*విజయవాడ నగరంలో భారీగా నగదు పట్టుబడింది. ఆటోలో తరలిస్తున్న కోటి రూపాయల నగదును టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రెండ్రోజుల క్రితమే పట్టుకున్నా అధికారులు మాత్రం గోప్యంగా ఉంచి విచారిస్తున్నారు. నరసరావుపేటకు చెందిన ప్రముఖ బంగారు హోల్‌సెల్ వ్యాపారి సొమ్ముగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. బంగారం కొనుగోలుకు వెళ్తుండగా వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సొమ్ముకు పత్రాలు ఉన్నాయా? పన్ను చెల్లించారా? లేదా? అన్న అంశాలను పరిశీలిస్తున్నారు. పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు పెట్టకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
* భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట మండలం కుడుములపాడు వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటో-లారీ ఢీకొన్న ప్రమాదంలో 9మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
* పెద్దపల్లి జిల్లాలోని కమాన్‌పూర్ మండలంలోని దాసరిపల్లె గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామశివారులో గల వ్యవసాయ భూమిలో దమ్ము కొడుతుండగా అకస్మాత్తుగా ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ సిరామాండ్ల లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మృతిచెందాడు.
* అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని పురుగుల మందు తెచ్చుకున్నాడు.మద్యంలో కలుపుకుని తాగుతుండగా.. అతని ఫ్రెండ్ అక్కడికి వచ్చాడు. తనకూ మద్యం పోయాలని అడగడంతో నిరాకరించాడు. పురుగుల మందు కలిపానని చెప్పాడు. మద్యం పోయాల్సి వస్తుందని అబద్ధం చెబుతున్నాడని భావించిన ప్రెండ్.. అమాంతం మద్యం తాగేశాడు. దీంతో ఇద్దరూ మృతి చెందిన విషాద సంఘటన ఏపీ రాజధాని అమరావతి పరిధిలో చోటుచేసుకుంది.
* వృద్ధాప్య పింఛను పోయి.. వితంతు పింఛను రాకపోవడంతో ఓ వృద్ధురాలు బోరున విలపించిన హృదయవిదారక వైనం శనివారం వీరఘట్టంలో చోటు చేసుకుంది. గతంలో వీరఘట్టంలోని వృద్ధురాలైన ఓ వితంతువుకి వితంతువు పింఛన్ కాకుండా వృద్ధాప్య పింఛనుగా అధికారులు రాశారు. వితంతువు పింఛన్ అని బాధితురాలు వారితో మొరపెట్టుకున్నప్పటికీ.. ఫర్వాలేదు వృద్ధాప్య పింఛన్ వస్తుంది కదా.. అని అధికారులు చెప్పడంతో ఆ వృద్ధురాలు వృద్ధాప్య పింఛన్ తీసుకుంటోంది.
* జిల్లాలోని కమాన్‌పూర్ మండలంలోని దాసరిపల్లె గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామశివారులో గల వ్యవసాయ భూమిలో దమ్ము కొడుతుండగా అకస్మాత్తుగా ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ సిరామాండ్ల లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మృతిచెందాడు
* బాహ్యవలయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
* మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గంభీరావుపేట మండలం పెద్దమ్మ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది.
* బాహ్యవలయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
*వనస్థలిపురంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
*హెరాయిన్ తరలిస్తున్న ఇద్దరు డ్రగ్ స్మగ్లర్లను లుథియానా స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) పోలీసులు అరెస్టు చేశారు.
*దొంగల ఆగడాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోయింది. మనిషి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారికి కావాల్సింది ఎలాగైనా లాక్కెల్లడమే ధ్యేయంగా దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, విజయవాడలోని భవానిపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
*తిహార్ జైలులో ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ఓ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన రాజేష్ అనే ఖైదీ జైలు గదిలోనే ఆత్మహత్యకు యత్నించాడు. జైలు వార్డర్లు వెంటనే రాజేష్ ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిహార్ జైలు ఖైదీ మరణించాడు. నిర్భయ దోషులున్న తిహార్ జైలులో ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో తిహార్ జైలు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
*పెయింట్లో కలిపే టిన్నర్ తయారీ పరిశ్రమలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగి 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామ శివారులో ఉన్న పరిశ్రమలో ట్యాంకర్లలో ముడి రసాయనాన్ని నింపుతున్న క్రమంలో రియాక్టర్ యంత్రాలకు ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం జరిగి మంటలు రేగాయి.
*జనగామ జిల్లా రఘునాథ పల్లి మండలం ఖిల్లా షాపూర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తారా ఇండస్ట్రీస్ టిన్నర్ పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రియాక్టర్లకు ఛార్జింగ్ పెడుతుండగా పరిశ్రమలో మంటలు చెలరేగాయి.
*భవానీపురంలో మహిళ దారుణహత్యకు గురైంది. మహిళ గొంతుకోసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. హత్యకు గురైన మహిళ పాండు హోటల్ సమీపంలోని ఓ ఇంట్లో నివసించే యేదుపాటి పద్మావతిగా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. హత్య జరిగిన ప్రాంతంలో కారం చల్లడంతో క్లూస్ టీం ఆధారాల కోసం పరిశీలిస్తోంది.
*కొడుకునిచ్చి పెళ్లి చేయవలసిన యువతిపైనే ఒక వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడిన దిగ్ర్భాంతికర సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. నాగపట్టిణం పోలీసుల కథనం ప్రకారం… నిత్యానందం అనే వ్యక్తి వేదారణ్యంలో బట్టల దుకాణం నడుపుతున్నాడు.
*తన కుమార్తె పుట్టినరోజు వేడుకని 23 మంది పిల్లలను పిలిచి, తర్వాత వారిని బందీలుగా చేసిన దుండగుడిని పోలీసులు మట్టుబెట్టారు. బాలలందర్నీ సురక్షితంగా రక్షించారు. ఒక్కో చిన్నారికి రూ.కోటి చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసిన అతడి భార్యను గ్రామస్థులు రాళ్లతో కొట్టి చంపారు.
*ఫిలిప్పీన్స్కి గత కొన్నేళ్లుగా వందల మంది విద్యార్థులను ఎంబీబీఎస్, ఎండీ కోర్సులకు పంపుతూ పన్ను ఎగవేతకు పాల్పడుతున్న ట్రాన్స్వరల్డ్ ఎడ్యుకేర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ డేవిడ్ కె.పిళ్లైని అరెస్టు చేసినట్లు జీఎస్టీ నిఘా విభాగం జాయింట్ డైరెక్టర్ కిరణ్రెడ్డి తెలిపారు.
*ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్లో గురువారం అర్ధరాత్రి ఒక స్లీపర్ బోగీని గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. ఈ నెల 13న సదరన్ రైల్వే మదురై డివిజన్ నుంచి ఆదిలాబాద్కు వచ్చిన బోగీని ప్లాట్ఫాంలకు అవతలి వైపున నిలిపి ఉంచారు. సాధారణ మరమ్మతుల కోసం దీన్ని మరో రెండు రోజుల్లో లాలాగూడ గ్యారేజీకి పంపించాల్సి ఉంది. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బోగీని కాల్చివేసినట్లు అనుమానిస్తున్నారు.
*శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్టాబ్యారేజీ వద్ద గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎస్సై గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం.. ‘విశాఖపట్నం కోరమండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులు ఒడిశాలోని పర్లాఖెముండి సమీపంలోని సెంచూరియన్ యూనివర్సిటీలో ఒక సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
*రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) పోలీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన ముంబయి-చెన్నై మెయిల్ ఎక్స్ప్రెస్ రైలులో కడప జిల్లా పరిధిలో జరిగింది. ఉత్తరప్రదేశ్ శరన్పూర్ జిల్లా షూతేడా గ్రామానికి చెందిన రవీంద్ర సింగ్ పన్వార్(37) కడప జిల్లా ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు.
ఉలిక్కి పడిన విజయవాడ-నేరవార్తలు
Related tags :