Movies

నన్ను తెలుగులో ఆదరించండి

Balika Vadhu Fame Sheetal Khandal Requests Telugu Audience

దేశవ్యాప్తంగా బుల్లి తెర ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘బాలికా వధు’ సీరియల్ లో ‘గెహనా’గా నటించిన షీతల్ ఖండల్ గురించి తెలియనివారు ఉండరు. ఈ సీరియల్ ‘చిన్నారి పెళ్లికూతురు’ పేరుతొ తెలుగులోనూ ప్రసారమై ఇక్కడి ప్రేక్షకుల హృదయాలు కూడా గెలుచుకొంది. ‘బాలికా వధు’తో వచ్చిన గుర్తింపు షీతల్ ను ఓవర్ నైట్ స్టార్ ని చేసేసింది. లెక్కకు మిక్కిలి అవార్డులు ఆమెను వరించాయి. ‘వారియర్ సావిత్రి’ అనే హిందీ సినిమాలోనూ నటించి మెప్పించిన షీతల్.. తన మాతృ భాష రాజస్తానీలో ప్రముఖ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలకు సైన్ చేసి.. ఒక ఇండో అమెరికన్ సినిమాలోనూ నటిస్తున్న షీతల్.. తెలుగులోనూ తెరంగేట్రం చేయాలని తహతహలాడుతోంది. సహజసిద్ధమైన అందం, అభినయం, శభాష్ అనిపించే నాట్య కౌశలం పుష్కలంగా కలిగిన ఈ రాజస్థానీ భామకు తెలుగులో ఎవరైనా అవకాశాలు ఇస్తారేమో వేచి చూడాలి!!