తామా ఆధ్వర్యంలో రీసైక్లింగ్ & ఎకో ఫ్రెండ్లీ టిప్స్ వర్కుషాప్ నిర్వహించారు. తామా బోర్డు ఆఫ్ డైరెక్టర్ శ్రీరామ్ రొయ్యల ఈ సదస్సు ప్రారంభించి తామా ‘గో గ్రీన్’ గురించి, ప్లాస్టిక్ తక్కువ వినియోగం, ఎకో ఫ్రెండ్లీ ప్లేట్లు, స్పూన్లు, వాటర్ స్టేషన్స్ గురించి వివరించారు. తామా చేసే వైద్యం, విద్య, వికాసం, వినోదం, విజ్ఞానం, సేవ, సదస్సులు, సాహిత్యం, సహాయం, సాంస్కృతిక కర్యక్రమాలపై ప్రసంగించారు. గో గ్రీన్ వాలంటీర్స్ మాలిని ఆకుల, జగదీష్ ఉప్పలను సభకు పరిచయం చేశారు. గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో, రోజువారీ జీవితంలో విస్తృత శ్రేణి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవల్సిన ఆవశ్యకతను వివరించారు. వాడిందే మరలా వాడటం గురించి విపులీకరించారు. ప్లాస్టిక్ ఎక్కడ మరియు ఎలా పారవేయాలి, ప్లాస్టిక్ హానికారత, వాడటం వల్ల నష్టాలు, కంపోస్ట్ లేదా ఎరువులాగా కూడా ఎలా వాడవచ్చో తెలిపారు.
పర్యావరణ సంరక్షణపై తామా సదస్సు
Related tags :