Movies

నాగార్జున చిత్రానికి కొరోనా దెబ్బ

Akkineni Nagarjuna Shooting Affected By CoronaVirus

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో వైల్డ్ డాగ్ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సయామీ ఖేర్, దియా మీర్జా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం. ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో థాయ్లాండ్లో తర్వాతి షెడ్యూల్ జరిగేలా ప్లాన్ చేసింది. అయితే థాయిలాండ్ దేశంలో పాతిక వరకు కరోనా కేసులు నమోదుకావడం వలన దర్శక నిర్మాతలు ఆ షెడ్యూల్ని క్యాన్సిల్ చేశారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాతే థాయ్లాండ్ వెళ్లాలని చిత్ర బృందం భావిస్తుంది. ఆ లోపు మిగతా ఏరియాలలో షూటింగ్ని ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి.