్న‌ది. ఎయిర్ ఇండియాతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లోనూ స్టేక్స్ అమ్మాల‌ని నిర్ణ‌యించారు.
*మరో వారంలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి వృద్ధిని పెంచే దిశగా రానున్న బడ్జెట్లో కీలక ప్రకటనలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇక దేశీయ తయారీ, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా దిగుమతి సుంకాలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగానే దాదాపు 50కిపైగా వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచనున్నట్లు తెలుస్తోంది.
*పెట్రోల్ బంకుల్లో గంటల తరబడి వేచిచూసి విసిగి పోతుంటాం కదా! అయితే ఈ సాంకేతికత అమల్లోకి వస్తే ఆ బాధ నుంచి విముక్తి లభించొచ్చు. ఇంధనం నింపుకున్న తర్వాత బిల్లు కట్టడానికి ప్రత్యేకంగా వేచి చూడకుండానే వెళ్లిపోవచ్చు. టోల్ ప్లాజా వద్ద రద్దీని తగ్గించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఫాస్టాగ్ తరహాలోనే పెట్రోల్ బంకుల్లోనూ ఫాస్ట్లేన్ అనే విధానాన్ని రూపొందించారు. ముంబయికి చెందిన అంకుర సంస్థ ఏజీఎస్ ట్రాన్స్సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇప్పటికే ముంబయి, పుణె, థానెలోని హెచ్పీసీఎల్ పెట్రోల్ పంపుల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు.
*విలువలు, విశ్వసనీయతతోనే వ్యాపారం వృద్ధిలోకి వస్తుందని అంబిత్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూపు సీఈఓ అశోక్ వాధ్వా పేర్కొన్నారు. గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజిజెన్(ఐఎస్బీ)లో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ విద్యార్థుల స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఫర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్(పీజీపీ మ్యాక్స్) 64 మంది, పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్(పీజీపీ ప్రో) 76 మంది, గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ ఫర్ ఫ్యామిలీ బిజినెస్(పీజీపీ ఎంఫ్యాబ్) 62 మంది విద్యార్థులు కోర్సులను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
*విద్యుత్ ద్విచక్ర వాహనాల విభాగంలోకి అడుగుపెట్టినట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రకటించింది. రూ.1.15 లక్షల(ఆన్రోడ్ ధర-బెంగళూరు)తో ఇ-స్కూటర్ను తీసుకొచ్చినట్లు తెలిపింది. 4.4 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్తో వస్తున్న ఈ ‘టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్’ గరిష్ఠంగా గంటకు 78 కి.మీ. వేగంతో దూసుకెళుతుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 75 కి.మీ. ప్రయాణం చేస్తుంది. 4.2 సెకన్లలో 0-40 కి.మీ./గంట వేగాన్ని అందుకుంటుంది. ఇందులో ఉండే టీవీఎస్ స్మార్ట్ఎక్సోనెక్ట్ ప్లాట్ఫాం ద్వారా జియో-ఫెన్సింగ్, రిమోట్ బ్యాటరీ ఛార్జ్ నేవిగేషన్ వంటి పలు ఫీచర్లను వినియోగదార్లకు అందిస్తోంది. ‘పర్యావరణం-అనుసంధానం’పై దృష్టి కేంద్రీకరించి.. తొలి విద్యుత్ వాహనాన్ని ప్రవేశపెడుతున్నామ’ని టీవీఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్ పేర్కొన్నారు.
*గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ‘డిజిటల్ ఇండియాసేల్’ పేరుతో 26% క్యాష్బ్యాక్ను అందిస్తోంది. ఇందులో 10% బ్యాంకులు, 16% రిలయన్స్ డిజిటల్ ఇస్తోంది. 24న ప్రారంభమైన ఈ ఆఫర్ను పొందేందుకు నేడే ఆఖరి రోజు. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లలో టెలివిజన్లు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ కొనుగోలుపై ఈ భారీ క్యాష్బ్యాక్ను పొందొచ్చని కంపెనీ తెలిపింది. రిలయన్స్ డిజిటల్ ఆన్లైన్ వెబ్సైట్లో చేసే కొనుగోళ్లకూ ఇది వర్తిస్తుందని పేర్కొంది.