ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఆదివారం నాడు అర్వింగ్‌లోని నిమిట్జ్ ఉన్నత పాఠశాలలో వైభవంగా నిర్వహించారు. అధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రబంద్, జొన్నలగడ్డ శ్రీకాంత్, స్రవంతి యర్రమనేని ఈ వేడుకల నిర్వహణను పర్యవేక్షించారు. సాంప్రదాయ సంక్రాంతి పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సభా ప్రాంగణాన్ని అలంకరించారు. అమెరికా జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఇల్లెందుల సమీర వ్యాఖ్యానంలో సాగిన ఈ వేడుకల్లో ముద్దుగారే యశోద,వందే మీనాక్షి,కృష్ణాష్టకం,మాస్ ఈజ్ గ్రేట్,చరణములే నమ్మితి వంటి నాట్య ప్రదర్శనలు అలరించాయి. టాంటెక్స్ మాజీ అధ్యక్షుడు వీర్నపు చినసత్యం తన హయాంలో నిర్వహించిన కార్యక్రమాలపై ప్రసంగించి ధన్యవాదాలు తెలిపారు. నూతన అధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి సభికులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం తన కార్యవర్గాన్ని సభకు పరిచయం చేశారు. సంస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, సభ్యుల సహకారాన్ని అభ్యర్థించారు. గాయకులు దామిని భట్ల, ధనుంజయల సంగీత విభావరి ఆకట్టుకుంది. చినసత్యం, నరసింహారెడ్డిలను కార్యవర్గం సత్కరించింది. ఈ వేడుకల్లో ఉత్తరాధ్యక్షురాలు లక్ష్మి పాలేటి, ఉపాధ్యక్షులు ఉమా మహేష్, కార్యదర్శి సతీష్ బండారు, కోశాధికారి శరత్ యర్రం, సంయుక్త కార్యదర్శి మల్లిక్ కొండా, సంయుక్త కోశాధికారి కళ్యాణి తాడిమేటి, తిరుమల్ రెడ్డి కుంభం, ప్రతాప్ భీమిరెడ్డి, విక్రం జంగం, డా.పవన్ పామదుర్తి, శ్రీకాంత్ పోలవరపు, అనిల్ యర్రం, ఆనంద్ దాసరి, రాం కొనారా, రమేష్ రెడ్డి, హరి, కిషోర్ చుక్కాల, దేవేంద్ర రెడ్డి, మురళి వెన్నం,డా.భాస్కర్ రెడ్డి సానికొమ్ము, విశ్వభారత్ రెడ్డి కంది, శ్రీకాంత్ గాలి తదితరులు పాల్గొన్నారు. అర్వింగ్ బావర్చి వేడుకలకు విందు భోజనం అందించింది. భారత జాతీయ గీతాలాపనతో వేడుకలు ముగిశాయి.
డాలస్‌లో వైభవంగా టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు
Related tags :