Sports

ఫెదరర్‌ను ఓడించి ఫైనల్‌కు జకోవిచ్

Djokovic Reaches Final-Telugu Tennis Aus Open 2020 News

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో గురువారం జరిగిన తొలి సెమీ ఫైనల్లో టెన్నిస్‌ దిగ్గజం, సెర్బియన్‌ ఆటగాడు నోవాక్‌ జకోవిచ్‌.. స్విస్‌ ఆటగాడు రోజర్‌ ఫెదరర్‌ను ఓడించాడు. దీంతో అతడు 8వ సారి ఈ టైటిల్‌ను సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ రోజు జరిగిన రసవత్తరమైన పోరులో జకోవిచ్‌ తొలుత తడబడినా తర్వాత బాగా పుంజకున్నాడు. 7-6 (7/1), 6-4, 6-3 తేడాతో ఫెదరర్‌ను ఓడించి ఇంటిముఖం పట్టించాడు. మరోవైపు శుక్రవారం జరిగే రెండో సెమీస్‌లో ఎవరు గెలిస్తే.. జకోవిచ్‌ వారితో ఆదివారం ఫైనల్లో తలపడనున్నాడు. జకోవిచ్‌ ఇప్పటివరకు ఏడుసార్లు ఈ టోర్నీలో ఫైనల్‌ చేరి అన్నిసార్లు టైటిల్‌ ఎగరేసుకుపోయాడు. ఇదిలా ఉండగా శుక్రవారం ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌, ఏడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ రెండో సెమీస్‌లో తలపడతారు. వీరిలో ఎవరు గెలిస్తే వారు.. జకోవిచ్‌తో ఆదివారం టైటిల్‌ పోరులో తలపడనున్నారు.