Health

ఊరగాయకు లైంగిక శక్తికి లింకు ఉందా?

Does Mango Pickle Has Sexual Health Benefits

ఊరగాయ తింటే లైంగిక శక్తి తగ్గుతుందా.. పెరుగుతుందా..

పచ్చళ్లు తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు. కానీ, వీటిని తినడం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఊరగాయలు తినడం వల్ల మగవారిలో లైంగిక శక్తి పెరుగుతందని చెబుతున్నారు. ఊరగాయల్లో ఉండే ప్రత్యేక గుణాలే దీనికి కారణమని చెబుతున్నారు. వీటిని తినడం వల్ల లైంగిక శక్తితో పాటు అనేక హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు.

​అందరూ మెచ్చే ఊరగాయ..

ఊరగాయ అంటే అందరూ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా తెలుగువారికి పచ్చళ్లంటే ప్రాణమనే చెప్పొచ్చు. ఎన్ని వెరైటీలు ఉన్నా ూరగాయలు ఉండాల్సిందే. అలా చాలా మంది ఎంతో ఇష్టపడతారు పచ్చళ్లు అంటే. భోజన సమయంలో తినడానికి ఎన్ని కొత్త రకాల వంటకాలు ఉన్నా ఊరగాయతో ఒక్క ముద్ద తింటే చాలు.. ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే. పేదవారైనా, ధనికులు అయినా పచ్చడి ముందు సమానమే అన్నట్లుగా అందరూ ఎంతో ఇష్టంగా పచ్చడితో అన్నం తింటారు.

​ఆరోగ్యానికి మేలు చేసే పచ్చళ్లు..

నిజానికీ పచ్చళ్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు. వీటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు. కానీ, పండ్లు, కూరగాయలతో నిల్వ చేసే పచ్చళ్లలో ఉండే బ్యాక్టీరియా వల్ల ఆరోగ్యాన్ని ఇస్తుందట. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు ఈ బ్యాక్టీరియా మేలు చేస్తుందని అధ్యయనాల్లో తేలింది. సాధారణంగా మామిడి, టమాట, దోస, అల్లం, చింతపండు వంటి కూరగాయలతో పచ్చళ్లు పెడుతుంటారు. ఇందులో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. పైగా పచ్చళ్లు తయారు చేయడానికి వాడే ఆవపిండి, మెంతిపిండి, కారం, ఉప్పు, నువ్వులు, వేరుశెనగ నూనె శరీరానికి మేలు చేస్తాయి.

లైంగిక సామర్థ్యం..

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఊరగాయ తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందట. తాజా పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైన్లుగా నిపుణులు గుర్తించారు. ఎందుకంటే.. ఊరగాయ తయారీల్లో నువ్వుల నూనె ఉపయోగిస్తారు. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు, ప్రోటీన్స్, విటమిన్ బి, ఖనిజాలు, పీచు, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దదంతో నిల్వ పచ్చళ్లలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కొలెస్టరాల్ అదుపులో ఉంటుంది. అంతే కాకుండా లైంగిక సమస్యలను దూరం చేసే ఎన్నో మంచి గుణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు..

​ఊరగాయల్లో విటమిన్స్..

ఇందులో శరీరానికి అవసరమయ్యే అనేక విటమిన్స్ ఉంటాయి. కారంలో విటమిన్ సి ఉంటుంది. ఇది యాంటీ యాక్సిడెంట్‌గా పనిచేసి గాయాలను త్వరగా మానేలా చేస్తుంది. అదే విధంగా ఇందులోనే విటమిన్ బి6, కె1, విటమిన్ ఏలు ఉంటాయి. వీటితో పాటు శరీరానికి అవసరమ్యే ఇనుము, పొటాషియం వంటి ఖనిజాలు కారం ద్వారా మనకు లభిస్తాయి. వీటితో పాటు ఇంగువ వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తవు. వీటితో పాటు… ఆవ గింజల్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది ఆస్తమా సమస్య నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలను నివారిస్తుంది. వీటితో పాటు అధిక రక్త పోటు తగ్గుతుంది. మెంతుల వల్ల శరీరంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

​పాలిచ్చే తల్లులకు మేలు..

ఊరగాయ తినడం వల్ల మరో బెనిఫిట్ ఏంటంటే.. వీటిని తినడం వల్ల ఇందులోని మెంతి పిండి కారణంగా పాలిచ్చే తల్లులకు పాల ఉత్పత్తి పెరుగుతుంది. అదే విధంగా, ఇందులోని ఎన్నో విటమిన్స్ వల్ల ఎముకలు కూడా బలంగా మారతాయని చెబుతున్నారు. అయితే, అన్ని విధాలుగా మంచిది కదా అని అధిక మొత్తంలో పచ్చళ్లను తినడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఏ ఆహార పదార్థాలు అయినా సరే మితంగా తింటేనే మంచిది.. అధికంగా తీసుకుంటే ఔషధమైనా విషంలా మారే అవకాశం ఉంటుంది కాబట్టి.. తక్కువ మోతాదులోనే వీటిని తీసుకోవడం మంచిది.