ScienceAndTech

హైదరాబాద్ కాల్‌సెంటర్లపై అమెరికా కేసులు

American Govt Lodges Cases Against Call Centers

విదేశాల నుంచి అమెరికా వినియోగదార్లకు కోట్ల సంఖ్యలో మోసపూరిత ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆరోపిస్తూ ఐదు కంపెనీలు, ముగ్గురు వ్యక్తులపై అమెరికా కేసులు నమోదుచేసింది. భారత్ నుంచే ఇటువంటి కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని, దీని వల్ల అమాయక ప్రజలకు తీవ్రంగా ఆర్థిక నష్టం వాటిల్లుతోందని పేర్కొంది. ఈ తరహా కాల్ సెంటర్లు, రోబో కాల్స్ నియంత్రణకు ఆదేశాలు జారీ చేయాలని న్యాయశాఖ తన పిటిషన్లో పేర్కొంది. ప్రభుత్వానికి సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ వినియోగదారులను తప్పుదారి పట్టిస్తూ మోసపూరిత రోబోకాల్స్ చేయొద్దని గతంలో పలుమార్లు హెచ్చరించినా ఆ కంపెనీలు ఆ పద్ధతిని కొనసాగిస్తున్నాయని అందులో పొందుపరిచింది. విదేశీ ఆధారిత మోసపూరిత పథకాలతో అమెరికా వినియోగదార్లను ఆకర్షించడం మానుకోవడం లేదని తెలిపింది. ‘ఈ ఫోన్ కాల్స్ చాలా వరకు భారత్ నుంచే వస్తున్నాయి. దీని వల్ల దేశవ్యాప్తంగా అమాయక ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నార’ని తెలిపింది. ఇ-కామర్స్ నేషనల్ ఎల్ఎల్సీ డీ/బీ/ఏ టోల్ఫ్రీడీల్స్ డాట్కామ్, ఎస్ఐపీ రిటైల్ డీ/బీ/ఏ సిప్రిటైల్ డాట్కామ్, వాటి ప్రమోటర్లు నికోలస్ పలంబో, నటాషా పలంబోపై (స్కాట్స్డేల్, అరిజోనా) ఓ కేసు, గ్లోబల్ వాయిస్కామ్, గ్లోబల్ టెలీకమ్యూనికేషన్ సర్వీసెస్, కేఏటీ టెలికాం, వాటి ప్రమోటరు జాన్ కహేన్పై (గ్రేట్నెక్, న్యూయార్క్) మరో కేసు నమోదైంది. ఈ సంస్థల నుంచి రోబోకాల్స్ను నిలుపుదల చేసేలా తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని కోరింది. గ్లోబల్ వాయిస్కామ్ నుంచి వాయిస్కాల్స్ నిలిపేయాలంటూ ఓ తాత్కాలిక ఆదేశాన్ని ఫెడరల్కోర్టు జారీచేసింది. ‘రోబోకాల్స్ చాలా మంది అమెరికన్లకు ఓ సమస్యగా మారింది. వాటిల్లోనూ ఈ మోసపూరిత కాల్స్ను తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. ఇది సమాజంలోని అమాయాక ప్రజలకు తీవ్రంగా ఆర్థిక నష్టాన్ని కలుగచేస్తుంద’ని న్యాయ శాఖ అసిస్టెంట్ అటార్నీ జనరల్ జోడీ హంట్ అన్నారు.