Fashion

తెల్లజుట్టు నల్లబడేందుకు ఉసిరి

How to use amla to blacken whitened hair-telugu fashion news

వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో చాలా మంది తెల్లజుట్టు సమస్యని ఎదుర్కొంటున్నారు. దీన్ని కవర్ చేసుకునేందుకు మార్కెట్లో దొరికే డై, బ్లాక్ హెన్నా, షాంపుల వంటి వాటిపై ఆధారపడుతున్నారు. కానీ, ఈ సమస్యకు కొన్ని ఇంటి చిట్కాలు చక్కని పరిష్కారం చూపిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
*జుట్టు తెల్లగా అవ్వడానికి కారణాలు..
నేటి కాలంలో చాలా మందికి త్వరగా జుట్టు తెల్లబడిపోవడం, ఊడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి పని ఒత్తిడే ప్రధాన కారణమని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి జుట్టు సమస్యలను తగ్గించుకోవాలంటే ముందుగా ఒత్తిడిని తగ్గించుకుని.. సరైన లైఫ్‌స్టైల్, డైట్ పాటించడం మేలు.. దీంతో కేశ సమస్యలే కాదు.. చాలా సమస్యలు దూరం అవుతాయి..
*మార్కెట్లోని డై వాడడం వల్ల..
తెల్లజుట్టుని నల్లబరిచేందుకు మార్కెట్లో ఎన్నో రకాల డైలు అందుబాటులో ఉంటున్నాయి. కానీ, ఇందులో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి. ఈ కారణంగా జుట్టు త్వరగా పాడైపోతుంది. ఇందుకోసం ప్రతి ప్రొడక్ట్‌లోని ఎలాంటి కెమికల్స్ లేవని చెబుతుంటారు. కానీ, ఎంతో కొంత మాత్రం జుట్టుకి హాని జరుగుతుందని భయపడుతుంటారు చాలా మంది. అందుకని కొన్ని ఇంటి చిట్కాలను వాడడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
*ఉసిరితో నల్లజుట్టు..
ఉసిరి జుట్టుకి ఎంతో మంచిది. దీనిని నేరుగా తీసుకున్నా.. పూతలా వేసుకున్నా జుట్టు సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా తెల్ల జుట్టుని నల్లబరచడంలో ఉసిరి బాగా పనిచేస్తుంది. అదెలా అంటే.. మందారపువ్వు 3 తీసుకుని అందులో 2 టీ స్పూన్ల ఉసిరిపొడి కలిపి మెత్తగా పేస్టు చేయాలి. ఇలా తయారైనా పేస్టు గట్టిగా ఉంటే దానికి కొద్దిగా పెరుగు, నీటిని కలిపి తలకు పట్టించాలి. ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే త్వరగా సమస్య పరిష్కారం అవుతుంది.
*ఆముదం కూడా పనిచేస్తుంది.
టేబుల్ స్పూన్ ఆముదం.. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెతో కలిపి వేడి చేయండి. ఈ నూనె వేడిగా ఉన్నప్పుడే కుదుళ్లకు పట్టేలా మర్దన చేయండి. ఇలా రాత్రంత అలానే ఉంచి ఉదయాన్నే తలస్నానం చేయండి. ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆముదం రాయడం వల్ల చాలా వరకూ కేశ సమస్యలన్నీ దూరం అవుతాయి. ఇందులోని ప్రత్యేక గుణాలు జుట్టుని నల్లబరచడమే కాకుండా.. జుట్టు రాలే సమస్యని కూడా దూరం చేస్తుంది.
*గోరింటాకుతో..
గోరింటాకు కూడా కేశ సమస్యలను చాలా వరకూ దూరం చేస్తుంది. కాబట్టి.. దీన్ని ఉపయోగించి మీ తెల్ల జుట్టుని నల్లబరుచుకోవచ్చు అని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. ఇందుకోసం 6 టేబుల్ స్పన్ల హెన్నాని తగినన్ని నీటితో కలిపి పేస్ట్ చేయండి. దీన్ని చక్కగా తలకు పట్టించండి.. ఇది ఆరడానికి కాస్తా సమయం పడుతుంది. మిశ్రమం ఆరిన తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేస్తుండడం వల్ల తెల్లజుట్టు నల్లబడడమే కాకుండా చాలా వరకూ సమస్యలు దూరం అవుతాయి.