హిందీలో ‘అంధాధూన్’ ఘనవిజయం సాధించింది. జాతీయ ఉత్తమ హిందీ చిత్రంగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. అలాగే సినిమాకి కీలకంగా నిలిచిన టబు పాత్రకు, ఆమె నటనకు కూడా విపరీతమైన ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆ పాత్రను తమిళంలో రమ్యకృష్ణ పోషించనున్నారని తెలిసింది.‘అంధాధూన్’ తమిళ రీమేక్ హక్కులను నటుడు, దర్శకనిర్మాత త్యాగరాజన్ తీసుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు, ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ హీరోగా నటించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. హిందీలో టబు చేసిన పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఆ పాత్రకు రమ్యకృష్ణ అయితే బావుంటారని చిత్రబృందం భావించారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌లో నితిన్ నటిస్తారు.
మరోసారి విలన్‌గా
Related tags :