సరకు రవాణా చేసే కార్గో బస్సులపై తన ఫొటో పెట్టేందుకు తెలంగాణ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో జరిగిన ప్రచారంపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఆ ప్రయత్నాలను ఆయన తప్పుబట్టారు. కార్గో సర్వీసుల ద్వారా ఆర్టీసీ లాభాల్లో పయనించాలన్నదే తన లక్ష్యమన్నారు. బస్సులపై ఫొటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని.. ఫొటో ప్రతిపాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అందించాలే తప్ప.. దాంతో చౌకబారు ప్రచారం పొందడం తన అభిమతం కాదని అధికారుకులకు సీఎం స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అభిప్రాయంతో ఆర్టీసీ ఎండీకి సీఎంవో ప్రత్యేక కార్యదర్శి పి.రాజశేఖర్‌రెడ్డి నోట్ పంపారు. కార్గో బస్సులపై తన ఫొటో వేయొద్దని సీఎం స్పష్టం చేశారు.
నా బొమ్మలు పెట్టకండి

Related tags :