Politics

500 ఎకరాలు కొనుగోలు చేసిన కవిత

Komatireddy Alleges Kavitha Purchased 500 Acres

తెలంగాణా రాష్ట్రంలో అధికార పక్షంగా ఉన్న టీఆర్ఎస్ కు రాజకీయంగా ఎదురులేకుండా పోతున్న పరిస్థితి కాంగ్రెస్ నేతలు ఎంత మంది ఉన్నపటికీ గులాబీ కారు జోరును ఎవరూ నిలువరించాలేకపోతున్నారు. తాజాగా వెల్లడైన పుర ఎన్నికల ఫలితాలు చూస్తె టీఆర్ఎస్ జోరు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించని పరిస్థితి. ఇదిలా ఉంటె.. తమకు పెద్దగ బలం లేని మున్సిపాల్టీలు కార్పోరేషన్లు సైతం సొంత చేసుకునేందుకు టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు కొద్దిమంది కాంగ్రెస్ నేతలు ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి వేళ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల మీద కాంగ్రెస్ నేతల ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ కుమార్తె కవిత తుర్కపల్లిలో 500 ఎకరాల కొనుగోలు చేసారని కోమటిరెడ్డి ఆరోపించారు. తానూ చేస్తున్న ఆరోపణలకు తగిన ఆదారాలు ఉన్నట్టుగా ఆయన పేర్కొన్నారు ముఖ్యమంరిగా కేసీఆర్ పన్నెండు సార్లు యాదగిరి గుట్టకు వచ్చినా ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ లపై పరుష వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్, కేటీఆర్ లు పశువుల కంటే హీనంగా వ్యవహరిస్తున్న్రంటూ ఘాటు వ్యాఖ్యలు చేరు అలాంటి వాళ్ళను కాల్చి చంపినా తప్పు లేదన్నారు. యాదగిరి గుట్టలో కాంగ్రెస్ కు ప్రజలు మెజార్టీ ఇచారని అయినా దొడ్డిదారిన టీఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుందని అన్నారు. వరంగల్ కు చెందిన కడియం శ్రీహరితో ఎక్స్ అఫీషియో ద్వారా ఓటు ఎలా వేస్తారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి హాట్ వ్యాఖ్యలకు కేటీఆర్ అండ్ కో ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మిగిలిన ఆరోపణలు ఎలా ఉన్నా కవిత మీద ఆయన చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపిస్తే రాజకీయం మరీనా వేడేక్కేదిగా కోమటిరెడ్డి సాబ్?