*రాజధాని మార్పుపై కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని భాజపా ఎంపీ సుజనాచౌదరి వెల్లడించారు. రాజ్యంగంపరంగా న్యాయపర్మగా చూసినా రాజధానిని అంగుళం కూడా కదిలించాలేరన్నారు. అమరావతిలో కేవలం పరిపాలనా భవనాల కోసమే కాక పరిశోధనా సంస్థలు విద్యాలయాలు వివిధ కంపెనీల కోసం భూసేకరణ చేసారని అందుకే ప్రభుత్వం రూ.45 వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందన్నారు.
*ఊహాన్ లో పుట్టిన మహమ్మారి వైరస్ ప్రపంచం మొత్తం క్రమంగా వ్యాప్తిస్తోంది. ఇప్పటికే చైనాలో ని దాదాపుగా అన్ని ప్రాంతాలలో వ్యాపించింది ఈ వైరస్ వరిన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైరస్ వలన చైనాలో మొదట రోజు పది నుంచి ఇరవై మంది మరణించారు.
* గోద్రా అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఎప్రిల్ 14న విచారణ జరపనున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది.
* ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏదో ఒక రోజు హనుమాన్ చాలీసా చదువుతారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ఇవాళ కిరారిలో జరిగిన ప్రచార సభలో యోగి పాల్గొన్నారు.
*ఎన్నార్సీ అమలు పై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం వెల్లడించింది. దీనికి సంబంధించి దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా నేపద్యంలో హోంశాఖ కీలక ప్రకటన చేసింది లోక్ సభలోలిఖిత పూర్వకంగా దీనిపై సమాధానం ఇచ్చింది.
* ఆదాయానికి మించిన ఆస్తుల కేసు లలో రాష్ట్రంలో పలు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు..
1.శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం, ఐ టి డి ఎ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, శ్రీ టి. మోహన్ రావు, 2. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, సూపర్నెంట్ శ్రీ గంధం వెంకట పల్లం రాజు, 3. విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం మండలం తామరం గ్రామము పి.ఎ.సిఎస్ స్టాఫ్ అసిస్టెంట్ శ్రీ సీరం రెడ్డి గోవిందు .4. తూర్పు గోదావరి జిల్లా సీఈవో ఫర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్, కాకినాడ, శ్రీ లంకె రఘు బాబు. 5. కర్నూలు జిల్లా డిప్యూటీ కలెక్టర్, పి. ఎ. టు స్పెషల్ కలెక్టర్ శ్రీశైలం ప్రాజెక్ట్, శ్రీ సాకే సత్యం. అను వార్ల గృహములు పై, బంధువుల, బినామీల గృహముల పై ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి .
25 ఏసీబీ బృందా లు దాడులు జరుపుతున్నారు. భారీగా ఆస్తులు, నగలు, నగదు గుర్తింపు.
* దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ముగిసిన విచారణ
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ కమిషన్ విచారణ ముగిసింది. ఒక్కరోజులోనే విచారణను ముగించి జ్యుడీషియల్ కమిషన్ సభ్యులు అత్యవసరంగా ఢిల్లీ వెళ్లారు. సిట్ సమర్పించిన నివేదికను కమిషన్ పరిశీలించనుంది. నిందితుల పోస్టుమార్టం రిపోర్ట్‌ను… హైకోర్టు రిజిస్ట్రార్ సీల్డ్ కవర్‌లో కమిషన్‌కు సమర్పించారు. వారం తర్వాత మరోసారి కమిషన్ సభ్యులు హైదరాబాద్‌కు రానున్నారు.
* జై అమరావతి’ అని నినాదాలు చేసిన ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి చెందిన నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేసింది ANU యాజమాన్యం.అయితే పలు ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు నుంచి విమర్శలు రావడంతో..యాజమాన్యం వెనకడుగు వేసి సస్పెన్షన్ ఎత్తివేసింది.
* విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సీబీఐ కలకలం రేగింది. ప్రముఖ గుర్తింపు యూనియన్ నాయకుడు మంత్రి మూర్తిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ నిరుద్యోగి నుంచి రూ. లక్షలు డిమాండ్ చేశాడు. అలాగే స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కొంతమంది దగ్గర లక్షలు కాజేసిన యూనియన్ నాయకుడు మంత్రి మూర్తి.. రూ. వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా అధికారులు పట్టుకున్నారు. అలాగే మూర్తి నివాసంకార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.
* దాయాది దేశం పాకిస్తాన్ నుంచి దాదాపు మంది హిందువులు సోమవారం భారత్‌కు వచ్చారు. అత్తారి-వాఘా సరిహద్దు గుండా దేశంలోని వచ్చిన వీరు.. పాకిస్తాన్‌లో తాము తీవ్ర అభద్రతాభావంతో ఉన్నామనితిరిగి ఆ దేశానికి వెళ్లాలంటే భయంగా ఉందని చెప్తున్నారు. భారత పౌరసత్వం లభిస్తే సంతోషంగా స్వీకరిస్తామనిఇక్కడే సుఖంగా బతుకుతామని వేడుకుంటున్నారు. పాక్‌లో తమ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందనిముఖ్యంగా హిందూ బాలికలు కనిపిస్తే చాలు కిడ్నాప్ చేసేస్తున్నారని కొందరు మహిళలు చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాపోయారు. ప్రస్తుతం విజిటింగ్ వీసాలతో ఉన్న వీరంతా తమకు భారత పౌరసత్వం ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.
* ఏపీలో క్రైమ్ రేటు ఆరు శాతం తగ్గిందని హోంమంత్రి సుచరిత తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ మాట తప్పారన్నారు. ఆర్థికంగా ఏపీ ఎదిగేందుకు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలన్నారు. రాజధానిలో భూముల కొనుగోళ్ల వ్యవహారంపై ఈడీ దర్యాప్తు జరుగుతోందని సుచరిత వెల్లడించారు. అమరావతిని తరలిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అమరావతి ఎక్కడికి పోదని.. లెజిస్లేటివ్ రాజధాని ఇక్కడే ఉంటుందని సుచరిత స్పష్టం చేశారు.
* ఉత్తరాంధ్రలో మంగళవారం ఏసీబీ అధికారులు వరుస దాడులు చేపట్టారు. విశాఖపట్నం జిల్లా మాకవరం సొసైటీ బ్యాంకు ఉద్యోగి గోవింద ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో ముగ్గురు బ్యాంకు ఉద్యోగుల ఇళ్లల్లోను అధికారులు సోదాలు జరిపారు. మరోవైపు విజయనగరం జిల్లాలోను ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ మోహన్‌రావు ఇంట్లో సోదాలు జరిపారు. అంతేకాకుండా పార్వతీపురం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు.
*దేశ వ్యాప్తంగా పోలీసు సిబ్బందికి సంబంధించిన డేటాను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (సీబీఆర్‌డీ) వెల్లడించింది. 2019 నాటి వివరాలను క్రోడీకరించి ఈ గణాంకాలను రూపొందించింది. బీపీఆర్‌డీ సంచాలకుడు వీఎస్‌కే కౌముది సమక్షంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీటిని విడుదల చేశారు
*తూ.గో జిల్లా ఉప్పూడిలో గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చింది. గ్యాస్ లీకేజీని అదుపులోకి తెచ్చిన ఓఎన్జీసీ బృందం. రసాయనాలతో కూడిన బురద పంపింగ్ ద్వారా లీకేజీని అదుపులోకి తెచ్చారు. మూడ్రోజుల నుంచి లీకవుతున్న గ్యాస్‌ను ఓఎన్జీసీ బృందం కట్టడి చేయటంతో.. ఉప్పూడి పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
*పార్వతీపురం ఐటిడిఎ ఈ.మోహన్ రావు ఇంట్లో మంగళవారం ఎసిబి అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం ఎసిబి డిఎస్‌పి రమణమూర్తి ఆధ్వర్యంలో పార్వతీపురం ఎస్‌ఎన్‌పి కాలనీలో ఉన్న మోహనరావు ఇంట్లో ఈరోజు ఉదయం నుండి ఎసిబి తనిఖీలను చేపట్టింది. ప్రస్తుతం సోదాలు కొనసాగుతోన్నాయి
*తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలోని గంటివారిపేట వద్ద గ్యాస్ లీకేజీ నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. ప్లాన్-2 ప్రకారం మూడో రోజు ఓఎన్జీసీ, ఫైర్ సిబ్బంది గ్యాస్ లీకేజీ నియంత్రణ చర్యలు చేపట్టారు. బురదనీటిని గ్యాస్ బావిలోకి పంపించడం ద్వారా ప్రెజర్ తగ్గించి లీకేజీ వాల్వ్ క్లోజ్ చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
*కరోనా వైరస్ నౌకలో ప్రయాణిస్తున్న వారిని కూడా వదలలేదు. 3500 మంది ప్రయాణిస్తున్న జపాన్‌కు చెందిన ఓ క్రూయిజ్ షిప్‌లో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో యొకొహామా తీరానికి చేరిన ఆ నౌకను జపాన్ ప్రభుత్వం అక్కడే నిలిపి ఉంచింది. దీంతో ప్రయాణికులంతా 24గంటలుగా అందులోనే ఉండిపోయారు. వారందరికీ.. వైద్య పరీక్షలు చేసే వరకు వారిని బయటకు వదిలేది లేదని అధికారులు తెలిపారు.
*మాకవరపాలెం మండలం కోపరేటివ్ బ్యాంకు లో పనిచేస్తున్న శీరం రెడ్డి గోవిందా అనే సూపర్వైజర్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు..
*ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 7న జిల్లాకు రానున్నట్లు సమాచారం. ఆస్పత్రుల అభివృద్ధి పనులకు, జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. పార్వతీపురం, కురుపాం, సాలూరు, గజపతినగరం తదితర ఆసుపత్రుల అప్గ్రేడింగ్కు ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి తొలి జిల్లా పర్యటనలో భాగంగా ఈ పనులకు రిమోట్ కంట్రోల్ ద్వారా జిల్లా కేంద్రం నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం.
*రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 11న ప్రగతిభవన్లో జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. కొత్త రెవెన్యూ చట్టం, పట్టణ ప్రగతి ప్రధాన ఎజెండాగా సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలకమైన అంశాలను వారితో చర్చించనున్నారు. అవినీతికి ఆస్కారం లేని.. ప్రజలకు, రైతులకు పారదర్శకమైన కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని నిర్ణయించిన సీఎం క్షేత్రస్థాయిలో భూపరిపాలనలో ప్రత్యక్ష సంబంధం కలిగిన కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవాలని భావిస్తున్నారు.
*రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగంలో కీలకమైన మార్పులను చేపట్టింది. నాలుగు శాఖల్లోని కార్యదర్శులకు, ఆ శాఖల కమిషనర్ల బాధ్యతలను అప్పగించింది. రెండు బాధ్యతలు ఒకే అధికారికి పూర్తిస్థాయిలో అప్పగించడం ఇదే ప్రథమం. ప్రభుత్వ కార్యకలాపాల నిబంధనలు (బిజినెస్ రూల్స్)ను అనుసరించి ప్రతి శాఖలో శాఖాధిపతిగా కమిషనర్, ప్రభుత్వ పరిపాలన వ్యవహారాల బాధ్యునిగా కార్యదర్శి విధులు నిర్వహించాలి.
*రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ప్రాథమిక ప్రకటన జారీ చేసింది. సిరిసిల్ల జిల్లాలో వేములవాడ కేంద్రంగా చెందుర్తి, బోయిన్పల్లి, వేములవాడ అర్బన్, గ్రామీణ మండలాలతో ఒక రెవెన్యూ డివిజన్.. సంగారెడ్డి జిల్లా జోగిపేట కేంద్రంగా వట్పల్లి, చౌటకూరు, అందోలు, పుల్కల్ మండలాలతో మరో డివిజన్ ఏర్పాటయ్యాయి.
*ప్రభుత్వ భూముల్లోకి ఆక్రమణదారులు చొరబడుతున్నారని, అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని అధికారులకు తెలుసన్న విషయం అర్థమవుతోందని, వాటిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో మాత్రం తెలియడంలేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నా అధికారులు ఆదమరచి నిద్రపోతున్నారని తప్పుపట్టింది. అక్రమార్కులతో అధికారులు కుమ్మక్కవుతున్నారంటూ పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలవుతున్నాయని పేర్కొంది. వీటిపై ప్రశ్నించినపుడు కంటితుడుపు చర్యగా ఏవో చెబుతున్నారంది. ఇలాంటి సమాధానాలను ప్రభుత్వం విశ్వసిస్తే ఎంత ప్రమాదం ముంచుకొస్తుందో హైదరాబాద్ నగరాన్ని పరిశీలిస్తే తెలుస్తుందని పేర్కొంది.
*రాష్ట్రం ఆర్థిక సంక్షోభం దిశగా నడుస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాల కారణంగా ఆదాయం తగ్గుతోంది.. పెట్టుబడులు రావడం లేదని మండిపడ్డారు. ఎక్కువ అప్పులు తెచ్చుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలబెట్టారని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ జగన్పై విరుచుకుపడ్డారు.
*పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుండటం యాదృచ్ఛికం కాదని… ఇది జాతి ఐక్యమత్యాన్ని దెబ్బతీసే కుట్రపూరిత రాజకీయ ప్రయోగమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వీటి వెనుక ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్లు ఉన్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలే లక్ష్యంగా ఆయన విరుచుకుపడ్డారు. కర్కర్డూమాలో సోమవారం ఆయన భాజపా ఎన్నికల సభలో ప్రసంగించారు.
*వైద్యరంగంలో సూక్ష్మదర్శినులు కీలకప్రాత పోషిస్తున్నాయని, ఇతర దేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవడం కాకుండా దేశీయంగా అత్యాధునిక సూక్ష్మదర్శినిని రూపొందించాల్సిన అవసరముందని గవర్నర్ తమిళిసై శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. మానవాళి మనుగడకు వైరస్లు ప్రమాదకరంగా తయారవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు మరింతగా పరిశోధనలు జరగాలని ఆకాంక్షించారు.
*నాగార్జునసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా 72 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని విశ్రాంత ఇంజినీర్ల సంఘం పేర్కొంది. గోదావరి నుంచి సీతారామ ఎత్తిపోతల ద్వారా మళ్లించే నీటితోపాటు మున్నేరు నదిపై బ్యారేజీ నిర్మించడం ద్వారా 26 టీఎంసీలు కూడా వినియోగించుకోవచ్చని పేర్కొంది.
*ఏఐసీసీ రీసెర్చ్ విభాగం తెలంగాణశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 8న శనివారం ‘కేంద్ర బడ్జెట్- 2020-2021’ పై సెమినార్ నిర్వహిస్తున్నట్లు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆమీర్జావీద్ ఒక ప్రకటనలో తెలిపారు. బంజారాహిల్స్లోని ‘ముఫ్ఫఖమ్ ఝా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ’లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎంపీ పి.చిదంబరం ముఖ్యఅతిథిగా హాజరై ప్రధానోపాన్యాసం చేస్తారని తెలిపారు.
*ఏపీ ఎంసెట్ నిర్వహణ వరుసగా ఆరో దఫా కాకినాడ జేఎన్టీయూకు కేటాయించడం ఆనందంగా ఉందని, పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని వర్సిటీ ఉపకులపతి, ఏపీ ఎంసెట్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు తెలిపారు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 20 నుంచి 24వ తేదీ వరకు 10 సెషన్లలో నిర్వహిస్తామని తెలిపారు.
*పురపాలనలో రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను భాగస్వామ్యం చేసింది. ముఖ్యమైన కార్పొరేషన్లకు కమిషనర్లుగా నియమించింది. ఇప్పటి వరకూ వరంగల్, ఖమ్మంలకు మాత్రమే ఉండగా తాజాగా కరీంనగర్, నిజామాబాద్, రామగుండంలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన నిజాంపేట కార్పొరేషన్కు ఐఏఎస్ అధికారిని కమిషనర్గా నియమించారు. హైదరాబాద్కు సమీపాన ఉన్న నిజాంపేట రెండేళ్ల క్రితం వరకూ గ్రామ పంచాయతీ.
అమరావతిని అంగుళం కూడా కదిలించలేరు-తాజావార్తలు

Related tags :