ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మెలిండా దంపతుల కుమార్తె జెన్నిఫర్ గేట్స్ నిశ్చితార్థం పూర్తి అయింది. ఈజిప్టుకు చెందిన గుర్రపు స్వారీ ఆటగాడు నయెల్ నాసర్(29) జెన్నిఫర్(23)కు బుధవారం నాడు ప్రపోజ్ చేశాడని, అతడి ప్రేమను తాను అంగీకరిస్తున్నానని ఆమె తన ఇన్స్టాగ్రాం ఖాతాలో పేర్కొన్నారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ జీవితంలో ప్రేమను పంచుకుంటూ తాము ముందుకు వెళ్తామని ఆమె ఆ సందేశంలో తెలిపారు. నాసర్ తల్లిదండ్రులది ఈజిప్టు. అతడు చికాగోలో జన్మించాడు. అతనికి ఈజిప్టు పౌరసత్వం ఉన్న కారణంగా గుర్రపు స్వారీ ఆటలో ఆ దేశం తరఫున 2020 ఒలంపిక్స్‌లో సైతం పాల్గొనబోతున్నాడు. జెన్నిఫర్ కూడా గుర్రపు స్వారీ క్రీడలో మంచి ప్రావీణ్యురాలు. వీరి ప్రణయం పట్ల బిల్, మెలిండాలు తమ హర్షాన్ని వెలిబుచ్చారు.
ఇతగాడే బిల్‌గేట్స్ అల్లుడు
Related tags :