NRI-NRT

పార్లమెంటులో తానా మాజీ అధ్యక్షులు

TANA Ex-Presidents In Parliament Campus In Delhi

ఏపీ రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ పార్లమెంట్‌ ఎదుట తానా మాజీ అద్యక్షులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్న తానా మాజీ అద్యక్షులు కోమటి జయరాం, నాదెళ్ళ గంగాధర్, వేమన సతీష్ లు సోమవారం నాడు డిల్లి చేరుకున్నారు. పార్లమెంటుకు వెళ్లి రాష్ట్రానికి చెందిన పలువురు పార్లమెంటు సభ్యులను ఇతర కేంద్ర మంత్రులను కలిసి ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వినతిపత్రాలు అందజేసారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు అమరావతిని కొనసాగించాలని ప్రదర్శనలు చేసారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి వినతిపత్రం అందించడానికి అపాయింట్ మెంటు కోసం ఎదురు చూస్తున్నామని కోమటి జయరాం.. TNI కు తెలిపారు. మరో రెండురోజుల పటు తాము దిల్లిలోనే ఉంటామని కేంద్ర హోంమంత్రిని, ఉపరాష్ట్రపతిని, ఇతర మంత్రులను, పార్లమెంటు సభ్యులను కలవబోతున్నామని తెలిపారు. ఈ బృందం వెంట వర్జీనియాకు చెందిన మేకా రాఘు కూడా ఉన్నారు.