DailyDose

తెలంగాణకు చైనా వైరస్ సోకలేదు-తాజావార్తలు

No Corono Virus In Telangana-Officials Confirm

* కరోన వైరస్ తెలంగాణ లో ఉన్నట్టు ఇంకా ఎలాంటి నిర్దారణ కాలేదు..వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందద్దు..రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని విషయాలు మానిటర్ చేస్తుంది..రేపు కరోన వైరస్ పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తాం…కేంద్ర బృందం కూడా ప్రస్తుతం నగగరం లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పర్యటిస్తుంది…రేపు పూర్తి వివరాలు వెల్లడిస్తాము..
* అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరును మినహాయించాలని కోరుతూ తాను దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం నాడు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు హైకోర్టు వాయిదా వేసింది. కాగా.. గత శుక్రవారం మినహాయింపును కొట్టివేస్తూ సీబీఐ కోర్టు తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని ఆదేశించిన విషయం విదితమే. ఈ ఆదేశాలపై జగన్ హైకోర్టులో అప్పీలు చేశారు.
* అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా.. ప్రతిష్ఠాత్మక గ్రామీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆదివారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ అవార్డు అందుకున్నారు. దక్షిణ చికాగో నుంచి అధ్యక్షుడి స్థాయి వరకు ఒబామా ప్రస్థానాన్ని, అమెరికా ప్రథమ మహిళగా తన అనుభవాలను వివరిస్తూ ‘బికమింగ్’ పేరిట మిషెల్ రూపొందించిన ఆడియో బుక్కు ‘బెస్ట్ స్పోకెన్ వర్డ్’ విభాగంలో 2020 సంవత్సరానికి గ్రామీ అవార్డు దక్కింది.
* ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మచిలీపట్నం, అరకు, గురజాల కేంద్రంగా వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటన చేయలేదు. మచిలీపట్నం, అరకు, గురజాలల్లో వైద్య కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసింది. ఒక వైద్య కళాశాలను నెలకొల్పాలంటే రూ.500- రూ.600 కోట్ల వరకూ వ్యయమవుతుంది. అక్షరాస్యత, వైద్య వసతులు తక్కువగా ఉండి, అసలు ఎలాంటి వైద్య కళాశాలలు లేని బాగా వెనుకబడి ఉన్న జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేస్తే… అందుకయ్యే వ్యయంలో 60శాతం వరకూ భారత వైద్య మండలి (ఏంసీఐ) సమకూర్చే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే తొలి దశలో పైన పేర్కొన్న 3 ప్రాంతాలను జిల్లాలుగా చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇకపై దశల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
* రేపటి అమరావతి జేఏసీ తెనాలి పర్యటన రద్దుతెనాలి లో 144 సెక్షన్ అమలులో ఉన్నందున పర్యటన వాయిదా వేసుకోవాలని అని పోలీసుల సూచనపోలీసుల సూచనలతో పర్యటన వాయిదా వేసుకోవాలని నిర్ణయించిన అమరావతి రాజధాని పరిరక్షణ సమితి యధావిధిగా ఫిబ్రవరి 4 తెనాలి అమరావతి జేఏసీ పర్యటన
* చిత్తూరు జిల్లా పీలేరు లోని కె.వి పల్లి మండలం గిరిజన బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న వై. బాలాజీ కాంట్రాక్టర్ నుంచి రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ చేతికి చిక్కాడు.
*గుంటూరులో పోలిశెట్టి గ్రూపుపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. పోలిశెట్టి గ్రూపులో వివిధ విభాగాల్లో సోదాలు జరుగుతున్నాయి. పోలిశెట్టి గ్రూపునకు సంబంధించి 12 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి.
* కువైట్‌ దౌత్యకార్యాలయం పునరావాస కేంద్రంలో చిక్కుకున్న పశ్చిమగోదావరి జిల్లా మహిళల దీనావస్థపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. తమ ఇబ్బందులను తెలియజేస్తూ బాధిత మహిళలు పెట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియోపై సీఎం కార్యాలయం స్పందించింది. చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం జగన్‌ ఆదేశించినట్లు వెల్లడించింది. డీజీపీ ఆదేశాలతో ‘దిశ’ స్పెషల్‌ ఆఫీసర్‌ దీపికా పాటిల్‌, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్ రంగంలోకి దిగారు. బాధితుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కువైట్‌ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నారు. నలుగురు బాధిత మహిళలకు విముక్తి కల్పించి, వారిని స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కార్యాలయ స్పందనపై బాధిత మహిళల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
*తీవ్ర ఉద్రిక్తతలు, ఆద్యంతం రసవత్తరంగా మారిన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురపాలక ఛైర్మన్‌ పీఠాన్ని ఎట్టకేటలకు తెరాస కైవసం చేసుకుంది. ఛైర్మన్‌గా జయబాబు, వైస్‌ ఛైర్‌పర్సన్‌గా శ్రీలత ఎన్నికయ్యారు. అధికార తెరాస, విపక్ష కాంగ్రెస్‌ మధ్య ఆధిపత్యపోరుకు నేరేడుచర్ల వేదికైంది. ఇరుపార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ అడ్డాలో ఎలాగైనా తన పాగా వేయాలనే పట్టుదలతో గులాబీ పార్టీ ఉండగా.. దానిని అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నించడం ఆద్యంతం ఆసక్తిని రేపింది.
*సోలొమన్‌ ద్వీపాల్లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.3గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్‌ సర్వే (యూఎస్‌జీఎస్‌) వెల్లడించింది.
*రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 31న జిల్లాస్థాయి నాయకుల ముఖ్య కార్యకర్తల సదస్సు జరపాలని తీర్మానించినట్లు ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొండేపూడి శ్యామ్‌బాబు తెలి పారు. మంగళవారం అశోక్‌నగర్‌లోని ఎమ్మార్పీఎస్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే జిల్లాస్థాయి సదస్సులో పలు అంశాలపై చర్చించడంతో పాటు జిల్లా, డివిజన్‌, నియోజకవర్గ మండల కమిటీల ఎన్నిక లు జరుగుతాయన్నారు. ఫిబ్రవరి 3న రాష్ట్ర, జిల్లాలో జరిగే స్పందన కార్య క్రమంలో ఎమ్మార్వో, ఆర్డీవోలకు పలు అంశాలపై వినతిపత్రాలు అందజేయా లన్నారు. సమావేశంలో నాయకులు పలివెల రవిఅనంతకుమార్‌, గొడతా విజయ్‌కుమార్‌, మందపల్లి సత్యనారా యణ తదితరులు పాల్గొన్నారు.
*రాజధాని రైతుల పోరు 42వ రోజుకు చేరింది. మండలిని రద్దు చేస్తూ సోమవారం సోమవారం శాసనసభ తీర్మానం చేయడంపై భగ్గుమన్న అమరావతి రైతులు.. ఆందోళనలు మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు
*పొరుగుదేశం చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌ ఇతర దేశాలకూ పాకుతోంది. ఇప్పటికే అమెరికా, జర్మనీ, శ్రీలంక, కెనడా సహా చాలా దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా భారత రాజధాని దిల్లీలోనూ కరోనా లక్షణాలతో ముగ్గురు వ్యక్తులు రామ్‌మనోహర్‌ లోహియా ఆసుపత్రిలో చేరారు.
*ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిని తరలిస్తున్నారన్న మనస్తాపంతో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మంగళగిరి మండలం నవులూరులో రంగిశెట్టి వెంకటేశ్వరరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. రాజధానిపై మనస్తాపంతోనే ఇవాళ తెల్లవారు జామున ఆయన మృతిచెందినట్లు బంధువులు చెబుతున్నారు. మృతుడి కుటుంబాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పరామర్శించారు.
*ఇంట‌ర్మీ‌డియ‌ట్లో గ్రేడింగ్ విధానాన్ని ర‌ద్దు చేస్తు‌న్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ ప్ర‌క‌టించారు. ఈ ఏడాది నుంచి ఇంత‌కుముందు త‌ర‌హాలో మార్కు‌లు ఇవ్వ‌నున్న‌ట్లు వెల్లిడించారు.
*అమ‌రావ‌తిని ఏకైక రాజ‌ధానిగా కొన‌సాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, ప్ర‌జ‌లు చేస్తు‌న్న అందోళ‌న‌లు ఇవాళ 42వ రోజుకు చేరుకున్నాయి. ప‌లు గ్రామాల్లో రైతుల రిలే నిరాహార దీక్షలు కొన‌సాగ‌తున్నాయి. ఇక ఇవాళ కూడా రాజ‌ధాని గ్రామాల్లో రైతులు ధ‌ర్నా చేప‌ట్ట‌నున్నారు.
*చైనాలో విజృంభిస్తూ, ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 106కు చేరింది. ఇప్పటివరకు వ్యాధి కేంద్రంగా మారిన వుహాన్‌లోనే నమోదైన మరణాలు తాజాగా ఆ దేశ రాజధాని బీజింగ్‌కూ పాకాయి. సోమవారం బీజింగ్‌లో ఈ వైరస్ బారిన పడి ఓ వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 1300 కొత్త కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. సోమవారం ఒక్కరోజే 24 మంది మృత్యువాతపడ్డారని తెలిపారు. ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య అధికారికంగా 4,000 దాటిపోయిందన్నారు.
*అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
*రాజధాని రైతుల పోరు 42వ రోజుకు చేరింది. మండలిని రద్దు చేస్తూ సోమవారం శాసనసభ తీర్మానం చేయడంపై భగ్గుమన్న అమరావతి వాసులు ఆందోళనలు మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు.
*తన క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. ముగ్గురు సభ్యుల ధర్మాసనం మధ్యాహ్నం 12:30 గంటలకు వాదనలు విననుంది.
*సోలొమన్‌ ద్వీపాల్లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.3గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్‌ సర్వే (యూఎస్‌జీఎస్‌) వెల్లడించింది. కానీ, ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీచేయలేదు.
*ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ స్నాతకోత్సవాన్ని ఫిబ్రవరి 17న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఎస్ ఫయాజ్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ స్నాతకోత్సవాన్ని డిసెంబర్ 2018, జూన్ 2019 టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్ల్లో పాస్ అయిన విద్యార్థులు అర్హులన్నారు. ఇగ్నో హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీతో పాటు హైదరాబాద్ రీజినల్ సెంటర్లో కూడా ఈ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు ఇగ్నో వెబ్సైట్ www.ignou.ac.in లేదా 9492451812, 04023 117550 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
*వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణల అవసరముందని.. ఆ దిశగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి అన్నదాతకు అండగా నిలవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. సోమవారం హైదరాబాద్లోని సీఎస్ఐఆర్ సీసీఎంబీ(సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) కేంద్రాన్ని ఆయన సందర్శించారు
*ప్రతిష్ఠాత్మకమైన పద్మశ్రీ పురస్కారానికి రాష్ట్రం నుంచి ఎంపికైన వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు పద్మభూషణ్ రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వ్యవసాయంలో వినూత్న పద్ధతుల్ని పాటించి పేరు తెచ్చుకున్న రైతు చింతల వెంకట్రెడ్డి, సంస్కృత సాహిత్యకారుడు శ్రీభాష్యం విజయ సారథిలు పద్మ పురస్కారం పొందడంపై శుభాకాంక్షలు తెలిపారు. వీరంతా తమ తమ రంగాల్లో రాణిస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.
*కార్మికుల పక్షాన నిలబడాల్సిన కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నారని తెరాస సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వాఖ్యానించారు.
*అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చి, తన తరఫున న్యాయవాదిని అనుమతించాలన్న పిటిషన్లను కొట్టేస్తూ సీబీఐ కోర్టు గత ఏడాది నవంబరు 1న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హైకోర్టులో సోమవారం పిటిషన్లు దాఖలు చేశారు.
*భీమ్ ఆర్మీ సంస్థ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ను హైదరాబాద్ పోలీసులు సోమవారం దిల్లీకి పంపించారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్నార్సీకి వ్యతిరేకంగా హైదరాబాద్లోని క్రిస్టల్ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన సభకు చంద్రశేఖర్ హాజరవుతుండగా పోలీసులు మార్గమధ్యంలోనే ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయనకు సభకు అనుమతి లేనందునే ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
*ఆదర్శ పాఠశాలల్లో వివిధ తరగతుల్లో ఖాళీల భర్తీకి సోమవారం ప్రవేశాల కాలపట్టిక విడుదల చేస్తూ మోడల్ స్కూల్ అదనపు సంచాలకుడు సత్యనారాయణరెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకు telanganams.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 4నుంచి 29 వరకు 6వ తరగతి, ఫిబ్రవరి 7నుంచి మార్చి 2 వరకు 7-10 తరగతులకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
*కొత్త తరం శాస్త్ర సాంకేతిక రంగాలపై పరిశోధనలు పెంచేందుకు ఐఐటీ హైదరాబాద్కు స్మార్ట్ఫోన్ బ్రాండ్ ‘ఒప్పో’తో ఒప్పందం కుదిరింది. ఈ మేరకు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు సోమవారం ఐఐటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ వినియోగదారులకు సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇంటర్నెట్లో సమగ్ర వినియోగ అనుభవాన్ని అందించేలా పరిశోధనలు నిర్వహిస్తున్నామన్నారు.
*యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హజీపూర్లో బాలికలపై అత్యాచారం, హత్యకేసుల్లో నిందితుడు మర్రి శ్రీనివాస్రెడ్డిని సోమవారం జిల్లా జైలు నుంచి పోలీసులు జిల్లా మొదటి అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. కేసు వివరాల పరిశీలన పూర్తికానందున న్యాయమూర్తి ఈ కేసును ఫిబ్రవరి 6కి వాయిదా వేశారు. అదే రోజున తుది తీర్పు వెలువడే అవకాశాలున్నాయి.
*పశ్చిమ భారతం నుంచి వీస్తున్న పొడిగాలుల వల్ల తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు, వేడి పెరుగుతున్నాయి. సోమవారం రాష్ట్రంలోకెల్లా హైదరాబాద్ నగరంలోనే సాధారణంకన్నా 3.2 డిగ్రీలు అదనంగా పెరిగి 33.5 డిగ్రీలకు చేరింది. రామగుండంలోనూ ఇదే స్థాయిలో పగటి ఉష్ణోగ్రత ఉంది. నాగర్కర్నూల్ జిల్లా వెల్లటూరులో 35.9 డిగ్రీలు నమోదైంది. ఇదే రాష్ట్రంలో పగటి గరిష్ఠ ఉష్ణోగ్రత. మధ్యభారతంపై ‘తుపాను వ్యతిరేక గాలుల వలయం’ ఏర్పడింది.
*ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీల రంగులను వేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేస్తుంటే మీరేం చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నిలదీసింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం మీ పనే కదా, అందుకే కదా మీరున్నదని వ్యాఖ్యానించింది.
*అమ్మఒడి పథకం కింద ఆర్థిక సహాయం పొందిన తల్లులు వారి పిల్లలు చదువుతున్న పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు రూ.వెయ్యి విరాళంగా ఇచ్చేలా ప్రధానోపాధ్యాయులు అభ్యర్థించాలని సూచిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తాన్ని ఆయా పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ బ్యాంకు ఖాతాకు జమ చేయాలని పేర్కొన్నారు. ఈనెల 9న సీఎం జగన్ తల్లులందరికీ ఇచ్చిన పిలుపు మేరకు.. తల్లిదండ్రుల కమిటీలు తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు.
*ఆచార్య నాగార్జున, ఆంధ్ర, రాయలసీమ, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 18లోపు దరఖాస్తులను ఉన్నత విద్యామండలి కార్యాలయానికి పంపించాలని పేర్కొంది.
*ఆర్టీసీ విలీనంపై అధికారులు ఇచ్చిన నివేదికవల్ల ఉద్యోగులకు మేలు జరగకపోగా, పలు సౌకర్యాలు కోల్పోవాల్సి వస్తోందని ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, పలిశెట్టి దామోదరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల్లో పింఛను భయం పట్టుకుందని, జీతాల్లో వ్యత్యాసాలు సరి చేయడంపైనా నివేదికలో స్పష్టత ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కారం కాకపోతే ఫిబ్రవరి 7న జరిగే ఈయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు.
*ఆర్టీసీ విలీనంపై అధికారులు ఇచ్చిన నివేదికలో కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న అంశాలను నిలిపేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) కోరింది. యూనియన్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం సోమవారం విజయవాడలో అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. కార్మికుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసుకున్న ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
*కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతి జిల్లా ఆసుపత్రిలో బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఆసుపత్రిలో 10 ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అధికారులను ఆదేశించారు.