టీమిండియా మాజీ బౌలర్ ఆర్‌పీ సింగ్‌కు క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లో చోటు దక్కిన విషయం తెలిసిందే. శుక్రవారం సౌరవ్ గంగూలీ అధ్యక్షతన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రకటించిన ముగ్గురు సభ్యుల సీఏసీలో ఆర్‌పీ సింగ్ అనూహ్యంగా ఎంపికయ్యాడు. ఈ జాబితాలో మాజీ ఆటగాడు మదల్‌లాల్, సులక్షన్ నాయక్‌తో పాటు ఆర్‌పీ సింగ్‌లు ఉన్నారు. వీరి పదవీకాలం ఏడాది కాలం పాటు ఉండనుంది. మరొకవైపు సెలక్షన్ కమిటీలోకి ఇద్దరు సభ్యులను తీసుకోనున్నారు. ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో సందీప్ సింగ్ (నార్త్ జోన్), జతిన్ పరాంజపే (వెస్ట్ జోన్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్ జోన్) మరో ఏడాది కొనసాగనుండగా, పదవీకాలం పూర్తి చేసుకున్న సెలెక్టర్లు ఎమ్మెస్కే ప్రసాద్ (సౌత్ జోన్), సెలెక్టర్ గగన్ ఖోడా (సెంట్రల్ జోన్) స్థానాలను బీసీసీఐ భర్తీ చేయనుంది. చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ఎంఎస్‌కే ప్రసాద్ పదవీ కాలం గత సెప్టెంబర్‌తోనే ముగియగా, అతనికి మరో కొన్నినెలలు పని చేయడానికి అవకాశం కల్పించారు.
MSKకు మరో అవకాశం
Related tags :