* సాలూరు మండలం జాతీయ రహదారిపై పోలీసులు చేపట్టిన వాహన తనికిల్లో భారీగా నగదు పట్టుబడింది. ఒడిశా నుoచి వస్తున్న కారులో భారీగా నగదు తరలిస్తున్నరన్న సమాచారం మేరకు తనిఖీ చేసి పట్టుకున్నారు. ఒడిశాలో అస్తి అమ్మిన డబ్బు అని బాధితులు తెలిపినా, సరైన పత్రాలు చూపకపోవడంతో ఒక కోటి పది లక్షల నలబై తొమ్మిది వేల ఆరు వందలు స్వాధీనం చేసుకున్నట్లు ఎఎస్‌పి సుమిత్ గౌడ్ తెలిపారు.
* తన ఆశ్రమంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద్‌కు బెయిల్ లభించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో లైంగిక దాడి కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. షహజన్‌పూర్‌లో లా కాలేజీలోఅడ్మిషన్ విషయమై తనకు సహాయపడిన చిన్మయానంద్..తనను ఏడాది పాటు లైంగికంగా వేధించాడని బాధిత విద్యార్థిని ఆరోపించిన విషయం విదితమే. కాలేజ్‌లోని హాస్టల్‌లో తాను స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసిన చిన్మయానంద్.. వాటిని వైరల్ చేస్తానని బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
* మాజీ మంత్రి కొమ్మారెడ్డి సురేందర్ రెడ్డి ఇకలేరు.కొంత కాలంగా క్రానిక్ డిసీజ్ తో బాధపడుతున్న ఆయన మాదాపూర్ లోని తన కుమార్తె నివాసంలో ఉంటున్నారు. ఆదివారం ఆరోగ్యం క్షీణించడంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.
* కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నిజామాబాద్ మాజీ ఎంపీ, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎం. నారాయణ రెడ్డి(89) ఆదివారం కన్నుమూశారు. నిజామాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు
* నల్లమల అభయారణ్యంలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగర్కర్నూల్జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామ సమీపం నుంచి అక్కమహాదేవి గుహలకు వెళ్లే పిల్ల బాటలో దుర్వాసన రావడంతో స్థానికులు శనివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి పరిశీలించగా ఓ మహిళ మృతదేహం పాక్షికంగా కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది.
* మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. జల్‌గావ్ జిల్లా హింగోలా గ్రామ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
* కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో ఓ వివాహిత మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. తమ కూతుర్ని అల్లుడే చంపి ఆత్మ హత్య చేసుకున్నదంటూ నమ్మించాలని చూస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
* మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లీ కొడుకుల సూసైడ్ చేసుకున్న ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది. నవాబు పేట మండలం కొల్లూరు గ్రామంలో.. ఖాళీగా ఉంటున్న కొడుకును చదువుకోవాలని తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన కొడుకు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుండు. తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయిన ఆ తల్లి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
* పొన్నూరు మండలం ములుకుదురులో దారుణం జరిగింది. గోపి అనే యువకుడు వ తరగతి విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తల్లిదండ్రులకు చెప్తే చంపేస్తానని బాలికను బెదిరించాడు. అయినా విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేయడంతో.. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాలిక తల్లిదండ్రులు రూరల్ ఎస్పీని ఆశ్రయిచారు.
* స్కూల్ బస్సు బోల్తా పడిన ప్రమాదంలో పది మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. నల్గగొండ జిల్లా నార్కట్ పల్లి గ్రామానికి చెందిన మహాత్మ స్కూలు బస్సు ఆదివారం ఉదయం 66 మంది స్టూడెంట్లు, 8 మంది టీచర్లతో టూర్కు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి వచ్చింది. పర్వేద గ్రామ శివారులోని వైల్డ్ వాటర్పార్క్ను చూసిన అనంతరం రాత్రి తిరిగి బయలు దేరారు. మొయినాబాద్ మండలం చిల్కూరు గ్రామ సమీపంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో పది మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో స్థానిక భాస్కర ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి అందరిని స్వస్థలానికి పంపించినట్లు మొయినాబాద్ పోలీసులు తెలిపారు.
* విశ్వ హిందూ మహాసభ ఉత్తరప్రదేశ్ యూనిట్ చీఫ్ రంజిత్ బచ్చన్(40) దారుణహత్యకు గురయ్యారు. మార్నింగ్ వాక్ చేసే సమయంలో ఓ దుం డగుడు రంజిత్ పై కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు.
* కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో స్పా, సెలూన్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో కేపీహెచ్‌బీ పోలీసులు ఆకస్మికంగా దాడిచేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
* ఇంజినీరింగ్ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై బి.తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం… పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన కిలుకూరి అలేఖ్య (19) మండలంలోని సూరంపాలెంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ సెకండ్ ఇయర్ చదువుతూ, అదే కళాశాలకు చెందిన హాస్టల్లో ఉంటోంది.
* హత్య చేయడమే కాకుండా.. శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఆధారాలు మాయం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ నేరంలో అతడికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.
* వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మండక గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. మండక గ్రామంలో నివాసముంటున్న గుడిపాటి సాయిరెడ్డి(75), సూర్యమ్మ(70) దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలే కారణమని బంధువులు చెబుతున్నారు.
*తమకు చెందిన భూమిలో తలపెట్టిన రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న అక్కాచెల్లెళ్లను నడిరోడ్డుపై కొట్టి, ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లో జరిగింది.
*మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. యావల్ తాలుకాలోని హింగోలా గ్రామ సమీపంలో ఎస్‌వీయూ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
*చెన్నై – కొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు డివైడర్ను ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జాన్ శాస్త్రి అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బళ్లారి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
*వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగల కారణంగా ఐదు వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా భద్రావతి తాలూకాలోని ఆయుధ కర్మాగార వసతిగృహ సముదాయంలో రెండు రోజుల క్రితం జరిగిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఆయుధ కర్మాగారం వసతి గృహ ప్రాంతంలో రెండు చిరుతలు సంచరిస్తున్నట్టు స్థానికులు రెండు రోజుల కిందట గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
*అంతర్రాష్ట్రీయ హిందూ మహాసభ ఉత్తర్ప్రదేశ్ అధ్యక్షుడు రంజిత్ బచ్చన్ (40)ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం దారుణంగా హత్య చేశారు. మార్నింగ్ వాక్కు వెళ్లిన సమయంలో ఆయనను దుండగులు కాల్చి చంపారు. ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూ హజ్రత్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రాథమిక ఆధారాల బట్టి కుటుంబ గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. గతంలో బచ్చన్ సమాజ్వాదీ పార్టీలో పనిచేశారు.
*పాఠశాలకు వెళ్లిన బాలికను ఓ ఆటో డ్రైవర్ ప్రేమ పేరుతో నమ్మించి అఘాయిత్యం చేసిన సంఘటన కాకినాడలో చోటు చేసుకుంది. మూడో పట్టణ లా అండ్ ఆర్డర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుమ్ములపేటకి చెందిన 20 ఏళ్ల మరుపల్లి దుర్గాప్రసాద్ అనే ఆటో డ్రైవర్ నగరానికి చెందిన 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత నెల 27వ తేదీన ఆమెను ఆటోలో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
*రూ.2కోట్లు ఇవ్వకపోతే నిన్ను కిడ్నాప్ చేయడమే కాకుండా హతమారుస్తామని గుర్తు తెలియని వ్యక్తులు నెల్లూరుకు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడికి ఫోనులో బెదిరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆయనకు నగరంలో పలు షాపింగ్ మాల్స్ ఉన్నాయి.
*అనుమతి లేకుండా బీఎడ్ కళాశాలను ఏర్పాటు చేసిన యాజమాన్యం, పరీక్షల హాల్ టికెట్లు జారీ చేయకుండా చేతులెత్తేసింది. హాల్టికెట్ల కోసం కళాశాలకు వచ్చిన విద్యార్థులకు, యాజమాన్యం సరైన సమాధానం చెప్పలేదు. పైగా బెదిరింపులకు పాల్పడింది
*తల్లి మందలించిందని మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై చంద్రయ్య కథనం ప్రకారం భగత్సింగ్నగర్ సమీపంలోని కాలనీకి చెందిన మహిళ జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలు. భర్త మృతిచెందడంతో కుమార్తె (18), కుమారుడుతో కలిసి ఆమె ఉంటోంది.
*నకిలీ దస్తావేజులతో భూమిని విక్రయించిన ప్రధాన నిందితుడితో సహా 9 మందిని కీసర పోలీసులు అరెస్టు చేశారు. నేరేడ్మెట్లోని మల్కాజిగిరి జోన్ డీసీపీ కార్యాలయంలో శనివారం డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వివరాలు వెల్లడించారు. మేడ్చల్ అత్వెల్లికి చెందిన జె.కృష్ణమోహన్రెడ్డికి కీసర మండలం నాగారంలో 245 గజాల స్థలం ఉంది.
*దిల్లీలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న షాహిన్ బాగ్ ప్రాంతంలో ఈ సారి కాల్పులు జరిగాయి. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వద్ద జరిగిన కాల్పుల ఘటన మరవక ముందే ఈ ఘటన చోటుచేసుకుంది.
*నకిలీ దస్తావేజులతో భూమిని విక్రయించిన ప్రధాన నిందితుడితో సహా 9 మందిని కీసర పోలీసులు అరెస్టు చేశారు. నేరేడ్మెట్లోని మల్కాజిగిరి జోన్ డీసీపీ కార్యాలయంలో శనివారం డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వివరాలు వెల్లడించారు.
*వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగల కారణంగా ఐదు వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా భద్రావతి తాలూకాలోని ఆయుధ కర్మాగార వసతిగృహ సముదాయంలో రెండు రోజుల క్రితం జరిగిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఆయుధ కర్మాగారం వసతి గృహ ప్రాంతంలో రెండు చిరుతలు సంచరిస్తున్నట్టు స్థానికులు రెండు రోజుల కిందట గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
*నల్లమల అభయారణ్యానికి భారీ అగ్ని ప్రమాదం ముప్పు త్రుటిలో తప్పింది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్ పరిధి అడవిలో శనివారం మంటలు వ్యాపించాయి. శ్రీశైలం వెళ్తున్న యాత్రికులు గుర్తించి, దోమలపెంట వద్ద విధులు నిర్వర్తిస్తున్న అటవీశాఖ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వారు తక్షణమే స్పందించారు. వటవర్లపల్లి సమీపంలోని ఎర్రకురువ వరకు మంటలు విస్తరిస్తున్నట్టు గుర్తించి ఆర్పేశారు. అప్పటికే సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం బుగ్గయినట్టు తేల్చారు. నాగర్కర్నూల్ డీఎఫ్వో జోజి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
*పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా నెల రోజులకుపైగా నిరసనలు జరుగుతున్న దిల్లీలోని షాహీన్బాగ్లో తుపాకీ కాల్పులు మరోసారి కలకలం రేపాయి. రెండు రోజుల క్రితం రామ్భగత్ గోపాల్శర్మ జరిపిన కాల్పుల్లో ఒకరు గాయపడిన విషయం తెలిసిందే.
*శ్రీకాకుళం జిల్లాలోని ఇసుక దందాపై ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది. దూసిలోని ఇసుక రేవును జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు, మైనింగు శాఖ ఏడీ శనివారం సందర్శించారు. అక్రమంగా ఇసుక తరలిస్తూ చిక్కిన 15 లారీలను స్వాధీనం చేసుకున్నామని.. రేవు నిర్వాహకుడు, కడపకు చెందిన హరినాథ్రెడ్డితో పాటు ఆరుగురిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. సాయంత్రం ఆరింటికే జిల్లా ఎస్పీ ఆమదాలవలస పోలీస్స్టేషన్కు చేరుకుని సిబ్బందితో సమీక్షించారు.
మాజీ కేంద్ర మంత్రికి బెయిల్-నేరవార్తలు
Related tags :