బిట్‌కాయిన్ అనేది ఒక వర్చువల్ కరెన్సీ. దీనిపై ఏ ప్రభుత్వ నియంత్రణా ఉండదు.ఈ కరెన్సీని ఏ బ్యాంకూ జారీ చేయదు.ఇది ఏ దేశానికీ చెందిన కరెన్సీ కాదు కాబట్టి దీనిపై ట్యాక్స్ అనేదే ఉండదు.ఇది పూర్తిగా రహస్య కరెన్సీ. ఈ కరెన్సీని ప్రభుత్వానికి తెలియకుండా రహస్యంగా దాచిపెట్టుకోవచ్చు.దీనిని ప్రపంచంలో ఎక్కడైనా నేరుగా అమ్మెయ్యవచ్చు, కొనుక్కోవచ్చు.దీన్ని కొన్ని దేశాలు నిషేధించాయి. మరి కొన్ని దేశాలు దీనిపై ఆంక్షలు విధిస్తున్నాయి.అక్కడక్కడా బయట బిట్‌కాయిన్ నాణేలు కనిపిస్తుంటాయి. ఇవి డమ్మీలు మాత్రమే. వాటిలో ముద్రించిన కోడ్ మాత్రమే ఉపయోగపడుతుంది.
**ఇది ఎలా పని చేస్తుంది?
బిట్‌కాయిన్ అనేది కంప్యూటర్‌లో దాచుకునే ఒక ఫైల్ లాంటిది.స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్లలో “డిజిటల్ వాలెట్” రూపంలో దాచుకోవచ్చు.వ్యాపారులు బిట్‌కాయిన్‌ను అనుమతిస్తే డిజిటల్ వాలెట్ ద్వారా బిల్లు చెల్లించవచ్చు.మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వారు తమ డిజిటల్ వాలెట్ నుంచి బిట్‌కాయిన్లను మీ వాలెట్‌కు పంపొచ్చు.డిజిటల్ వాలెట్ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ రికార్డు అవుతుంది. ఈ విధానాన్ని బ్లాక్ చెయిన్ అంటారు.ఈ కరెన్సీ కేవలం కోడ్ రూపంలో ఉంటుంది కాబట్టి దీనిని ఎవరూ జప్తు చేసుకోలేరు, ఎవరూ దీనిని నష్టపర్చలేరు.
**ఇవి ఎక్కడ దొరుకుతాయి?
మూడు పద్ధతుల్లో బిట్‌కాయిన్లు పొందొచ్చు.మన దగ్గర ఉన్న చట్టబద్ధమైన నగదుతో బిట్‌కాయిన్లను కొనొచ్చు.ఏదైనా సరుకును విక్రయించినపుడు కొనుగోలుదారు నుంచి స్వీకరించవచ్చు.కంప్యూటర్ ద్వారా సృనష్టించొచ్చు.
**బిట్‌కాయిన్లను కొత్తగా ఎలా సృష్టిస్తారు?
బిట్ కాయిన్లను కొత్తగా సృష్టించాలంటే శక్తిమంతమైన కంప్యూటర్లు కావాలి.నెట్‌వర్క్ పరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు 24 గంటలూ పర్యవేక్షిస్తూనే ఉండాలి.కొత్త కాయిన్లు సృష్టించడాన్ని మైనింగ్ అంటారు.బిట్‌కాయిన్లు సృ్ ష్టించాలంటే చాలా సమయం పడుతుంది.ఇప్పుడు మైనింగ్ ప్రారంభిస్తే ఒక కాయిన్ సృష్టించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది.చివరకు బిట్‌కాయిన్ విలువ కంటే మీరు దాన్ని తయారు చేయడానికి పెట్టిన ఖర్చే ఎక్కువ అవుతుంది.
**వీటికి ఇంత విలువ ఎందుకు?
బంగారం, వజ్రాల మాదిరిగానే బిట్‌కాయిన్లు కూడా చాలా పరిమితంగా లభిస్తాయి.మరోవైపు ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.అందువల్ల సరఫరా-డిమాండు సూత్రం ప్రకారం దీనికి గిరాకీ పెరుగుతోంది.
**వీటిని ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు?
ప్రభుత్వాల నియంత్రణ ఉండదు కనుక కొంత మంది బిట్‌కాయిన్లను ఇష్టపడుతున్నారు.అన్ని లావాదేవీలు నమోదు అవుతాయి కానీ వాటిని ఎవరు చేశారో బయటకు తెలియదు.తమ లావాదేవీల వివరాలు బయటకు తెలియకూడదు అనుకునే వారు బిట్‌కాయిన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
**బిట్‌కాయిన్లు భద్రమేనా?
బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలో ప్రతి లావాదేవీ బహిరంగంగా రికార్డు అవుతుంది.కాబట్టి నకిలీ బిట్‌కాయిన్లను తయారు చేయడం కుదరదు. ఇతరుల వాటితో లావాదేవీలు జరపలేం.బిట్‌కాయిన్ వాలెట్ పోయే ప్రమాదం ఉంది. వాలెట్‌లోని కాయిన్లను తొలగించే ముప్పు కూడా ఉంది.మీరు బిట్‌కాయిన్లు దాచుకున్న వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైతే కాయిన్లు అన్నీ పోయే అవకాశాలు ఉన్నాయి.2009లో తొలిసారి దీన్ని సృష్టించారు. తాజాగా ఇది 9624 డాలర్ల మార్కును చేరుకుంది.
బిట్‌కాయిన్ అంటే ఏమిటి? మీ ఇంట్లో తయారు చేయవచ్చా?
Related tags :