తమ దేశానికి వచ్చే భారతీయ పర్యాటకులు రోజుకు రూ.1200 ఫీజును చెల్లించాలనే నిబంధన భూటాన్ దిగువ సభ ఆమోదాన్ని పొందింది. తమ దేశ సుస్థిరాభివృద్ది కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఈ నిబంధన బంగ్లాదేశ్, మాల్దీవుల నుంచి భూటాన్‌కు వచ్చే పర్యాటకులకు కూడా వర్తిస్తుంది. జులై నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. ఈ హిమాలయ రాజ్యం పర్యావరణానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తుందన్న సంగతి తెలిసిందే. కాగా భారత్ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భూటాన్ తెలిపింది. ఈ మూడు దేశాల నుంచి భూటాన్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య అంతకుముందు ఏడాది కంటే 2019లో 10 శాతం పెరిగింది. అయితే ఈ బిల్లు భూటాన్ నేషనల్ అసెంబ్లీలో ఇంకా చర్చల్లోనే ఉందని… ఈ ఫీజు నామమాత్రంగా పెరిగే అవకాశం ఉందని భారత అధికారులు అంటున్నారు.
భారతీయ పర్యాటకులపై భూటాన్ భారం
Related tags :