దాదాపు అన్ని సీజన్లలో దొరికే జామపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. రోజుకో జామపండు తినడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. మిగతా పండ్లతో పోలిస్తే జామలో ఎన్నో పోషకాలున్నాయి.జామపండు తినడం వల్ల గ్యాస్ట్రిక్, అసిడిటీ సమస్యలు దూరం అవుతాయి. తీసుకున్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది. జామచెట్టు బెరడుతో కాసిన డికాషన్ తాగడం వల్ల పొట్టలోని నులిపురుగులు, ఇతర సూక్ష్మజీవులు నశిస్తాయి. తరచూ జామకాయ తినేవారికి మలబద్దక సమస్యలు ఎదురవవు.చాలామంది రకరకాల నోటి సమస్యలతో బాధపడుతుంటారు. చిగుళ్లు, దంత సమస్యలతో బాధపడే వారు తరచూ జామకాయలు తింటే ఆ సమస్యల్ని దూరం చేసుకున్న వారవుతారు. రోజూ రెండు, మూడు లేత జామ ఆకులు నమిలితే నోటి దుర్వాసన తగ్గిపోతుంది.చాలామంది బలహీనంగా ఉంటుంటారు. ఇలాంటి వారు జామలోని గింజలను తీసి ఆ గుజ్జును పాలు, తేనెతో కలిపి తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతారు. ఇందులోని విటమిన్ సి, క్యాల్షియం శారీరకంగా దృఢంగా మారుస్తుంది.జామ తినడం వల్ల క్షయ, ఉబ్బసం, బ్రాంకైటీస్, గుండె బలహీనత, కామెర్లు, హెపటైటిస్, జీర్ణాశయపు అల్సర్లు, మూత్రంలో మంట వంటి సమస్యలు దూరం అవుతాయి. కాలిన గాయాలతో బాధపడే వారు గుజ్జును ఆ ప్రాంతంలో రాయడం వల్ల ఉపశమనం పొందుతారు.మహిళల్లో గర్భ సమయంలో వాంతుల సమస్య ఎదురవుతుంది. అలాంటప్పుడు జామ బాగా పనిచేస్తుంది.
జామపండ్లతో ఆరోగ్య ధీమా
Related tags :