ఆస్ట్రేలియా ఓపెన్‌లో భాగంగా ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్, ప్రపంచ నెం.26 ర్యాంకు ఆటగాడు నిక్ కిర్గియోస్‌తో సోమవారం జరిగిన ఉత్కంఠ పోరులో ప్రపంచ నెం.1 ర్యాంకు ఆటగాడు రఫెల్ నాదల్ ఘన విజయం సాధించాడు.
దాదాపు 3 గంటల 38 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్, కిర్గియోస్‌పై 6-3, 3-6, 7-6(8-6), 7-6(7-4) తేడాతో విజయం సాధించి 41వ సారి గ్రాండ్ స్లామ్ క్వార్టర్ ఫైనల్‌కి చేరుకున్నాడు.
ఆస్ట్రేలియా ఓపెన్‌లో నాదల్ క్వార్టర్ ఫైనల్‌కి చేరడం ఇది 12వసారి. నాదల్, కిర్గియోస్ ఇప్పటివరకూ 8సార్లు తలపడ్డారు.
ఇందులో ఐదుసార్లు విజయం నాదల్‌ను వరించగా.. కిర్గియోస్.. మూడు సార్లు నెగ్గాడు.
క్వార్టర్ ఫైనల్స్‌లో నాదల్ ఆస్ట్రియాకు చెందిన నెం.5 ర్యాంకు ఆటగాడు డొమినిక్ థీమ్‌తో తలపడనున్నాడు.