DailyDose

దిల్లికి చేరిన అమరావతి పంచాయతి-తాజావార్తలు

Amaravathi Farmers Protest In Delhi-Telugu Breaking News Today

* అమరావతి ఉద్యమం దిల్లీని తాకనుంది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ గత కొంతకాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో 16 మంది రైతులు గన్నవరం విమానాశ్రయం నుంచి దిల్లీ పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలు, రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాతో పాటు కేంద్ర మంత్రులను కలిసి వివరించనున్నారు.
* సీనియర్‌ దౌత్యవేత్త అజయ్‌ బిసారియాను కేంద్ర ప్రభుత్వం కెనడా హైకమిషనర్‌గా నియమించింది. ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో భారత రాయబారిగా సేవలందించారు. ఇండో-కెనడియన్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం మరో స్థాయికి చేరనున్న ఈ కీలక సమయంలో కెనడా హైకమిషనర్‌గా తనను నియమించటం తనకు ఎంతో గౌరవనీయమని అజయ్‌ ఒక ట్విటర్‌ ప్రకటనలో తెలిపారు. కాగా దౌత్య అధికారి వికాస్‌ స్వరూప్‌ గత సంవత్సరం వరకు ఈ పదవిలో ఉన్నారు.కశ్మీరుకు ప్రత్యేక హోదా రద్దు చేసిన నేపథ్యంలో 2010 ఆగస్టు నుంచి భారత్‌-పాక్‌ రాయబార సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో అజయ్‌ బిసారియా భారత్‌కు తిరిగివచ్చారు. 1987 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన బిసారియా త్వరలోనే కెనడాలో బాధ్యతలు స్వీకరిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తన 30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో భాగంగా అజయ్‌ బిసారియా నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయీకి ప్రైవేట్‌ సెక్రటరీగా పనిచేశారు. అంతేకాకుండా ప్రపంచ బ్యాంకు సలహాదారుగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్‌ సెక్రటరీగా కూడా ఆయన సేవలందించారు.
* వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికీ పెన్షన్‌ పథకం మొదటి రోజున మండల కేంద్రమైన జామిలో గందరగోళం నెలకొంది. శనివారం ఉదయం పెన్షన్‌ ల కోసం వచ్చినవారు మాట్లాడుతూ.. ఇంటింటికి వెళ్లి పింఛన్‌లను ఇవ్వాల్సినవాళ్లంతా కలిసి స్థానిక అధికారుల సాయంతో ఎప్పటిలాగే పంచాయతీ కార్యాలయం వద్ద తమకు పెన్షన్లను పంపిణీ చేశారని చెప్పారు. ఇంటింటి పింఛన్ల పంపిణీ అంటే.. ఇదేనా.. అని కొందరు అసహనాన్ని వ్యక్తపరిచారు.
*ఏపీ ప్రభుత్వం ప్రతిస్తాత్మకంగా మొదలుపెట్టిన ఇంటివద్దకే పించన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలో సనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది.
* వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికీ పెన్షన్‌ పథకం మొదటి రోజున మండల కేంద్రమైన జామిలో గందరగోళం నెలకొంది. శనివారం ఉదయం పెన్షన్‌ ల కోసం వచ్చినవారు మాట్లాడుతూ.. ఇంటింటికి వెళ్లి పింఛన్‌లను ఇవ్వాల్సినవాళ్లంతా కలిసి స్థానిక అధికారుల సాయంతో ఎప్పటిలాగే పంచాయతీ కార్యాలయం వద్ద తమకు పెన్షన్లను పంపిణీ చేశారని చెప్పారు. ఇంటింటి పింఛన్ల పంపిణీ అంటే.. ఇదేనా.. అని కొందరు అసహనాన్ని వ్యక్తపరిచారు.
* జమ్మలమడుగు పట్టణంలో చాలామంది వఅద్ధులు, వితంతువులు పెన్షన్లు అందక వార్డు సచివాలయలకు చేరుకుంటున్నారు. శనివారం వాలంటీర్లకు మ్యాపింగ్‌ జరగకపోవడంతో, వేలిముద్రల మిషన్లు సరిగ్గా పని చేయకపోవడంతో పెన్షన్‌దారులు సచివాలయలకు చేరుకుంటున్నారు.
* ఏపీ రాజధాని అమరావతి చుట్టూ 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధి చిన్నాభిన్నమైంది. రూ.వేల కోట్ల సంపద ఆవిరయింది. బాహ్యవలయ రహదారికి సమీపంలో, ఆవల ఉన్న వ్యవసాయ భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.
రాజధానుల గురించి డిసెంబరు17న ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీలో ప్రస్తావించకంటే ముందు వరకు ఎకరా రూ.30లక్షలు పలికిన భూములు ఇప్పుడు రూ.15లక్షలు, రూ.10లక్షలకు తగ్గిపోయాయి.
* పింఛన్ల చెల్లింపులో ఇవాల్టి నుంచి సరికొత్త విధానం అమల్లోకి రానుంది. ఇంటి వద్దే లబ్ధిదారులకు నేరుగా చెల్లించే పద్ధతి ప్రారంభం కానుంది.రాష్ట్రంలో 54 లక్షల64 వేల మందికి ఒకే రోజు పింఛన్లు ఇవ్వనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించారు.
* డిగ్రీ చదవాలనుకునే వారికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు. నూతన విద్యా విధానం ద్వారా ఇక నుంచి డిగ్రీ ఆన్‌లైన్‌లోనూ చదువుకునే అవకాశం కల్పిస్తున్నట్లు శనివారం లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. దేశంలో ముందంజలో ఉన్న 100 జాతీయ విద్యాలయాల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. దేశంలో జాతీయ పోలీస్ విశ్వవిద్యాలయం, జాతీయ ఫోరెనిక్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా పేర్కొన్నారు.
* ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుందంటూ ల్యాండ్‌పూలింగ్‌ను వ్యతిరేకించిన జగన్‌, అధికారంలోకి వచ్చాక అదే పనిచేయడం విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి ధ్వజమెత్తారు. విశాఖ రాజధాని ఏర్పాటులో భాగంగా ల్యాండ్‌పూలింగ్‌కు పాల్పడడం అంటే భూకుంభకోణానికి తెరతీస్తున్నట్లేనని ఆరోపించారు. ఈరోజు ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విశాఖ జిల్లాలోని ముదపాక, ఓజోన్‌ వ్యాలీలో ల్యాండ్‌ పూలింగ్‌ జరిగిందని, ఈ సందర్భంగా ఎన్నో మోసాలు వెలుగు చూశాయని గుర్తు చేశారు.
* కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూముల క్రయవిక్రయాలు బాగా తగ్గడంతో పాటు ఇదే సమయంలో హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. హైదరాబాద్‌ బాహ్య వలయ రహదారి నుంచి 150కిలోమీటర్ల దూరంలోనే పల్నాడు ప్రాంతాలు ఉండటంతో అక్కడి ఉద్యోగులు పల్నాడు ప్రాంతంలో భూములను కొంటున్నారు.
* ఏపీ రాజధాని అమరావతి చుట్టూ 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధి చిన్నాభిన్నమైంది. రూ.వేల కోట్ల సంపద ఆవిరయింది. బాహ్యవలయ రహదారికి సమీపంలో, ఆవల ఉన్న వ్యవసాయ భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. రాజధానుల గురించి డిసెంబరు17న ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీలో ప్రస్తావించకంటే ముందు వరకు ఎకరా రూ.30లక్షలు పలికిన భూములు ఇప్పుడు రూ.15లక్షలు, రూ.10లక్షలకు తగ్గిపోయాయి.
* జనవరి ఆరంభంలో క్వింటా మిర్చి రూ.20 వేలు పలికింది. పది రోజుల కిందట రూ.10 వేలకు పడిపోయినా మళ్లీ పుంజుకుంది. 16 నుంచి 20 వేల మధ్య కొనుగోళ్లు సాగాయి. రెండు రోజుల క్రితం వరకూ 18 నుంచి 20 వేలకు కొన్నారు. ఇప్పుడు హఠాత్తుగా ధర 10 వేలకు పడిపోయింది.
* ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. మొత్తం 905 సెంటర్లలో 3,37,054 మంది జనరల్‌ విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 2,46,653మంది ఎంపీసీ, 90,401బైపీసీ గ్రూపు విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు ఒకేషనల్‌ విద్యార్థులు 66,611 మంది పరీక్షలు రాస్తారు. ఈనెల 20 వరకు రోజూ ఉదయం 9- 12గంటల వరకు, సాయంత్రం 2-5 గంటల వరకు.. రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి
* కరోనా వైరస్ కలకలం రేగిన నేపథ్యంలో ప్రభుత్వం నివారణ చర్యలను ముమ్మరం చేసింది. రాష్ట్రంలో వివాహ వేడుకలను వాయిదా వేయాలని ప్రజలకు సూచనలు జారీ చేసింది. వేడుకలకు వైరస్ ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలు రావడం వల్ల వ్యాధి వేగంగా వ్యాపిస్తుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంది.
* గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు మరో వారం పాటు గడువు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు.
* పింఛన్ల చెల్లింపులో ఇవాల్టి నుంచి సరికొత్త విధానం అమల్లోకి రానుంది. ఇంటి వద్దే లబ్ధిదారులకు నేరుగా చెల్లించే పద్ధతి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో 54 లక్షల64 వేల మందికి ఒకే రోజు పింఛన్లు ఇవ్వనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించారు.
* ఏపీ రాజధాని అమరావతి చుట్టూ 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధి చిన్నాభిన్నమైంది. రూ.వేల కోట్ల సంపద ఆవిరయింది. బాహ్యవలయ రహదారికి సమీపంలో, ఆవల ఉన్న వ్యవసాయ భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. జధానుల గురించి డిసెంబరు17న ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీలో ప్రస్తావించకంటే ముందు వరకు ఎకరా రూ.30లక్ష పలికిన భూములు ఇప్పుడు రూ.15లక్షలు, రూ.10లక్షలకు తగ్గిపోయాయి.
* కరోనా వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న హుబి ప్రావిన్సు నుంచి భారతీయులు శనివారం ఉదయం 7:30 గంటలకు దిల్లీకి చేరుకున్నారు. కేంద్రం శుక్రవారం వీరికోసం ప్రత్యేకంగా ఓ ఎయిరిండియా విమానాన్ని వుహాన్‌కు పంపిన విషయం తెలిసిందే. ప్రావిన్సు మొత్తంలో 600 మందికిపైగా భారతీయులు ఉండగా.. వారిలో 400 మంది స్వదేశానికి వస్తామని అభ్యర్థించడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టింది. వీరిలో ప్రస్తుతం 324 మంది భారత్‌కు చేరకున్నారు. మరికొంత మందిని తీసుకురావడానికి ఈరోజు మరో విమానం వెళ్లనుంది. ఇవాళ వచ్చిన విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 56 మంది ఇంజినీర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు ఉన్నట్టు సమాచారం.
* అమరావతి ఉద్యమం దిల్లీని తాకనుంది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ గత కొంతకాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో 16 మంది రైతులు గన్నవరం విమానాశ్రయం నుంచి దిల్లీ పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలు, రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాతో పాటు కేంద్ర మంత్రులను కలిసి వివరించనున్నారు.
* కరోనా వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న హుబి ప్రావిన్సు నుంచి భారతీయులు శనివారం ఉదయం 7:30 గంటలకు దిల్లీకి చేరుకున్నారు. కేంద్రం శుక్రవారం వీరికోసం ప్రత్యేకంగా ఓ ఎయిరిండియా విమానాన్ని వుహాన్‌కు పంపిన విషయం తెలిసిందే. ప్రావిన్సు మొత్తంలో 600 మందికిపైగా భారతీయులు ఉండగా.. వారిలో 400 మంది స్వదేశానికి వస్తామని అభ్యర్థించడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టింది. వీరిలో ప్రస్తుతం 324 మంది భారత్‌కు చేరకున్నారు. మరికొంత మందిని తీసుకురావడానికి ఈరోజు మరో విమానం వెళ్లనుంది. ఇవాళ వచ్చిన విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 56 మంది ఇంజినీర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు ఉన్నట్టు సమాచారం.
*రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2020-21) సీట్లు భారీగా పెరగనున్నాయి. మొత్తం సీట్లలో కనీసం 60 శాతం భర్తీ అవుతున్న కాలేజీలకు కొత్త కోర్సులు, అదనపు సెక్షన్లు మంజూరు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు కళాశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 12వ తేదీ వరకు గడువు ఇచ్చింది.
*పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు టీకాల పంపిణీ కార్యక్రమం శనివారం నుంచి మొదలు కానుంది. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం రఘునాథపూర్లో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 84 లక్షల జీవాలకు టీకాలు వేయనున్నట్లు మంత్రి తలసాని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
*రాష్ట్రంలో ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కల్పించాలని, ఇందుకోసం ఐక్య పోరాటం చేయాలని పలు సంఘాల నేతలు పేర్కొన్నారు. ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితి(టీఆర్పీఎస్) ఆధ్వర్యంలో ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్తో శుక్రవారం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
*రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలు, నదుల్లోని నీళ్లు ఏ దిశ నుంచి ఎటువైపుగా ప్రవహిస్తున్నాయి.. సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఏయే మండలాల పరిధిలోని పొలాలకు చేరుతున్నాయి.. కాలువల సమీపంలో ఉన్న చెరువులు ఎన్ని..వాటిని నింపడానికి ఎంతమేరకు వీలుంది.. గొలుసు కట్టు చెరువులు ఏ తీరులో ఉన్నాయి.. అనే సమగ్ర సమాచారాన్ని వెల్లడించే నీటిపారుదల వ్యవస్థ పటాలను నీటిపారుదల శాఖ సిద్ధం చేసింది. నూతన సాంకేతికత ఆసరాతో మాన్యువల్, సాఫ్ట్ కాపీలను రూపొందించింది. కేంద్రప్రభుత్వ పథకమైన హైడ్రాలిక్ ప్రాజెక్ట్-3 నిధులతో సంబంధిత కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలో ఉన్న 46వేల చెరువులకు గాను ప్రస్తుతం 38,510 చెరువులకు సంబంధించిన పూర్తిసమాచారాన్ని పటాల్లో నిక్షిప్తం చేశారు.
*దుమ్ముగూడెం టేల్పాండ్ పనులు, బిల్లుల చెల్లింపులపై నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ప్రాజెక్టు అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గతంలో టేల్పాండ్ పనులు చేపట్టిన గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల అంశం అపరిష్కృతంగా ఉంది.
*ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత కొంత పెరిగింది. ఈశాన్య భారతం నుంచి వీస్తున్న తేమగాలులు మధ్యభారతం నుంచి వంపు తిరిగి తెలంగాణ వైపు వస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. దీంతో ఆదిలాబాద్లో శుక్రవారం తెల్లవారుజామున కనిష్ఠ ఉష్ణోగ్రత 10.7 డిగ్రీలకు పడిపోయినట్లు చెప్పారు. రామగుండంలో 15.8. నిజామాబాద్లో 16.9, హైదరాబాద్లో 18.3 డిగ్రీలుంది. శుక్రవారం పగలు హైదరాబాద్లో 30.7, రామగుండంలో 29.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
*తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగించే రాకెట్లను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్ధం చేస్తోంది. దీనిద్వారా 500 కిలోల బరువున్న ఉపగ్రహాలను రూ.30-35 కోట్లతోనే కక్ష్యలోకి పంపవచ్చు. తొలి ప్రయోగం 4 నెలల్లో జరిగే వీలుంది. ఈ రాకెట్ ద్వారా సూక్ష్మ, మినీ, మధ్య శ్రేణి ఉపగ్రహాలను ప్రయోగించవచ్చని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ టి.వి.హరిదాస్ ఇక్కడ జరిగిన సదస్సులో చెప్పారు. దీనివల్ల వాణిజ్యపరంగా ఇస్రోకు భారీ ప్రయోజనం కలుగుతుందన్నారు. ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ (సీఎన్ఈఎస్) డైరెక్టర్ రాబిన్ జైల్స్ మాట్లాడుతూ చంద్రమండలంపై పరిశోధనల కోసం రెండు దేశాలు కలసి ఒక నమూనాను రూపొందించవచ్చని సూచించారు.
*ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న గ్రామ సందర్శన ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభించే అవకాశం ఉంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా వెళ్లేలా నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక తీరు, ఇప్పటికే అమలవుతున్న పథకాల లబ్ధిదారుల వివరాలను పారదర్శకంగా బహిర్గతం చేస్తున్నారా? లేదా వంటి విషయాలపై ముఖ్యమంత్రి ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిసింది. ఇందులో ఏమైనా తేడాలున్నా సంబంధిత అధికారులను బాధ్యులను చేయనున్నారు.
*గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 7వ తేదీవరకు గడువు పెంచినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. మొదట ప్రకటించిన ప్రకారం శుక్రవారంతో గడువు ముగిసిందని, వివిధ జిల్లాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువు పెంచామని చెప్పారు. గ్రేడ్-2 గ్రామ వ్యవసాయ సహాయకుల పోస్టులకు విద్యార్హతలను సడలిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నందున అలాంటి వారందరికి దరఖాస్తు చేసుకోడానికి తగిన సమయం అవసరమని భావిస్తున్నామని ఆయన వివరించారు.
*రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ పింఛను కానుక పథకం కింద కొత్త పింఛన్ల పంపిణీని శనివారం ప్రారంభించనున్నారు. అర్హత వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు, తలసేమియా, సికెల్సెల్ ఎనీమియా, తీవ్ర హీమోఫీలియా, తీవ్రబోదకాలు, పక్షవాతం తదితర వ్యాధులతో బాధపడేవారికి కొత్తగా ప్రభుత్వం పింఛన్లు అందించనుంది.
*అక్రమాస్తుల వ్యవహారంలో హాజరు నుంచి మినహాయింపునివ్వాలంటూ వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను సీబీఐ కోర్టు అనుమతించింది. సీబీఐ దాఖలు చేసిన 11 కేసుల్లో తనకు బదులుగా తన న్యాయవాది హాజరుకు అనుమతించాలంటూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వివరిస్తూ ఆయన తరఫు న్యాయవాది ఎన్.నవీన్కుమార్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు.
*దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న బిల్లుల చెల్లింపులు వెంటనే చేపట్టాలని నవ్యాంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆసుపత్రుల స్థాయి అనుసరించి రూ.50లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉందని అధ్యక్షుడు బి.నరేంద్రరెడ్డి తెలిపారు. రూ.700 కోట్ల చెల్లింపులు ఆర్థికశాఖ ద్వారా అనుబంధ ఆసుపత్రులకు త్వరలో జరుగుతాయని రెండు నెలల నుంచి అధికారులు చెబుతున్నా ఇంకా అమలుకాలేదని తెలిపారు.
*రాష్ట్ర వ్యాప్తంగా ఎల్టీ, హెచ్టీ విద్యుత్తు కనెక్షన్లను విద్యుత్తు శాఖ పరిశీలించి.. ఎంత సామర్థ్యం ఉన్న కెపాసిటర్లు ఏర్పాటు చేయాలనే దానిపై సూచన ఇవ్వనుంది. రూ.500 ఖర్చుతో కెపాసిటర్ ఏర్పాటు చేసుకుంటే.. సర్ఛార్జ్ పేరిట రూ.5-6వేల మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండబోదని విద్యుత్తు శాఖ వినియోగదారులకు అవగాహన కల్పించనుంది. 2020-21 విద్యుత్తు టారిఫ్పై రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విద్యుత్తు ఛార్జీలతో కలిపి కెపాసిటర్ సర్ఛార్జ్ని డిస్కంలు వసూలు చేస్తున్నాయని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందాయి.
*ప్రకాశం జిల్లా మార్కాపురం ఓఎస్డీగా పనిచేస్తున్న సమయంలో ఓ దోపిడీలో ప్రమేయంపై అభియోగాలు ఎదుర్కొంటున్న అదనపు ఎస్పీ సి.సమయ్జాన్రావుపై అప్పట్లో విధించిన సస్పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. తనపై సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ గతేడాది సెప్టెంబరు 19న ఆయన ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దీనిపై నవంబరు 15న సమీక్షించిన ప్రభుత్వం ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని డీజీపీకి సూచిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్కుమార్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.
*షెడ్యూల్ ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని ధిక్కరించిన అక్రమ నిర్మాణదారులపై ప్రభుత్వం కేసులు (ఎల్టీఆర్) నమోదు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజయ్య, ప్రధాన కార్యదర్శి అప్పలనర్స కోరారు. ఈ మేరకు విజయవాడలోని కమిషనర్ కార్యాలయంలో డైరెక్టర్ రంజిత్బాషాను శుక్రవారం కలిసి వారు వినతినిచ్చారు.
*కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలోని బందరు తాలూకా పోలీసుస్టేషన్లో 2015లో నమోదైన ఓ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఎమ్మెల్యేలు/ఎంపీలపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ కోసం విజయవాడలో ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానంలో ఈ కేసు సీసీ నెంబర్ 17/2019 సంఖ్యతో ప్రస్తుతం విచారణలో ఉంది. ఐపీసీ సెక్షన్ 143, 341, 427, 435, 353, 149 కింద నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి.
*తిరుపతి, చిత్తూరు, విజయనగరం, కర్నూలు నగరపాలక సంస్థలకు ఎన్నికల అధికారులను (రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్) రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నియమించింది. ఎన్నికల నిర్వహణకు పట్టణ, స్థానిక సంస్థల వారీగా అధికారుల పేర్లు పంపాలని ఎన్నికల సంఘం ఇటీవల సూచించింది. ఈ మేరకు మొదటి దశలో వచ్చిన ప్రతిపాదనలను ఆమోదించింది.
*విశాఖ డెయిరీ పాల ధరను లీటరుకు రూ.రెండు, అర లీటరుపై రూపాయి పెంచినట్లు డెయిరీ యాజమాన్యం శుక్రవారం తెలిపింది. నిత్యం డెయిరీ నుంచి సుమారు 6లక్షల లీటర్ల పాలను విక్రయిస్తారు. దీంతో సరాసరి రోజుకు ప్రజలపై రూ.12లక్షల భారం పడనుంది. పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి.
*ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న గ్రామ సందర్శన ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభించే అవకాశం ఉంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా వెళ్లేలా నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక తీరు, ఇప్పటికే అమలవుతున్న పథకాల లబ్ధిదారుల వివరాలను పారదర్శకంగా బహిర్గతం చేస్తున్నారా? లేదా వంటి విషయాలపై ముఖ్యమంత్రి ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిసింది. ఇందులో ఏమైనా తేడాలున్నా సంబంధిత అధికారులను బాధ్యులను చేయనున్నారు.