ప్రకాశం జిల్లాలో నాట్స్ మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేసింది. గత సంవత్సరం పొదిలి మండలం ముగాచింతల గ్రామంలో నిర్మించిన వాటర్ ట్యాంకులు సత్ఫలలితాలు ఇవ్వడంతో ఈసారి ఆముదాలపల్లి, కరవది గ్రామాలతో పాటు ఒంగోలు మండలంలో కూడా తాగునీటి ట్యాంకులు, నీటిశుద్ధి కేంద్రాలను గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ (గ్లో) సహాకారంతో నిర్మించింది. వీటిని తాజాగా నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి, గ్లో సంస్థ కార్యదర్శి వెంకన్న చౌదరితో కలిసి ప్రారంభించారు. ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉపయోగపడే వాటర్ ట్యాంకులను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి అన్నారు. స్థానిక నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, గునుపూడి భాస్కర్, కాటూరి పెద్ద బాబు, గోనుగుంట్ల వెంకట్రావు, ఎనిమిరెడ్డి వెంకటరెడ్డి, నరసా రెడ్డి, బలరాం తదితరులు పాల్గొని శ్రీనివాస్, వెంకన్నలను సత్కరించారు.
ప్రకాశం జిల్లాలో నాట్స్ వాటర్ ట్యాంకులు ఏర్పాటు
Related tags :