Movies

9పేజీల లేఖ రాసిన నరేష్

Dispute Storm In Tollywood MAA - Naresh Writes 9Page Letter

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా)లో స‌భ్యుల మ‌ధ్య‌ విబేధాలు తారస్థాయికి చేరాయి. మా అధ్య‌క్షుడు న‌రేశ్‌పై ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్స్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ‘మా’ అభివృద్ధికి న‌రేశ్ అడ్డంకి మారార‌ని, నిధులు దుర్వినియోగం చేయ‌డంతో పాటు ఈసీ స‌భ్యుల‌ను అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. న‌రేశ్ లోపాల‌ను ఎత్తి చూపుతూ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘానికి ఈసీ సభ్యులు 9 పేజీల లేఖ రాశారు. మాజీ అధ్యక్షుడు శివాజీ రాజాపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశారని, నిబంధ‌న‌లు ఉల్లంఘించిన న‌రేశ్‌పై స‌భ్యులు సంఘానికి విజ్ఞ‌ప్తి చేశారు. నరేష్ నిర్ణయాలతో ‘మా’ పూర్తిగా భ్రష్టుపట్టి పోతోందని, ‘మా’ సభ్యులు ఆస్పత్రిలో ఉంటే కనీసం పరామర్శించలేద‌ని ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవిత లేఖలో పేర్కొన్నారని సమాచారం. క్ర‌మ‌శిక్ష‌ణా సంఘానికి 15 మంది ఈసీ స‌భ్యులు లేఖ రాశారు. న‌రేశ్ ఒంటెద్దు పోక‌డ‌ల‌కు పోతున్నార‌ని, స‌భ్యులెవ‌రినీ సంప్ర‌దించ‌కుండానే ఏక ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని 9 పేజీల లేఖ‌లో సభ్యులు పేర్కొన్నారు. మ‌రి ఈ వ్య‌వ‌హారంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ క్ర‌మ‌శిక్ష‌ణా మండ‌లి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో వేచి చూడాలి.