ఏపీ ప్రభుత్వం ప్రతిస్తాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లు 2019ని కేంద్రం వెనక్కు పంపింది ఈబిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని.. వాటిని సరిచెయాలని సూచించింది. ఈదిశ బిల్లులో పొందుపరచిన ఏడవ షెడ్యుల్ లో ఎంట్రీలు సరిగాలేవని వాటిని సరిచేసి పంపాలని కేంద్రం సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కేంద్రం చెప్పిన సవరనల్ని సరిచేస్తే పనిలో ఉన్నారు. అధికారులు. కేంద్రం నుంచి ఏపీ అసెంబ్లీకి బిల్లు రాగా అక్కడి నుంచి ప్రభుత్వానికి చేరింది. కేంద్రం సూచనలను అనుగుణంగా సాంకేతిక అంశాలను సరిచేసి మళ్ళీ త్వరలోనే బిల్లును కేంద్రానికి పంపిస్తారు. అక్కడ ఆమోదం పండిన తరువాత అక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గరకు వెళ్లనుంది. ఆయన కూడా ఆమోదించాక తర్వాత చట్ట రూపంలో దిశ యాక్ట్ అమల్లోకి వస్తుంది. ఇదిలా ఉంటె దిశ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం తన కసరత్తును ముమ్మరం చేసింది. దిశ పోలీస్ స్టేషన్ లు ప్రారంభించేందుకు రంగం సిడం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ ఏడవ తేదీన దిశా పోలీస్ స్టేషన్ వన్ స్టాప్ సెంటర్ ను ముఖ్యమంత్రి జగన్ చేతులు మీదుగా ప్రారంభం కానున్నాయి. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో దిశ స్పెషల్ యాప్ ను, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ ను ప్రారంభించనున్నారు.
దిశా బిల్లును తిప్పి పంపిన కేంద్రం

Related tags :