Agriculture

2020 మొఘల్ గార్డెన్స్ వేళలు

2020 Mughal Gardens India Timings And Schedule

మోడ్రన్‌‌‌‌ ఆర్ట్‌‌‌‌ గులాబీలు, ఐస్‌‌‌‌బెర్గ్‌‌‌‌,తులిప్‌‌‌‌లు, లిల్లీ పూలతో దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి ఎస్టేట్‌‌‌‌లో ఉన్న మొఘల్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌ ముస్తాబైంది.వివిధ రకాల పూలతో పర్యటకులను ఆహ్వానిస్తోంది. మొఘల్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌ లో కి ఈ నెల 5 నుంచి మార్చి 8 వరకు విజిటర్స్‌‌‌‌ను అనుమతిస్తామని ప్రెసిడెంట్ గార్డెన్‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌ పీఎన్‌‌‌‌. జోషి ఆదివారం చెప్పారు.10వేల తులిప్‌‌‌‌ బల్బ్స్‌ , 138 రకాల గులాబీలు, 5 వేల సీజనల్‌‌‌‌ ఫ్లవర్స్‌‌‌‌ విజిటర్స్‌‌‌‌ను ఆకట్టుకుంటాయని అన్నారు. గత ఏడాది మొనాకో దేశానికి చెందినప్రిన్స్‌‌‌‌ ఆలబర్ట్‌‌‌‌ – II నాటిన మొక్క “ గ్రేస్‌‌‌‌ దీ మొనాకో”ప్రత్యేకమని ఆయన చెప్పారు. ‘టీ కప్పు తులిప్‌‌‌‌’,‘జమ్మూపింక్‌‌‌‌ తులిప్‌‌‌‌’ ఈ సారి స్పెషల్‌‌‌‌ అని నిర్వాహకులు చెప్పా రు. ప్రతి ఏటా దాదాపు 3 నుంచి 6 లక్షలమంది విజిటర్స్‌‌‌‌ ఈ గార్డెన్‌‌‌‌ను సందర్శిస్తారు.జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌లోని మొఘల్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌, తాజ్‌‌‌‌మహల్‌‌‌‌ చుట్టూఉన్న గార్డెన్స్‌‌‌‌ను చూసి ఇన్స్‌‌‌‌పైర్‌‌‌‌‌‌‌‌ అయిన ఎడ్విన్‌‌‌‌ లు టయన్స్‌‌‌‌ అనే ఆర్కిటెక్చర్‌‌‌‌‌‌‌‌ ఈ గార్డెన్స్‌‌‌‌ను డిజైన్‌‌‌‌ చేశారు. కోల్‌‌‌‌కతాలోని బల్విదేర్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ నుంచి తెచ్చిన గడ్డి,చైనా ఆరెంజ్‌‌‌‌, మౌల్‌‌‌‌సరీ, సిప్రెస్‌‌‌‌ మొక్కలతో గార్డెన్‌‌‌‌ను అందంగా తీర్చిదిద్దారు. మొఘల్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌కు వచ్చే పర్యటకులు రాష్ట్రపతి భవన్‌‌‌‌ మ్యూజియంను కూడా సందర్శించవచ్చు. మొఘల్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌లోని వివిధ రకాల రోజాపూలకు ప్రముఖుల పేర్లను పెడతారు. మాజీ రాష్ట్రపతిప్రణబ్‌ ముఖర్జీ, మదర్‌‌‌‌‌‌‌‌ థెరిస్సా, యూఎస్‌‌‌‌ మాజీ ప్రెసిడెంట్‌‌‌‌ జాన్‌‌‌‌ ఎఫ్‌‌‌‌ కెనడీ, క్వీన్‌‌‌‌ ఎలిజబెత్‌ , జవహర్‌‌‌‌‌‌‌‌లాల్‌‌‌‌ నెహ్రూ పేర్లు పెట్టారు. వీటితో పాటు కొన్ని రకాలకుక్ట్రిస్టి యన్‌‌‌‌ డియోర్‌‌‌‌‌‌‌‌, అమెరికన్‌‌‌‌ హెరిటేజ్‌‌‌‌, ఫస్ట్‌‌‌‌ప్రైజ్‌‌‌‌,కిస్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌, డబుల్‌‌‌‌ డిలైట్‌‌‌‌లాంటి పేర్లను కూడా పెట్టారు. గ్రీన్‌‌‌‌ రోజ్‌‌‌‌, ఒక్లహామా, బొన్నే న్యుయిట్‌‌‌‌,బ్లూన్‌‌‌‌మూన్‌‌‌‌, లేడీ ఎక్స్‌‌‌‌ లాంటి అరుదైన రోజా పూలరకాలు ఉన్నాయి.