Politics

రాయలసీమ ద్రోహి…బాలకృష్ణ

Hindupur People Protest Against Nandamuri Balakrishna Calling Him Rayalaseema Traitor

అనంతపురం జిల్లా హిందూపురం పర్యటనలో ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది.ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించినందుకు సొంత నియోజకవర్గంలో స్థానికులు నిరసన తెలిపారు.అధికార వికేంద్రీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారంటూ ఆందోళనకు దిగారు.రాయలసీమ ద్రోహి బాలకృష్ణ అంటూ స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అమరావతిలో మాత్రమే ఎందుకు అభివృద్ధి కోరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాయలసీమలో హైకోర్టు ఏర్పాటును వ్యతిరేకిస్తున్న బాలకృష్ణ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు.బాలకృష్ణ కాన్వాయ్‌ను ప్రజా సంఘాలు,  వైసీపీ కార్యకర్తలు  అడ్డకున్నారు.మరోవైపు బాలకృష్ణకు మద్దతుగా ఆయన కాన్వాయ్‌ వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.