NRI-NRT

గుంటూరులో నాట్స్ క్రికెట్ పోటీలు

గుంటూరులో నాట్స్ క్రికెట్ పోటీలు-NATS Telugu Cricket Tournament In Guntur

నాట్స్ గుంటూరు జిల్లాలో టీ20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. స్థానిక కిట్స్ కాలేజీ యాజమాన్యంతో కలిసి నిర్వహించిన ఈ టోర్నమెంట్ లో దాదాపు 20 కాలేజీల నుంచి క్రికెట్ ఆటగాళ్లు తమ క్రీడా ప్రతిభను చాటేందుకు పోటీపడ్డారు. చుండి రంగనాయకులు కాలేజ్ టీం విజేతగా నిలవగా… వీవీఐటీ కాలేజ్ రన్నరప్ గా నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో విజేతలతో పాటు అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు రాజ్యసభ మాజీ సభ్యులు, అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్,గ్లో ఫౌండేషన్ కార్యదర్శి వెంకన్న చౌదరి, ఏపీఎన్.ఆర్.టి ఛైర్మన్ వెంకటరెడ్డిల చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఆటగాళ్లను నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి అభినందించారు. ఈ టోర్నమెంట్ విజయవంతానికి కృషి చేసిన కిట్స్ కాలేజీ ఛైర్మన్ కోయ సుబ్బారావు, కార్యదర్శి శేఖర్, ప్రిన్సిపల్ బాబు, ఫిజికల్ డైరెక్టర్ కె. వెంకట్రావులకు నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి ధన్యవాదాలు తెలిపారు.