1. మేడారం జాతరకు వెళ్దామా! – ఆద్యాత్మిక వార్తలు – 03/02
తెలంగాణ కుంభమేళాకు వేళయింది. మేడారం మహాజాతరకు భక్తుల రాక మొదలైంది. వన దేవతలు కొలువుదీరిన పావన స్థలిని దర్శించుకోవడంతో మేడారం యాత్ర పూర్తవ్వదు. ఆధ్యాత్మిక ఆనందాన్ని చవిచూస్తూనే.. అక్కడి ప్రకృతి సోయగాలను దర్శించుకొండి. అమ్మల గద్దెల చుట్టూ ప్రదక్షిణలు చేయడమే కాదు.. సమీపంలోని పర్యాటక ఆకర్షణలూ చుట్టేసి రండి. ములుగు జిల్లా మూలమూలనా వెలుగుతున్న విహార కేంద్రాల వివరాలు మీ కోసం…
*రెండేళ్లకోసారి వచ్చే పండగ మేడారం మహా జాతర. ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి నాలుగు రోజుల పాటు వనమంతా జనంతో నిండిపోనుంది. పండగ రాకముందే అన్ని దారులూ మేడారం వైపు సాగుతున్నాయి. కుటుంబమంతా కలిసి ఎటైనా వెళ్తుందంటే.. అది మేడారం జాతరకే అయి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచీ భక్తులు ఇటుగా వస్తారిప్పుడు. జాతర జరిగే నాలుగు రోజులే కాదు.. తర్వాత కూడా రోజులకు రోజులు కోలాహలం కొనసాగుతుంది. జంపన్నవాగులో స్నానం, సమ్మక్క, సారక్క దర్శనం, బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకోవడంతో కాగల కార్యం తప్పక తీరుతుందని నమ్మకం. జాతర ముగిసిన తర్వాత కూడా నెల రోజుల పాటు మేడారానికి భక్తులు బారులు తీరుతుంటారు.
**గిరిజన వైభవం
ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. ఆదివాసీల అడ్డాగా ఉన్న మేడారంలో వారి జీవనశైలిని ప్రతిబింబించేలా గిరిజన మ్యూజియాన్ని 2018లో ప్రారంభించారు. వారి ఆచారాలు, వ్యవహారాలు కళాత్మకంగా దర్శనమిస్తాయిక్కడ. ఆదివాసీలు వాడే వాద్యాలు, ఔషధ మూలికలు చూడొచ్ఛు గత జాతర సమయానికే ప్రదర్శనశాల పూర్తయినా.. ఈసారి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. జాతర సందర్భంగా తాత్కాలిక యాంపీ థియేటర్ ఏర్పాటు చేశారు. ఇందులో సమ్మక్క సారలమ్మల వీరగాథలను ప్రదర్శిస్తారు. ఏడాదంతా ఏ సద్దూ లేకుండా కనిపించే మేడారం.. జాతర సమయానికి లక్షల్లో భక్తులతో, రంగు రంగుల డేరాలతో మహానగరాన్ని తలపిస్తుంది. వనమంతా ఆటపాటలతో, జానపద నృత్యాలతో, బుర్రకథలు, ఒగ్గుకథల ముచ్చట్లతో.. గిరిజన పథాన్నీ, జానపద వైభవాన్నీ కళ్లముందుంచుతుంది.
**వనం.. ఘనం:
మేడారం సమీపంలో ఉంటుంది తాడ్వాయి. ప్రకృతి రమణీయతకు ప్రత్యేకం ఈ ప్రాంతం. వారాంతపు విహార కేంద్రంగా అలరారుతున్న తాడ్వాయి దగ్గర వన కుటీరాల్లో బస కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ప్రకృతి పర్యాటకం పేరుతో అడవిలో నడక, నైట్ క్యాంప్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మేడారం జాతర నేపథ్యంలో తాడ్వాయిలో విలాసవంతమైన హరిత హోటల్‌ను ప్రభుత్వం నిర్మించింది. ఇక్కడ జాతర సమయంలో అతిథులకు ఘుమఘుమలాడే తెలంగాణ వంటకాలను ఏర్పాటుచేశారు. విందారగించి.. అడవి దాగిన అందాలను మనసారా ఆస్వాదించొచ్ఛు.తాడ్వాయి.. మేడారం నుంచి 14 కి.మీ. దూరంలో ఉంటుంది. **చూడప్ఫా. రామప్ప:
రామప్ప ఆలయం గురించి చిన్నప్పటి నుంచి పాఠాల్లో చదువుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పుడీ చారిత్రక ఆలయం యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీలో నిలిచింది. త్వరలో ఈ ఆలయం యునెస్కో కట్టడాల జాబితాలో చేరేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ క్రమంలో రామప్ప ఆలయం పరిసరాలను ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. పర్యాటకులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. మేడారం వెళ్లే దోవలోనే ఉన్న రామప్ప గుడి దర్శనీయ స్థలం. ఆలయ శిల్ప వైభవ దర్శనంతో పాటు రామప్ప సరస్సు సౌందర్యాన్నీ చూడొచ్ఛు.రామప్పగుడి.. మేడారం నుంచి 60 కి.మీ. దూరంలో ఉంటుంది.
**సరస్సు సరసన..
లక్నవరం అనగానే అందమైన సరస్సుతోపాటు భారీ తీగల వంతెన కళ్ల ముందు మెదులుతుంది. ఈ వంతెనకు తోడు కొత్తగా మరో తీగల వంతెనను నిర్మించి ప్రారంభించారు. దీంతో సరస్సు మరింత ఆకర్షణీయంగా మారింది. ఇక పర్యాటకులకు మరింత వినోదాన్ని పంచడానికి జింకల పార్కును నెలకొల్పారు. లక్నవరం ఫెస్ట్ పేరుతో అటవీ శాఖ తరచూ సంబరాలు చేస్తోంది. ఎడ్ల బండిపై విహారం, డేరాల్లో బసతో రోజంతా సరస్సు సరసన గడిపేలా ప్యాకేజీలను సిద్ధం చేశారు.లక్నవరం సరస్సు.. మేడారం నుంచి 38 కి.మీ. దూరంలో ఉంటుంది.
**సమీపంలో మరెన్నో:
మేడారం పరిసర ప్రాంతాలన్నీ పర్యాటక కేంద్రాలే. మంగపేట మండలంలోని హేమాచలం లక్ష్మీ నర్సింహ స్వామి దేవాలయం ఆధ్యాత్మిక దివ్య ధామంగా విరాజిల్లుతోంది. ఏటూరునాగారం సమీపంలోని ముల్లకట్ట వంతెన దగ్గర పాములా మెలికలు తిరిగి పరవళ్లు తొక్కే గోదారమ్మను చూడొచ్ఛు ఏటూరు నాగారం అభయారణ్యంతోపాటు తాడ్వాయి సమీపంలో రాక్షస గుహలుగా పిలిచే ఆదిమానవుల సమాధుల దగ్గరికీ వెళ్లొచ్ఛు సొంతవాహనంలో వెళ్తే.. రెండు రోజుల్లో ఇవన్నీ చూసి రావొచ్ఛు అయితే, ప్రధాన జాతర జరిగే ఫిబ్రవరి మొదటి వారం మేడారం పరిసర విహార కేంద్రాలకు పర్యాటకులను అనుమతించరు. ఫిబ్రవరి రెండో వారం నుంచి ఈ ప్రదేశాలకు వెళ్లిపోవచ్ఛు
2. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వేదపండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు ప్రసాదాలు అందజేశారు.
3.శివయ్య కల్యాణం..తరించె భక్తజనం
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ సమేత జడల రామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం వేకువజామున జరిగిన కల్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. భక్తులు తన్మయత్వంతో చేసిన శివనామ స్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
4.చిలుకల గుట్టపై పూజారులకు హక్కు పత్రాలు
మేడారం సమ్మక్క అమ్మవారు కొలువుదీరిన సుమారు 800 ఎకరాల చిలుకలగుట్ట వనంపై పూజారులకు హక్కు పత్రాలు జారీ చేసినట్లు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ వెల్లడించారు. జాతర ఏర్పాట్ల పరిశీలనకు ఆదివారం మేడారం వచ్చిన వారు హక్కు పత్రాలను పూజారులకు అందజేశారు. ఎంతో ఉన్నతమైన ఉద్దేశంతో ప్రభుత్వం జారీ చేసిన హక్కు పత్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిలుకలగుట్టపై పర్యావరణం దెబ్బ తినకుండా కాపాడాల్సిన బాధ్యతను తీసుకోవాలన్నారు. వనం గుట్టకూ హక్కు పత్రాలు జారీ చేయాలని మేడారం పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్ ఆలం రామ్మూర్తి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు కోరారు. ముఖ్యమంత్రితో చర్చించి అందుకు కృషి చేస్తామని మంత్రి దయాకర్రావు వారికి హామీ ఇచ్చారు.
5.రేపటి నుంచి పాతగుట్టలో బ్రహ్మోత్సవాలు
యాదాద్రి క్షేత్రానికి అనుబంధమైన పాతగుట్ట ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి మొదలుకానున్నాయి. వారం పాటు ఉత్సవాల నిర్వహణకు యాదాద్రి దేవస్థానం ఏర్పాట్లు చేపట్టింది. విష్వక్సేన ఆరాధనతో మొదలయ్యే బ్రహ్మోత్సవాలు ఈ నెల 10న నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగుస్తాయని యాదాద్రి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్.గీత తెలిపారు. బ్రహ్మోత్సవాలకు ముందస్తుగా చేపట్టిన అధ్యయన వేడుకల్లో ఆదివారం ఉదయం శ్రీ రామాలంకరణ, రాత్రి వైకుంఠ నాథుడిగా స్వామిని తీర్చిదిద్ది సేవోత్సవాలు జరిపారు.
6. వారి సర్వదర్శనానికి 4 గంటల సమయం..
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు నాలుగు కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. శ్రీవారి టైం స్లాట్, సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 84762 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
7. తిరుమల\|/సమాచారం **
ఓం నమో వేంకటేశాయ!!
• ఈరోజు సోమవారం,
03.02.2020
ఉదయం 6 గంటల
సమయానికి,
తిరుమల: 13C°-26C°
• నిన్న 84,762 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 04 కంపార్ట్మెంట్
లలో సర్వదర్శనం కోసం
భక్తులు వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
04 గంటలు
పట్టవచ్చును,
• నిన్న 25,369 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
₹: 2.20 కోట్లు,
• నిన్న 21,850 మంది
భక్తులకు శ్రీ పద్మావతి
అమ్మవారి దర్శన భాగ్యం
కలిగినది,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
/ / గమనిక / /
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
ఫిబ్రవరి విశేషం
• ఫిబ్రవరి 9న పౌర్ణమి
గరుడ సేవ, శ్రీ రామకృష్ణ
తీర్థ ముక్కోటి.
• ఫిబ్రవరి 21న గోగర్భ
తీర్థంలోని క్షేత్రపాలకునికి
మహాశివరాత్రి వేడుకలు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ
పూర్వా సంధ్యా ప్రవర్తతే,
ఉత్తిష్ఠ నరశార్దూల
కర్తవ్యం దైవమాహ్నికమ్
తా: కౌసల్యాదేవికి
సుపుత్రుడవగు ఓ
రామా! పురుషోత్తమా!
తూర్పు తెల్లవారుచున్నది.
దైవ సంబంధములైన
ఆహ్నికములను
చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి
ttd Toll free
#18004254141
8. నేత్రపర్వంగా రామలింగేశ్వరుడి కల్యాణం
మంగళవాయిద్యాలు.. వేదమంత్రాల నడుమ నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరుడి కల్యాణ మహోత్సవం ఆదివారం తెల్లవారుజామున నేత్ర పర్వంగా సాగింది. ఆది దంపతుల పరిణయ వేడుకను తిలకించేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో చెర్వుగట్టు కిక్కిరిసింది. స్వామివారికి ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్ర్తాలను నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పార్వతమ్మ దంపతులు సమర్పించారు.తొలుత విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, కన్యాదానం తదితర ఘట్టాలను నిర్వహించగా, సరిగ్గా బ్రహ్మ ముహూర్తంలో శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు తలంబ్రాల బియ్యం సమర్పించేందుకు పోటీపడ్డారు.
9. మేడారం వనదేవత సమ్మక్క కుంకుమ బరిణె రూపంలో కొలువై ఉన్న చిలుకలగుట్టను ప్రభుత్వం ఆదేవత పూజారులకు రాసిచ్చింది. 2006 అటవీ హక్కుల చట్టంలో భాగంగా మేడారం సమీపంలో ఉన్న 800 ఎకరాల విస్తీర్ణంలోని చిలుకలగుట్టను సిద్దబోయిన జగ్గారావుసిద్దబోయిన మునేందర్కొక్కెర కృష్ణయ్యతోపాటు సమ్మక్క పూజారులను హక్కుదారులుగా చేరుస్తూ పట్టాను జారీచేసింది. ఆదివారం మేడారంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావుసత్యవతి రాథోడ్ పూజారులకు పట్టా పాస్‌పుస్తకాన్ని అందజేశారు.
10. భయం – భక్తి:నమ్మకం
వారము – క్షురకర్మ – ఫలితాలు (వారాహీసంహిత – గర్గాది మహర్షులు)
వారము ఫలితము
ఆదివారము – ఒక మాసము ఆయువు తగ్గిపోతుంది
సోమవారముము ఏడు మాసములు ఆయువు వృద్ధి చెందును. పుత్రులు కోరుకునే గృహస్థులు, ఒకే ఒక పుత్రుడు గలవారు సోమవారంనాడు క్షవరము చేయించుకోనగూడదు.
మంగళవారముము ఏనిమిది మాసములు ఆయువు తగ్గిపోతుంది
బుధవారముము ఐదు మాసములు ఆయువు వృద్ధి చెందును
గురువారముము పది మాసములు ఆయువు వృద్ధి చెందును. లక్ష్మిని కోరుకునేవారు గురువారమునాడు క్షవరము చేయించుకోనగూడదు
శుక్రవారముము పదకొండు మాసములు ఆయువు వృద్ధి చెందును
శనివారముము ఏడు మాసములు ఆయువు తగ్గిపోతుంది
*పూజా ప్రక్రియలో నిషిద్ధకర్మలు
గృహంలో దేవతా విగ్రహాలు బొటనవేలు కన్నా పెద్దగా ఉండరాదు. మంత్ర పుష్పం, సుప్రభాతం కుర్చుని చదవరాదు. ఈశ్వరుడుకి పవళింపు సేవ నిలబడి చేయరాదు. బొట్టు, విభూతి లేదా కనీసం బొట్టు అయిన లేకుండా పూజ చేయకూడదు. ఈశ్వరుడికి, గురువుకి ఒక చేతితో నమస్కారం చేయరాదు అలా చేస్తే పైజన్మలో చేతులు లేకుండా జన్మించటం కానీ, మధ్యలో చేతులు పోవటం కానీ జరుగుతాయి. ఈశ్వరుడికి వీపు చూపరాదు. ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు. ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. ఆ దీపారాధనతో పుల్లలు కానీ, సాంబ్రాణికడ్డికానీ, హారతికర్పూరంకానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు. పూజ సమయమున ఈశ్వరుడు మన కంటే ఎత్తులోవుండాలి, అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి. ఎడం చేయి పూజా విధులలో నిషేధం.
*ఇక ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు.
ఈశ్వర నిర్మాల్యం కాలితో తొక్కరాదు. అలాచేస్తే ఈ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కూడా నశించును. రుద్రాక్షలు ధరించేవారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు.
*స్త్రీలకి నిషిద్ధకర్మలు.
స్త్రీలు తులసీదళాలు తుంచ రాదు. పురుషులు మాత్రమే తుంచ వలెను. పౌర్ణమి, అమావాస్యనాడు, రవి సంక్రమణ, తైలాభ్యంగనస్నానం చేసిననూ త్రిసంధ్యలకాలంలో, మైలరోజులలో, రాత్రి ధరించి ఉన్న దుస్తులతోను, స్నానం చేసి శుభ్రమైన వస్త్రం ధరించకుండా, తులసిని తుంచిన నూ మహాపాపం. అలా చేయడం అంటే సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు శిరస్సునే తుంచినట్లే. స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగరాదు. ఇలా స్త్రీలు చేస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అశుభం. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. స్త్రీలు జుట్టు విరబోసుకుని భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం. బయటకి వెళుతున్నపుడు స్త్రీ జుట్టు విరబోసుకుని కనపడితే వెనక్కి ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కుని కొంచం సేపు కుర్చుని వెళ్ళాలి. స్త్రీలు తాటంకాలు (చెవి దిద్దులు) లేకుండా భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం.
*పురుషులకి నిషిద్ధకర్మలు
ధర్మపత్ని జీవించి ఉండగా పురుషుడు పరస్త్రీ సంగమం చేయరాదు అలాచేస్తే, సంవత్సరం పాటు వెళ్ళిన ఇంటికి వెళ్ళకుండా వెళ్లి తను చేసిన తప్పు చెప్పి ఆ ఇంట్లో వాళ్ళు వేసిన భిక్షమాత్రమేస్వీకరిస్తూ జీవించాలి. పూర్తిగా శిరోముండనం చేసుకోకూడదు కనీసం శిఖ ఉంచుకోవాలి. అలా చేసుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పూర్తిగా శిరోముండనం చేసుకుంటే వైదిక క్రియలకి పనికిరాదు. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమా, సంక్రాంతి, వ్యతిపాతము, విష్టి, ఇత్యాదులయందు, వ్రత దినములయందు, శ్రాద్ధ దినముల యందు, మంగళ, శనివారముల యందు క్షురకర్మ పనికిరాదు.
మేడారం కుంభమేళాకు సమయం ఆసన్నమైంది
Related tags :