వినికిడి లోపాన్ని కొందరు చాలా రోజులదాకా నిర్లక్ష్యం చేస్తూ ఉండిపోతారు. అయితే ఎక్కువ కాలం ఇలా వినికిడి లోపంతో ఉండిపోయే వాళ్లు మతిమరుపు, దిగులు, మానసిక కుంగుబాటు వంటి సమస్యలకు గురవుతున్నారని ఇటీవల అధ్యయనాల్లో వెల్లడైంది. ఇలాంటి వారు తరుచూ పడిపోతూ, గాయాల పాలయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. వినికిడి సమస్య మొదలైన వెంటనే వినికిడి యంత్రం వాడితే ఈ సమస్యలు తలెత్తే అవకాశం బాగా తగ్గుతుంది. కానీ చాలా మంది వినియోగించరు. వారిలో స్త్రీలతో పోలిస్తే, పురుషులే ఎక్కువ. వినికిడి యంత్రాన్ని వినియోగించిన వారిని గమనిస్తే, వారిలో మతిమరుపు సమస్య 18 శాతం తక్కువ గా ఉంది. దిగులూ, ఆంధోళన, మానసిక కుంగుబాటు సమస్యలు 11శాతం తక్కువగానూ, పడిపోయి వైద్యచికిత్సలు పొందుతున్న వారు 13శాతం తక్కువగానూ ఉన్నట్లు బయటపడింది. ఏమై నా వినికిడి సమస్యను సాధారణమేలే అనుకోవడం అంటే, అది కొన్ని కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లే!
వినికిడి లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే…
Related tags :