దాతల దాతృత్వంతో గ్రామీణ ప్రాంతంలో నిర్మించిన సంజీవని ఆసుపత్రికి మంచి భవిష్యత్తు ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టీస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం కూచిపూడిలో సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రి నిర్వహణపై విమర్శలు సరికాదని, ప్రతిఒక్కరూ సహకారం అందించాలని ఆయన సూచించారు. ఆసుపత్రికి తన వంతు సహకారం ఉంటుందన్నారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ రానున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో ప్రసూతి సేవలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆరునెలల్లో పూర్తి స్థాయిలో వైద్య సౌకర్యాలు అందించాలన్న సంకల్పంతో ఉన్నామన్నారు. గత రెండు నెలలుగా యూరాలజిస్టుగా కూచిపూడిలో వైద్యసేవలు అందించిన డా.వేములపల్లి జగన్మోహనరావును(అమెరికా) జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సత్కరించారు. ఎల్ఐసి సీనియర్ డివిజినల్ మేనేజర్ సూర్యనారాయణ పలువురు వైద్యులు పాల్గొనారు. గతంలో ఆసుపత్రిలో రూ.15 లక్షలు అందించిన డాక్టర్ నూతక్కి రామకృష్ణ(అమెరికా) రూ.14 లక్షలు సాయంతో త్వరలో ఆసుపత్రికి అందించనున్నట్లు ప్రకటించారు.
సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రికి ఉజ్జ్వల భవిష్యత్తు
Related tags :