Food

బీపీ సంహారిణి…పెరుగు

Yogurt Monitors And Controls Blood Pressure

పెరుగు తింటే బీపీ తగ్గుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

చాలా మంది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఇంట్లోనే దొరికే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వాటికి చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి ఆ సమస్యలు ఏంటి.. వాటికి తీసుకోవాల్సిన పరిష్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

​కరివేపాకుతో డయాబెటీస్ దూరం..

నేటి కాలంలో షుగర్ వ్యాధి చాలా కామన్ అయిపోయింది. 30 ఏళ్లు దాటిన చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొంతమందికి ఆ వయసుకి ముందే ఈ సమస్య వచ్చేస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా.. ఇది శరీరాలపై దాడి చేస్తుంది. అయితే, ఈ సమస్యక కరివేపాకు బాగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కరివేపాకులోని ఎన్నో గొప్ప గుణాలు చాలా వరకూ డయాబెటీస్ వ్యాధిని దూరం చేస్తుందని చెబుతున్నారు. అయితే, ఇందుకు కరివేపాకులను నేరుగా తింటే ఫలితం ఉంటుంది. అలా కాదంటే పొడులు, పచ్చళ్లు చేసుకుని తినొచ్చని సూచిస్తున్నారు.

​పెరుగుతో హైబీపీ దూరం..

హై బీపీ ఇది ఒంట్లోకి చేరగా అనేక అనర్థాలకు దారి తీస్తుంది. హైబీపీ రాగానే ఈ సమస్యకి తోడుగా మరికొన్ని మన ఒంట్లోకి చేరతాయి. అందుకే ఈ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి కారణంగా హైబీపీ వస్తుంటుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను అన్వేషించండి. ఒకవేళ ఇదివరకే సమస్య వచ్చి ఉంటే… వారు పెరుగుని తినడం వల్ల సమస్య చాలా వరకూ అదుపులో ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. పెరుగుని నేరుగా అయినా తీసుకోవచ్చు లేదా మజ్జిగలా చేసుకుని తాగొచ్చు.

​అల్లంతో అసిడిటీకి చెక్..

కొన్ని సందర్భాల్లో అసిడిటీ సమస్య ఎదురవుతుంది. దీనికి నిద్రలేకపోవడం, ఆహారం ఎక్కువగా తీసుకోవడం, శరీరానికి పడని ఆహార పదార్థాలు తీసుకోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. వీటిన్నింటి వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సందర్భాల్లో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల సమస్యను దూరం చేసుకోవచ్చు. అందులో ముఖ్యమైనది అల్లం. వును.. అల్లం చక్కని ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి పొట్టలోని గ్యాస్‌ని బయటకు పంపిస్తాయి. దాంతో కడుపులో మంట, ఉబ్బరం, నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ఇందుకు చిన్న అల్లం ముక్కని నోటిలో పెట్టుకుని ఆ రసాన్ని అప్పుడప్పుడు మింగితే చాలా చాలా వరకూ సమస్య తగ్గుతుంది. అలా కాకుండా దీంతో టీ కూడా తయారు చేసుకుని తాగిని మంచి ఫలితం ఉంటుంది. అదెలా అంటే ఓ టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని రెండు కప్పుల నీటిలో వేసి 10 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడకట్టి చల్లారబెట్టండి. ఇప్పుడు ఆ టీ గోరువెచ్చగా కాగానే అందులో తేనె కలిపి తాగండి. ఇలా చేస్తుంటే చాలా వరకూ జీర్ణ సమస్యలు దూరం కావడమే కాకుండా, జలుబు, తలనొప్పి వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.

​కంటికి రక్షణగా తులసి..

ఎక్కువసేపు సిస్టమ్ వర్క్స్ చేసినా, డ్రైవింగ్ చేసినా, నిద్రలేకపోయినా ఇలా ఎన్నో కారణాల వల్ల కంటి సమస్యలు ఎదురవుతాయి. అంటే కళ్లల్లో మంట, కంటి నుంటి నుంచి నీరు కారడం ఇలాంటి సమస్యలకు తులసి బాగా పనిచేస్తుంది. అందుకోసం విటమిన్ ఎ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. ముఖ్యంగా తులసి ఆకులు.. ప్రతి రోజూ ఉదయాన్నే రెండు తులసి ఆకులని తీసుకోవడం వల్ల కంటి సమస్యలు చాలా వరకూ దూరమవుతాయి.

​నోటి దుర్వాసన పోవాలంటే..

కొంతమందికి నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇది ఎదుటి వారికి చాలా చిరాగ్గా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో లవంగాలు వేసుకుని నములుతూ ఉంటే సమస్య తగ్గుతుంది. వీటితో పాటు యాలకులు తిన్నాసమస్య పరిష్కారమవుతుంది. కాబట్టి నోటి దుర్వాసనతో బాధపడేవారు ఈ చిట్కాలను పాటించడం వల్ల సమస్య చాలా వరకూ తగ్గుతుంది.