ఎల్లలు దాటినా.. మన భారతీయ సంస్కృతిని మరువలేదు. అమెరికాలోనూ మన కల్చర్ ను చాటారు చిట్టిపొట్టి విద్యార్థులు. భూకైలాసం నాటకంతో అలరించారు. శనివారం డల్లాస్ సిటీలోని మనబడిలో జరిగిన కార్యక్రమంలో NRIల పిల్లలు అద్భుతంగా నటించారు. పాత్రలకు తగ్గట్టుగా వేషధారణలతో నాటకం వేశారు.ప్రస్తుతం భారతదేశంలో కొంతమంది యువత పాశ్చత్య అలవాట్లతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారని.. కానీ మన దేశం గౌరవాన్ని విదేశాల్లోనూ చాటాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు స్కూల్ యాజమాన్యం. చిన్నప్పటి నుండే మన రామాయణం, భారతం, భూకైలాసం, భగవద్గీత లాంటివి పిల్లలకు తెలియజేయాలని తెలిపారు స్టూడెంట్స్ తల్లిదండ్రులు.
డల్లాస్‌లో మనబడి భూకైలాస్
Related tags :