ఎక్కడైనా 118 వరి రకాల్ని చూశామా?! ఒకటి రెండు రకాలే తెలుసు కానీ.. ఏకంగా 118 వరి రకాలే అని నోరేళ్లబెట్టకండి..! వరిలోనూ వందల రకాలు ఉంటాయా అని ఆశ్చర్యపోకండి..! అదుగో మీ సందేహాన్ని తీర్చుకోవాలంటే.. రైస్ పార్క్‌కి వెళ్లాల్సిందే..! దేశంలోనే మొట్టమొదటిసారిగా కేరళలో రైస్‌పార్క్ ని ప్రారంభించాడు జయకృష్ణన్. మరి..ఈ రైస్‌పార్క్ ప్రారంభించడానికి గల కారణమేంటో తెలుసుకుందామా..!
**కేరళలో కొజికోడ్‌లో జయకృష్ణన్ తఱత్తువేట్టిల్‌ను తెలియనివారు ఉండరంటే నమ్మాల్సిందే. అంత గుర్తింపు రావడానికి ప్రధానకారణం తను సేంద్రియ వ్యవసాయం చేయడమే. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసుకుంటున్న జయకృష్ణన్ సేంద్రియ వ్యసాయం చేయడానికి కారణం తన కొడుకేనట. వాళ్ల కొడుకు భగత్ సంవత్సరం పిల్లాడిగా ఉన్నప్పుడు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుంటే ఎన్ని మందులు వాడినా ఉపశమనం పొందకపోవడంతో తండ్రిగా చాలా ఆవేదనకు గురయ్యాడంట! అయితే దీనికి కారణం రసాయనాలతో కూడిన ఆహారం తినడం వల్లే ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రహించారు. అందుకే తానే స్వయంగా వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. మొదటగా ఏడెకరాల భూమిని లీజుకి తీసుకుని అనాథ ఫామ్స్ పేరుతో సేంద్రియ వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. తను పండించిన వాటినే కుటుంబంలో ఆహారంగా తీసుకోవడం వల్ల వాళ్ల బాబు ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడి, ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తయారయ్యాడు. ప్రస్తుతం భగత్‌కి 14 ఏళ్లు. వీళ్లింట్లో రసాయనాలతో కూడిన పదార్థాలు వాడనే వాడరంటే నమ్మండి! అంటే సబ్బులు కానీ, టూత్‌పేస్టులు కానివ్వండి, అంట్లు కడిగే డిష్‌వాషింగ్ బార్స్‌నూ వాడటం మానేశారట! వాటికి బదులుగా కోకోనట్ కేక్, పాత్రలు కడుక్కోవడానికి కాల్చిన బియ్యం ఊక వంటి సహజ పదార్థాలు వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల వీరి పిల్లలు భగత్, రుద్రనే కాదు.. భార్య రేష్మ, తల్లి జానకీ ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారాయన.
వ్యవసాయంపై విప్లవాత్మకమైన రచన చేసిన మసానోబు ఫుకౌకా సహజ వ్యవసాయం స్పూర్తితో.. జీరో బడ్జెట్‌లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానని చెబుతున్నారు జయకృష్ణన్. 118 వరి రకాలతో పాటు యాభై రకాల దుంపలు, ఇరవై రకాల కూరగాయల్ని పండిస్తున్నారు. ఇలాంటి క్రమంలో పలు రకాలైన వరిని సేకరించడం అలవాటుగా మారిపోయింది. రకరకాల విత్తనాల్ని సేకరించే పనిలో ఆయనే స్వయంగా వివిధ ప్రాంతాల్లో ప్రయాణించి తెచ్చుకుంటారు. ఒక్కోసారి పాకిస్తాన్, థారులాండ్ లాంటి దేశాల నుంచి సరికొత్త రకాల్నీ తెప్పించుకుంటారు ఈ బహు రకాల బియ్యం రైతు. జయకృష్ణన్ సేకరించిన వరి రకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేసేవి. అందులో కొన్ని ముఖ్యమైన రకాలు ముల్లాన్ కయామా, రక్తశాలి (రెడ్ రైస్) క్యాన్సర్ నిరోధక లక్షణాల్ని కలిగి ఉంటుంది. అలాగే ఒడిశాలో లభించే కలబట్టి వరి రకంలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి, ఇ, జింక్ వంటివి ఉండడం వల్ల మెడిసినల్‌గా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. మరొకటి వాల్క్యా చానెల్ రకంలో శక్తి స్థాయిల్ని పెంచుతుంది. అలాగే కలామల్లి పులాలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇవన్నీ తను సేకరించిన వరి రకాల్లో ఉత్తమమైనవి.
**రైస్ పార్క్ ఆలోచన
జయకృష్ణన్ స్నేహితుడు లెనీష్ ఫార్మర్ జర్నలిస్టు కావడం వల్ల సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం మరింత లోతుగా తెలుసుకున్నారు. వయనాడ్‌లో 13 ఎకరాల్లో రైస్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇది అందర్నీ ఆకట్టుకుంటోంది. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం.. దాని విశిష్టత అందరికీ తెలియజేస్తున్నారు. తానాల్ అనే ఎన్జీవోలో కూడా చురుకుగా సేవ్ అవర్ రేస్ క్యాపెయిన్‌లో పాల్గొంటున్నారు.
దేశంలో మొట్టమొదటి రైస్ పార్క్
Related tags :