DailyDose

కంపెనీలకు సోకిన కరోనా వైరస్-వాణిజ్యం

Companies Affected By Coronavirus

*శరవేగంగా విస్తారిస్తున్న కరోనా వైరస్ ప్రజలచే కాదు వాణిజ్య రంగాన్ని భయపెడుతుంది. ఈవైరస్ దెబ్బకు పలు కంపెనీలు విలవిలడుతున్నారు. ఈచైనా వైరస్ కారణంగా మనదేశంలో లక్షల కోట్ల రూపాయలు వనిజ్యమపి ప్రభావం పడే అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.
* దేశీయ స్టాక్‌మార్కెట్లు ఊగిసలాటల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం లాభాలను మిడ్‌సెషన్‌కు నష్టాల్లోకి మారాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 41వేల స్థాయిని, నిఫ్టీ 12వేల దిగువకు కోల్పోయింది. అయితే కేంద్ర ఎకానమీ చీఫ్‌ అడ్వైజర్‌ క్రిష్ణమూర్తి 2019-20 ఆర్థిక సంవత్సరపు ఎకానమి సర్వేని మీడియాముందు ఉంచుతున్న నేపథ్యంలో స్వల్పంగా లాభపడుతున్నాయి.
* ఐటీ దిగ్గజం ‘విప్రో’ సీఈవో అబిదాలీ నీముచ్‌వాలా తన పదవికి రాజీనామా చేశారు. కుటుంబ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు.. శుక్రవారం తెల్లవారుజామున విడుదల చేసిన రాజీనామా ప్రకటనలో తెలిపారు. దాదాపు 75 ఏళ్ల చరిత్ర ఉన్న విప్రోలో పని చేయడం.. తనకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన అజీమ్ ప్రేమ్‌జీ, రిషబ్, ఇతర బోర్డు సభ్యులు, తోటి ఉద్యోగులు, వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన రాజీనామాను విప్రో యాజమాన్యం ఆమోదించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అబిద్ నాయకత్వం, విప్రోకు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపింది. గత నాలుగేళ్లుగా సంస్థను బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దడంలో.. డిజిటల్ వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారు.
*శరవేగంగా విస్తరిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్ ప్రజలచే కాదు బానిజ్య రంగాన్ని భయపెదెఉతున్ది ఈవైరస్ దెబ్బకు పలు కంపెనీలు విలవిలాడుతున్నాయి. ఈచైనా వైరస్ కారణంగా మనదేశంలో లక్షల కోట్ల రూపాయల వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.
*దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం విప్రో సంస్థ సీఈవో, ఎండీ అబిదాలి జెడ్‌ నీమూచ్‌వాలా తన పదవులకు రాజీనామా చేశారు. కుటుంబ వ్యవహారాలు, ఇతర కారణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విప్రో సంస్థ శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. నూతన సీఈవో నియామకం జరిగే వరకూ అబిదాలి సీఈవో గా కొనసాగనున్నారు. ‘ 75 సంవత్సరాల గొప్ప వారసత్వం కలిగిన విప్రో సంస్థకు సేవ చేయడం గౌరవంగా భావిస్తాను ‘ అని అబిదాలి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మాజీ టీసీఎస్‌ సీనియర్‌ ఉద్యోగి అయిన నీముచ్‌వాలా 2015 ఏప్రిల్‌ ఒకటిన విప్రో సీవోవో గా ఆ తర్వాత ఏడాది సీఈవో గా నియమితులయ్యారు. అబిదాలి రాజీనామాపై విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ స్పందిస్తూ ‘అబిద్‌’ విప్రోకు చేసిన కఅషికి కఅతజ్ఞతలు అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
*నవభారత్ వెంచర్స్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.543.3 కోట్ల ఆదాయాన్ని, రూ.54.9 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో ఆదాయాలు, నికరలాభం తగ్గినట్లు స్పష్టమవుతుంది. రెండో త్రైమాసికంలో ఆదాయం రూ.680.6 కోట్లు, నికరలాభం రూ.99.1 కోట్లు ఉన్నాయి. దీంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో ఆదాయం 20 శాతం, నికరలాభం 44 శాతం తగ్గాయి.
*విదేశాల నుంచి అమెరికా వినియోగదార్లకు కోట్ల సంఖ్యలో మోసపూరిత ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆరోపిస్తూ ఐదు కంపెనీలు, ముగ్గురు వ్యక్తులపై అమెరికా కేసులు నమోదుచేసింది. భారత్ నుంచే ఇటువంటి కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని, దీని వల్ల అమాయక ప్రజలకు తీవ్రంగా ఆర్థిక నష్టం వాటిల్లుతోందని పేర్కొంది.
* టెక్ దిగ్గజం యాపిల్ అత్యుత్తమ త్రైమాసిక ఫలితాలను నమోదు చేసింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం జీవనకాల గరిష్ఠమైన 22 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.55 లక్షల కోట్లు)గా నమోదైంది. ఇక ఆదాయం రికార్డు స్థాయిలో 91.8 బిలియన్ డాలర్లుకు చేరింది. ఐఫోన్ విక్రయాలు, సేవలు ఇందుకు దన్నుగా నిలిచాయి. ‘ఒక త్రైమాసికంలో అత్యధిక ఆదాయాన్ని నమోదు చేశాం. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో మోడళ్లకు బలమైన గిరాకీ కలిసొచ్చింది. సేవలు, ధరించే పరికరాలు మంచి అమ్మకాలు సాధించాయి’ అని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ పేర్కొన్నారు.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బజాజ్ ఫైనాన్స్ ఏకీకృత ప్రాతిపదికన రూ.1614 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.1060 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 52 శాతం అధికం. వడ్డీ ఆదాయం ఇందుకు దన్నుగా నిలిచింది. కంపెనీ ఒక త్రైమాసికంలో ఆర్జించిన అత్యధిక నికర లాభం ఇదే కావడం గమనార్హం. ఇక మొత్తం ఆదాయం రూ.4,992 కోట్ల నుంచి 41 శాతం వృద్ధితో రూ.7,026 కోట్లకు చేరింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ.3,206 కోట్ల నుంచి 42 శాతం పెరిగి రూ.4,537 కోట్లకు చేరింది.
* తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, ఖాయిలా పడిన జెట్ ఎయిర్వేస్ నుంచి రావలసిన రూ.60 లక్షలపై ఆశలు వదులుకుంటోంది. ఇందులో భాగంగా ఈ మొత్తానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల ఖాతాల్లో కేటాయింపులు చేసింది. అంటే ఆ మొత్తాన్ని రానిబాకీ కింద పరిగణించినట్లే. ఇప్పటికే దీనిపై జెట్ ఎయిర్వేస్ దివాలా పరిష్కార ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ఐఆర్పీ (ఇంటరిమ్ రిజల్యూషన్ ప్రొఫెషనల్) ముందు తాజ్ జీవీకే క్లెయిము దాఖలు చేసింది.
*డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్కు చెందిన శ్రీకాకుళం ఏపీఐ ఔషధాల తయారీ యూనిట్లో 5 అభ్యంతరాలను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కనుగొంది. ఈ మేరకు డాక్టర్ రెడ్డీస్కు ‘ఫామ్-483’ జారీ చేసింది. శ్రీకాకుళం యూనిట్లో యూఎస్ఎఫ్డీఏ ప్రతినిధి బృందం చేపట్టిన తనిఖీలు ఈ నెల 28న ముగిశాయి. ఈ తనిఖీల అనంతరం అభ్యంతరాలను ప్రతినిధి బృందం నమోదు చేసింది. వీటిపై నిర్దేశించిన గడువులోగా బదులిస్తామని డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యం వెల్లడించింది.
*దేశవ్యాప్తంగా నేడూ, రేపు సమ్మెకు పిలుపునిచ్చాయి బ్యాంకు యూనియన్లు. ఈ నెల 31, ఫిబ్రవరి 1న సమ్మె చేయనున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ఇది వరకే వెల్లడించింది.ఈ రెండు రోజుల సమ్మె తర్వాత తమ డిమాండ్లను అంగీకరించకుంటే మార్చి 11-13 మధ్య మరోసారి సమ్మెకు దిగనున్నట్లు యూఎఫ్బీయూ తెలిపింది. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసింది.
ఐబీయూతో జరిగిన చర్చలో వేతనాలు 15 శాతం పెంచాలని యూఎఫ్బీయూ కోరింది.
* ఎంప్లాయిస్‌‌ ప్రావిడెంట్‌‌ ఫండ్‌‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ)లో భారీ స్కామ్‌ బయటపడింది. సాధారణ ఉద్యోగులను ఫార్మల్‌ ఎకానమీ (పన్నుల పరిధిలోకి)లోకి తీసుకురావడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి రోజ్‌‌గార్‌‌ ప్రోత్సాహన్‌ యోజన (పీఎంఆర్‌‌పీవై)ను అడ్డుపెట్టుకొని 80 వేల కంపెనీలు ఖజానాకు రూ.300 కోట్లు నష్టం చేసినట్టు నేషనల్‌ మీడియా తెలిపింది. ఇందుకోసం ఇవి తొమ్మిది లక్షల మంది లబ్ధిదారుల అకౌంట్లను వాడుకున్నాయి. ఫార్మల్‌ ఎకానమీ పరిధిలోకి రావడానికి కొత్త ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్థికపరమైన ప్రయోజనాలను ఇవి తమ ఖాతాల్లో వేసుకున్నాయని ఈపీఎఫ్‌ఓ విచారణలో తేలింది. ఈపీఎఫ్‌వోలో చేరే కొత్త ఉద్యోగులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం పీఎంఆర్‌‌పీవైని ప్రవేశపెట్టింది. 2016 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ప్రకారం..అదే ఏడాది ఏప్రిల్‌ తరువాత ఉద్యోగంలో చేరిన వారికి ప్రోత్సాహకాలు దక్కు తాయి. అయితే, రూ.15 వేలలోపు జీతం ఉన్న కొత్త ఉద్యోగులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.