ప్రేమకు నిర్వచనం నటి నివేదాపేతురాజ్ ఏం చెప్పిందో తెలుసా? తమిళం పూర్వీకం కలిగిన ఈ చిన్నది చిన్న వయసులోనే తల్లిదండ్రులతో కలిసి దుబాయ్‌కి మకాం మార్చేసింది. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన నివేదాపేతురాజ్ నటి కాక ముందు మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది. అక్కడ పాపులర్ అయిన తరువాత నటిగా పిలుపు వచ్చింది. అలా తమిళంలో ఒరు నాళ్ కూత్తు చిత్రంతో కథానాయకిగా రంగప్రవేశం చేసింది. ఆ చిత్రం విజయంతో నటిగా స్థిరపడిపోయింది. 2016లో తెలుగు సినీరంగానికీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు దక్షిణాది నాయకిగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా తమిళంలో టిక్ టిక్ టిక్, తిమిరుపుడిచ్చవన్ చిత్రాలతో పాపులర్ అయ్యింది.ఇటీవల విజయ్‌సేతుపతితో జత కట్టిన సంఘతమిళన్ చిత్రం ఈ అమ్మడికి మంచి పేరునే తెచ్చి పెట్టింది. త్వరలో ప్రభుదేవాతో జత కట్టిన పొన్ మాణిక్యవేల్ చిత్రం తెరపైకి రానుంది. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. కాగా ఇప్పటి వరకూ ఈ జాణకు పక్కింటి అమ్మాయి ఇమేజ్ ఉంది. దాని నుంచి బయటపడాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు గ్లామర్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ వార్తల్లో నానుతోంది. అంతే కాదు ఈ మధ్య తరచూ ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో ముచ్చటిస్తోంది. వారి ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో బదులిస్తూ వారిని ఆనందపరుస్తోంది. అలా ఇటీవల ఒక అభిమాని ప్రేమ గురించి ఏమనుకుంటున్నారు అన్న ప్రశ్నకు చెప్పలేని చోట ఏర్పడే బాధలాంటిది ప్రేమ అని బదులిచ్చింది. నివేదాపేతురాజ్ ప్రేమ గురించి చెప్పిన నిర్వచనం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
ఎక్కడో బాధ
Related tags :