Health

క్యాన్సర్ నిరోధానికి జీవనశైలిలో మార్పులు అవసరం

క్యాన్సర్ నిరోధానికి జీవనశైలిలో మార్పులు అవసరం

క్యాన్సర్ ఇపుడు ప్రాణాంతక వ్యాధి కాదు. ఎందుకంటే అలాంటి మందులు ఈ మహమ్మారిని ఎదుర్కోవటానికి వచ్చాయి. మందులకంటే ముందు నిత్య జీవితంలో రోజూవారీ జీవనశైలి వల్లే మంచి ఆరోగ్యం సమకూరుతుంది. రోజూ తీసుకునే ఆహారం, తాగేనీరు, పని, అలవాట్లు ఇవన్నీ కూడా ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగివుంటే చాలు ఎలాంటి ప్రాణాంతకమైన వ్యాధి నుంచైనా బయటపడవచ్చు. రోజూవారీ అలవాట్లలో మార్పులు చేసుకుంటే చాలని వైద్య నిపుణులు సైతం అంటున్నారు. క్యాన్సర్ రాకుండా మన నిత్యజీవితంలో ఐదు అతి ముఖ్యమైన అలవాట్లు చేసుకుంటే క్యాన్సర్ మన దరి చేరకుండా చేసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తుంది. కాని ఈ ఐదు అలవాట్లలో మార్పులు చేసుకోవటం వల్ల క్యాన్సర్ బారిన పడి ప్రతి ముగ్గురిలో ఒకరు మరణిస్తున్నారు. శరీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోవటం, పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవటం, వ్యాయామం చేయకపోవటం, ధూమపానం, మద్యపానం అలవాట్ల వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారని వైద్య నిపుణుల అధ్యయనాల్లో వెల్లడవుతోంది. కాబట్టి ఈ కింది అలవాట్లను నిత్యజీవితంలో ఒక భాగంగా చేసుకుంటే క్యాన్సర్ రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
*వెయిట్ లిఫ్టింగ్:
మెడిసిన్ అండ్ సైన్స్ ప్రచురించిన అధ్యయనం వల్ల బరువు తగ్గటం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు. బరువు పెరిగేవారికి పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశం 25శాతం తక్కువగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది. బరువులు ఎత్తడం వల్ల శరీరంలోని ఇన్సులిన్, గ్లూకోజ్ స్రావాలను సమతుల్యం చేయటం, రక్తంలో చక్కెర స్థిరంగా ఉంచటం ద్వారా పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఈ వెయిట్ లిఫ్టింగ్ అలవాటు వల్ల కిడ్నీ క్యాన్సర్ సైతం నివారించుకోవచ్చు.
*ఉల్లిపాయలు, వెల్లుల్లి:
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి చేర్చటం నిత్య జీవితంలో సర్వ సాధారణం. వీటిల్లో మంచి ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. క్యాన్సర్ నిరోధకాలు అధికం. రక్తపోటు స్థిరంగా ఉండటానికి సహాయపడతాయి. ఉల్లి, వెల్లుల్లి తీసుకోవటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 67శాతం వరకు తగ్గుతుందని బఫే, ప్యూర్డోరిక విశ్వవిద్యాలయాలు జరిపిన అధ్యయనాల్లో వెల్లడైంది.
నీరు ఎక్కువగా తీసుకోవటంశరీరానికి అవసరమైన నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నీరు తాగటం వల్ల శరీరంలోని విషాన్ని తొలగించుకోవటమే. అధికంగా నీరు తాగటం వల్ల టాక్సిన్స్ నిల్వ అవుతాయి. శరీరాన్ని శుభ్రం చేసే టాక్సిన్స్ మూత్రం ద్వారా విడుదల అవుతాయి. ఇది మూత్రాశయ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
*వేళకు భోజనం చేయటం
మంచి ఆహారం, సరైన నిద్ర మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. కొన్ని అధ్యయనాల వల్ల రాత్రి భోజనం, నిద్ర మధ్య కనీసం రెండు గంటలు గడిపే వారికి రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20శాతం తక్కువ. ఎందుకంటే జీర్ణంకాని ఆహారం సిర్కాడియన్ పనితీరును దెబ్బతీస్తుందని వైద్యులు అంటున్నారు. కాబట్టి త్వరగా భోజనం చేసి నిద్రపోండి. ఇందువల్ల శారీరక ఆరోగ్యం ఒనగూడుతుంది.సూర్యరశ్మితో చర్మాన్ని రక్షించుకోవటంవిటమిన్ డి లోపాన్ని నివారించుకోవటానికి సూర్యకిరణాలు శరీరానికి ఎంతగానో దోహదం చేస్తాయి. అదే సమయంలో సూర్యుడి హానికరమైన కిరణాలను శరీరంపై నేరుగా పడకుండా జాగ్రత్తవహించాలి. ఆ సమయంలో సన్స్క్రీన్ వాడితే సరిపోతుంది. మన దేశంలో చర్మ క్యాన్సర్ తక్కువ మందికే వస్తుంది. దీనికి కారణం మన చర్మంలో మెలనిన్. అయితే తగు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల చర్మ క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు.