హెల్మెట్ అంటే ప్రాణానికి రక్ష అనేది పాత సంగతి. భద్రతతోపాటు అదొక స్టైల్ ఐకాన్ అనేది నేటితరం మాట. వాళ్ల అభిరుచులకు తగ్గట్టే తయారీ కంపెనీలు ట్రెండీ శిరస్త్రాణాలు తయారు చేస్తున్నాయి. అదే ఊపులో ఇప్పుడు కొత్తగా పోనీటెయిల్ హెల్మెట్లు వచ్చేశాయి. ఇవి అమ్మాయిల కోసం ప్రత్యేకం. ఇందులో మళ్లీ రెండు రకాలున్నాయి. ఓ రకం దానికి వెనుక కృత్రిమ పోనీటెయిల్ అంటించుకోవచ్ఛు ఒక జడ, రెండు జడలు.. సమయం, సందర్భం ప్రకారం అది మీ ఇష్టం. మరో హెల్మెట్‌కి వెనుకవైపు రంధ్రం ఉంటుంది. ఇందులోంచి లేడీ రైడర్లు తమ జుట్టును బయట పెట్టేసుకోవచ్ఛు దీంతో శిరస్త్రాణం వల్ల జుట్టు పాడవుతుందనే సమస్య ఉండదు. ముఖ్యంగా ఎక్కువ జుట్టు ఉన్నవారికి ఇవి సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. మీరూ ప్రయత్నించండి.
జడల కోసం హెల్మెట్
Related tags :