పెద్దల సభగా పిలుచుకునే శాసన మండలిని రద్దు చేయడం హద్దులు మీరడమే అవుతుంది. రెండు సభల మెజారిటీ అంగీకారం ద్వారానే చట్టాలు చేయాలి. గానీ.. వాటిని రద్దు చేయడం ద్వారా గొంతులు నొక్కాలి అనుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. గణతంత్ర దినోత్సవం తెల్లారే ఇలాంటి నిర్ణయానికి సిద్ధమవడం బాధాకరం. నిజానికి మండలిని రద్దు చేయడం పార్లమెంట్ చేతిలోనే ఉంటుంది. సుదీర్ఘ ప్రక్రియ కూడా. అయితే తన నిర్ణయాన్ని ఏక పక్షంగా అమలు చేయడానికి అడ్డుగా నిలుస్తున్నారన్న కారణంతో మండలిని లేకుండా చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి రావడం మంచిది కాదు. రద్దు చేసినా, చేయక పోయినా ఇలాంటి కారణాలతో పెద్దల సభను లేకుండా చేయాలనుకోవడం ప్రజాస్వామిక పాలన అనిపించుకోదు.
*మండలి రద్దు ఎలా అంటే?
మండలి రద్దు తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ 2/3 వంతు మెజారిటీతో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. దాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుగా ప్రవేశ పెట్టాలి. అక్కడ చర్చించి, ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి పంపాలి. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత మండలి రద్దు జరుగుతుంది. ఇదంతా జరగాలి అంటే సమయం పడుతుంది
*ఆధ్యుడు ఎన్టీఆర్…
శాసనమండలిని మొదటి సారిగా నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు తొలగించారు. కారణం అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సభ్యులు అధికంగా శాసనమండలిలో ఉండడంవల్ల ప్రభుత్వం బిల్లులకు శాసన మండలిలో తిరస్కరణ ఎదురయ్యేవి.. దీంతో ఎన్టీఆర్ అసహనానికి గురయ్యి..శాసనమండలిని తొలిసారిగా రద్దు చేశారు. మళ్ళీ 2004లో వైఎస్ఆర్ సీఎం గా ఉన్నపుడు ఉమ్మడి ఏపీలో మండలి ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టగా 2007లో కార్యరూపం దాల్చింది.
రాజధాని తరలింపు.మండలి రద్దు హద్దులు దాటుతున్న జగన్!
Related tags :