* హిజ్రాలకు పెన్షన్ ఎత్తి వేసిన ఏపీ ప్రభుత్వంవచ్చే నెల 1వ తేదీన రావల్సిన పెన్షన్ ఎత్తి వేస్తూ లిస్ట్ జారీ.
* అమెరికాలో భారత రాయబారిగా సీనియర్ అధికారి తరణ్‌జీత్ సింగ్ సంధు నియమితులయ్యారు. ఇప్పుడు అమెరికాలో భారతరాయబారిగా ఉన్న హర్ష్వర్ధన్ ష్రింగ్లా విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా నియమితులైన నేపథ్యంలో ఆ స్థానంలో సంధు బాధ్యతలు చేపడతారు. సంధు ప్రస్తుతం శ్రీలంకలో భారత హై కమిషనర్‌గా ఉన్నారు.
* జంగారెడ్డిగూడెంలో శాసన మండలి రద్దు వ్యతిరేకిస్తూ తెలుగుదేశం శ్రేణుల బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ చేయడానికి కాకర్ల కాంప్లెక్స్ దగ్గర నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ గా వెళ్లడానికి సిద్ధంగా ఉండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ర్యాలీ ని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో
పోలీసులకు, తెలుగుదేశం కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం. జరిగింది. అనంతరం ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు తెలుగుదేశం శ్రేణులు చేశారు.ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని నిలిపేశారు.
* నిర్మల్ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన చ్సరస్వతి అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి శ్రీ పంచమి ఉత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి, నేటి నుండి మూడు రోజుల పాటు జరిగే వసంత పంచమి ఉత్సవాలకు ఆలయ అధికారులు స్థానిక రేవేన్యూ, పోలీసు, ఆధికారుల తో కలసి ఆలయ ఆధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా సర్వదర్శన క్యూలైన్లు అక్షరాభ్యాస కుంకుమార్చన క్యూలైన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు,
* మేడారం లోని తల్లుల గద్దెల వద్ద ప్రత్యేక పూజల దృష్ట్యా ఈ రోజు రాత్రి 8 గంటల నుండి రేపు ఉదయం 5 గంటల వరకు ఆలయం గేట్లు మూసివేయబడుతుంది.
భక్తులకు రేపు ఉదయం 5 గంటల తరువాతే తల్లుల దర్శనం…
* గర్భ విచ్ఛిత్తి (అబార్షన్) గడువును పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 20 వారాలుగా ఉన్న గరిష్ఠ పరిమితిని 24 వారాలకు పెంచేందుకు నిర్ణయించారు.
* నిర్భయ.. గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో క్షమాభిక్ష తిరస్కరణపై ముఖేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తన క్షమాభిక్ష పిటిషన్‌పై రాష్ట్రపతి తన మనసు పెట్టి నిర్ణయం తీసుకోలేదని పిటిషనర్ ఆరోపించారు.
* ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వృద్ధాప్య పింఛన్లు ఇంటి వద్దకే తెచ్చి ఇస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. అమరావతిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం జగన్ స్పందన కార్యక్రమంపై ఉన్నతాధికారులతో మంగళవారం రివ్యూ చేశారు. తరువాత ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి చివరి నాటికి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు 3,300 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
* ఆర్టీసీలో కార్గో రేట్లను అధికారులు ఫిక్స్ చేశారు. కిలోమీటర్‌కు రూ. 45 చొప్పున తీసుకోవాలని, అలాగే గరిష్టంగా 5 టన్నుల వరకు పరిమితి నిర్ణయించారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం 35 బస్సులు సిద్ధమయ్యాయి. సిబ్బందిని కూడా రిక్రూట్ చేసుకున్నారు.
* మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని ముస్లిం సోదరులు ఎన్.ఆర్.సి, సి.ఏ.ఏ కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలియజేసిన శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు.
* కృష్ణాజిల్లా అవనిగడ్డ – చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్ అవనిగడ్డలో చైనా నుంచి వచ్చిన యువ డాక్టర్ పై ఫోకస్.
చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్న అవనిగడ్డ విద్యార్థి ని స్వస్థలమైన అవనిగడ్డకు రాక.
* మొన్నటివరకూ ప్రజలురైతులు ఎమ్మెల్యేలను సన్మానించారని.. ఇప్పుడు తాము వెళ్తుంటే గుర్రుగా చూస్తున్నారని తణుకు వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత దారుణ పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
*రాష్ట్రంలో కొందరు సీనియర్ ఐఎఎస్ లకు పదోన్నతులు లభించాయి. ముఖ్య కార్యదర్శులు ప్రత్యెక ప్రధాన కార్యదర్శులుగా ..కార్యదర్సులకు ముఖ్య కార్యదర్శులుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ప్రిన్సిపాల్ సెక్రటరీలుగా ఉన్న రజిత్ భార్గవ్, జవహర్ రెడి అనంతరము ప్రవీణ్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలుగా పదోన్నతులు లభించాయి.
* రాజధాని లో మహా భారీ వాహాన ర్యాలీ నిర్వహిచిన రైతులు,మహిళ రైతులురాజధాని రైతుల మహర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తుళ్లూరు మండలం లోని 29 గ్రామాల్లో ప్రజలు మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ జై అమరావతి అనే నినాదాలతో వాహానర్యాలీ లో పాల్గొన్న రైతు కూలీలు
ఈ ర్యాలీ లో 5సంవత్సరాల వయస్సు నుండి 90 సంవత్సరాల వయసున్న రైతులు,మహిళలు
దీక్ష సిబిరం నుండి తుళ్లూరు ప్రధాన విధుల్లో భైక్ ర్యాలీ వల్ల రోడ్లు మొత్తం ఆకుపచ్చ వాతావరణం చోటు చేసుకుంది
* వేములవాడ ఆలయ పరిసరాల్లో వైరస్ కలకలం రేపుతోంది. వేములవాడకు చెందిన కోళ్లఫారం యజమానులు నిన్న చికెన్ సెంటర్లకి వేలాది కోళ్లు అప్పగించారు. అయితే తెల్లవారేసరికి చికెన్ సెంటర్లలోని వెయ్యి కోళ్లు మృతి చెందాయి. దీంతో వైరస్ సోకిందేమోనని అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు…
* ఢిల్లీ లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీనితో పలు రైళ్ల రాకపోకల్లో అంతరాయమేర్పడుతోంది. ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు గంట ఆలస్యంగా నడుస్తోందని నార్తన్ రైల్వే అధికారులు తెలిపారు. అలాగే భగల్పూర్ ఆనంద్‌విహార్ విక్రమ్‌శిల ఎక్స్‌ప్రెస్, పూరి-న్యూఢిల్లి పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్, వాస్కో-నిజాముద్దీన్ గోవా ఎక్స్‌ప్రెస్ తదితర పలు రైలు ఆలస్యంగా నడుస్తున్నట్లు వారు తెలిపారు…
* ఆంగ్ల వార్తాచానెల్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్, ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామిపై తమ విమానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు స్టాండ్ అప్ కమెడియన్ కునాల్ కామ్రాపై ఇండిగో విమానయాన సంస్థ నిషేధం విధించింది. 6 నెలల పాటు తమ విమానాల్లో ప్రయాణించేందుకు కామ్రాను అనుమతించబోమని ట్వీట్ చేసింది.
* చైనాలోని వివిధ ప్రాంతాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారత విద్యార్థులపై ఆ దేశ ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది. ఇప్పటికిప్పుడు ఎవరూ ఇండియాకు వెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది. కరోనా వైరస్ పూర్తిగా నియంత్రణలోకి వచ్చాకే విద్యార్థులు ఇండియా వెళ్లేందుకు అనుమతినిస్తామని అధికారులు తేల్చి చెప్పారు.
* తెలంగాణ రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ ఎమెరిటస్ పోస్టుల భర్తీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్వర్సిటీ అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. టీచింగ్ రంగంలో ఆసక్తి కలిగి, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఐదేండ్ల బోధన అనుభవంతో పదవీ విరమణ పొందిన ప్రొఫెసర్లు ఈ పోస్టులకు అర్హులని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
* వైఎస్సార్ కాపునేస్తం పథకం అమలుకు మంగళవారం రాత్రి ప్రభుత్వం మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పథకం కింద కాపు మహిళలకు ఏడాదికి రూ.15వేలు చొప్పున ఐదేళ్లలకు రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాలకు వైఎస్సార్ కాపు నేస్తం పథకం వర్తిస్తుంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
* చైనాలోని వివిధ ప్రాంతాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారత విద్యార్థులపై ఆ దేశ ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది. ఇప్పటికిప్పుడు ఎవరూ ఇండియాకు వెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది. కరోనా వైరస్ పూర్తిగా నియంత్రణలోకి వచ్చాకే విద్యార్థులు ఇండియా వెళ్లేందుకు అనుమతినిస్తామని అధికారులు తేల్చి చెప్పారు.
* కరేబియన్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. కరేబియన్ ద్వీప దేశాల సముదాయంలోని జమైకా, క్యూబా మధ్య సముద్రంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. దీనివల్ల ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించినట్లు ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు. భూకంప ప్రభావం పొరుగునే అమెరికా, మెక్సికోపైనా పడింది. క్యూబాకు సమీపంలో ఉన్న ఫ్లోరిడా, మెక్సికో సిటీల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి.
* ఉత్తర భారతదేశం మీదుగా పయనిస్తున్న వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ నుంచి మధ్య భారతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
ఇంకా కోస్తా తీరం వెంబడి అధిక పీడనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో కోస్తాపైకి ఆగ్నేయం, దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయి.
* క్యూబాలోని జమైకా, తూర్పు క్యూబా మధ్య కరేబియన్ సముద్రంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం మంగళవారం అర్థరాత్రి దాటాక సంభవించింది.
*రాజధాని కోసం మరో గుండె ఆగిపోయింది. రాజధానిని తరలిస్తున్నారని మనస్తాపానికి గురై తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన భారతి (55) అనే మహిళ గుండెపోటుతో మృతి చెందారు. ఈ మేరకు ఆమె బంధువులు తెలిపారు. గత కొన్ని రోజులుగా రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనల్లో భారతి పాల్గొన్నారు.
*కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ఎన్నికల సంఘం(ఈసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు శాంతిసామరస్యతకు భంగం కలిగేలా ఉన్నట్లు ప్రాథమికంగా తేలిందని ఈసీ అభిప్రాయపడింది. జనవరి 30 మధ్యాహ్నం 12 గంటల కల్లా నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేనిపక్షంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది హెచ్చరించింది.
*ఏపీలో కొందరు సీనియర్ ఐఏఎస్‌లకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ముఖ్య కార్యదర్శులకు ప్రధాన కార్యదర్శులుగా, కార్యదర్శులను ముఖ్యకార్యదర్శులుగా, సంయుక్త కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. ప్రిన్సిపల్ సెక్రెటరీలుగా ఉన్న రజిత్ భార్గవ, జవహర్‌రెడ్డి, అనంతరాము, ప్రవీణ్కుమార్లకు స్పెషనల్ చీఫ్ సెక్రటరీలుగా పదోన్నతినిచ్చింది.
*న్యూజిలాండ్ గడ్డపై వరుసగా రెండు టీ20ల్లో ఘన విజయాల్ని అందుకున్న భారత జట్టు సిరీస్‌పై కన్నేసింది.
హామిల్టన్ వేదికగా ఇవాళ మూడో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన గెలిస్తే రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంటుంది.
*ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ‘ఈచ్ వన్- టీచ్ వన్ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కూడా రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచే బాధ్యత తీసుకుంటే బాగుంటుందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అట్టడుగు వర్గాలకు విద్యను అందిస్తే.. వారూ నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములవుతారని పేర్కొన్నారు.
*అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపునిస్తూ, తన తరఫున న్యాయవాదిని అనుమతించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దాఖలుచేసిన పిటిషన్లలో కౌంటర్లు దాఖలు చేయాలని సీబీఐకి మంగళవారం తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 205 కింద దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేస్తూ సీబీఐ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వై.ఎస్.జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం జస్టిస్ శ్రీదేవి విచారణ చేపట్టారు.
*ఆర్పీఎఫ్ సిబ్బంది 2019లో బాలల సహాయ కేంద్రాల ద్వారా 1063 మంది పిల్లలను రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కదిలే రైలు ఎక్కుతూ, దిగుతూ ప్రమాదపు అంచుల వరకు వెళ్లిన 67 మంది ప్రయాణికులకు సాయం అందించారు. 2019లో ప్రయాణికుల భద్రత, రక్షణకు ఆర్పీఎఫ్ చేసిన కృషిపై మంగళవారం ద.మ.రై ఓ ప్రకటన విడుదల చేసింది. రైల్వే ఆస్తుల దురాక్రమణలో 741 కేసులు నమోదు చేసి, 860 మంది నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది.
*రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫిబ్రవరి 1, 2 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. 1 న మధ్యాహ్నం ఆయన దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాష్ట్రపతి నిలయానికి వెళతారు. 2న రంగారెడ్డి జిల్లా కన్హా గ్రామంలోని శ్రీ రామచంద్ర మిషన్ న్యూగ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌లో కన్హా శాంతివనాన్ని సందర్శిస్తారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం బీఆర్కే భవన్లో సమన్వయ సమావేశం నిర్వహించారు.
*రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫిబ్రవరి 1, 2 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. 1 న మధ్యాహ్నం ఆయన దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాష్ట్రపతి నిలయానికి వెళతారు. 2న రంగారెడ్డి జిల్లా కన్హా గ్రామంలోని శ్రీ రామచంద్ర మిషన్ న్యూగ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌లో కన్హా శాంతివనాన్ని సందర్శిస్తారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం బీఆర్కే భవన్లో సమన్వయ సమావేశం నిర్వహించారు.
*మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉమెన్ సేఫ్టీ వాట్సాప్ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చామని షీ టీం ఐజీ స్వాతి లక్రా తెలిపారు. ఈ నంబరుకు కేవలం వాట్సాప్ మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోల వివరాలే పంపాలన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఐపీఎస్ అధికారిణి సుమతి, గాంధీఆసుపత్రి సూపరింటెండెంట్ పి.శ్రావణ్‌కుమార్, కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ నాగమణిలతో కలిసి ఉమెన్ సేఫ్టీ వాట్సాప్ నంబరు-94416 69988ను స్వాతిలక్రా ఆవిష్కరించారు.
*తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల, కళాశాలల్లో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు జూన్‌లో ఉంటాయని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు. డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలు రాసే అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత పాఠశాల, కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో ధ్రువీకరించి ‘పరీక్షల నియంత్రాణాధికారి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్’కు మార్చి 10లోపు సమర్పించాల్సి ఉంటుంది
*తిరుపతి రైల్వేస్టేషన్‌పై ఒత్తిడి తగ్గించడానికి రెండు ప్యాసింజర్ రైళ్లను రేణిగుంట టర్మినల్‌గా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. కాకినాడ-తిరుపతి ప్యాసింజర్ (57258) రైలును రేణిగుంట వరకే పరిమితం చేస్తామన్నారు.
*మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం గ్రేటర్ పరిధిలో మేకలు, గొర్రెలు, పశువుల వధశాలలు మూసివేయాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్‌కుమార్ సూచించారు. మాంసం షాపులు కూడా మూసేయాలన్నారు. ఈ నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాలని వెటర్నరీ విభాగం అధికారులు, జోనల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు.
*ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఫిబ్రవరి 8న నిర్వహిస్తున్నామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. కాకినాడ కలెక్టరేట్‌కు ఎదురుగా ఉన్న రెవెన్యూ భవన్లో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
* రాష్ట్రంలో కొందరు సీనియర్ ఐఏఎస్‌లకు పదోన్నతులు లభించాయి. ముఖ్య కార్యదర్శులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా… కార్యదర్శులకు ముఖ్యకార్యదర్శులుగా పదోన్నతి లభించాయి. మరికొందరికి సంయుక్త కార్యదర్శులుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ప్రిన్సిపల్ సెక్రటరీలుగా ఉన్న రజత్ భార్గవ్, జవహర్‌రెడ్డి, అనంతరాము, ప్రవీణ్‌కుమార్‌కు స్పెషల్ చీఫ్ సెక్రటరీలుగా పదోన్నతులు లభించాయి.సెక్రటరీ హోదాలో ఉన్న జి.జయలక్ష్మీ, ఉషారాణి, రామ్‌గోపాల్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా… జాయింట్ సెక్రటరీలుగా ఉన్న ముత్యాలరాజు, బసంత్‌కుమార్‌కు పదోన్నతి లభించింది. ఇంటర్ క్యాడర్ ట్రాన్స్ఫర్ల ద్వారా ఏపీకి ఇద్దరు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. నాగాలాండ్, యూపీ క్యాడర్‌కు చెందిన.. మంజిర్ జిలానా సమూన్, తమీమ్ అన్సారియాకు విశాఖలో పోస్టింగ్ లభించింది. వీఎంఆర్డీఏ అదనపు కమిషనర్‌గా మంజిర్ జిలానీ సమూన్, జీవీఎంసీ కమిషనర్‌గా తమీమ్ అన్సారియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
* కోయంబత్తూరులో ఓ బాలిక(13) కడుపు నుండి సర్జరీ ద్వారా అర కేజీ తల వెంట్రుకలను, ఖాళీ షాంపు ప్యాకెట్లను బయటకు తీసారు డాక్టర్లు . 7 వ తరగతి చదువుతున్న ఆ బాలిక, గత కొన్ని నెలలుగా తరచూ కడుపు నొప్పితో బాధపడుతుందని, ఆమె తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్కాన్ చేసిన ఆసుపత్రి వైద్యులకు ఆమె కడుపులో బంతి ఆకారంలో ఉన్న వస్తువు నిపించింది. ఎండోస్కోపి ద్వారా ఆపరేషన్ చేయగా ఆమె కడుపులో వెంట్రుకలు, ఖాళీ షాంపూ ప్యాకెట్లు, ప్లాస్టిక్ వస్తువులు కనబడటంతో డాక్టర్లు షాకయ్యారు. వాటిని బయటకు తీశారు. సమీప బంధువు చనిపోవడంతో ఆ బాలిక తీవ్ర మానసిక వేదనకు గురైందని, అందుకే వెంట్రుకలు, షాంపూ ప్యాకెట్లను తినడం ప్రారంభించిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం క్షేమంగా ఉందని అన్నారు.
హిజ్రాల తోక కత్తిరించిన జగన్-తాజావార్తలు
Related tags :