* తెలంగాణ మంత్రివర్గంలోకి ఐపీఎస్ అధికారి రాబోతున్నారా? కేరళలో ఐపీఎస్గా పని చేస్తున్న అధికారి తెలంగాణ కేబినేట్ లో కీలక శాఖ చేపట్టనున్నారా? కేరళకు చెందిన ప్రముఖ వెబ్ సైట్ ఆన్ మనోరమ కధనం ప్రకరం కేరళ కేదార్ కు చెందిన ఐపీఎస్ అధికారి జీ. లక్ష్మన్ త్వరలోనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ కేబినేట్ లో చేరబోతున్నారు ఖమ్మంజిల్లా కు చెందిన లక్ష్మన్ గతంలోనే రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది.
*మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును…సీబీఐకు అప్పగించాలని కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్లపై విచారణ ముగిసింది. సీబీఐకి అప్పగించే విషయంలో కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
* విదేశాల్లో నివసిస్తున్న దాదాపు 1.36 కోట్ల మంది భారతీయులు 2018 ఏప్రిల్ నుంచి గత ఏడాది సెప్టెంబరు వరకు భారత్‌లోని తమ కుటుంబ సభ్యులకు రూ.8.4 లక్షల కోట్లు పంపారు. ఇందుకు సంబంధించి వచ్చిన ఓ ప్రశ్నకు లోక్‌సభలో ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.
*డిల్లి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో తేరా పడనుంది సాయంత్రం ఐదు గంటలకు మైకులు మూగబోతున్నాయి. దీంతో ఆఖరి రోజు ప్రచారంలో ప్రధాన పార్టీలకు చెందిన స్టార్ క్యంపెయింగ్ ర్యాలీలు నిర్వచించనున్నారు.
*రైతులను కేంద్రం శుభవార్త చెప్పింది కృష్ణాపురం ఉల్లి ఎగుమరుల పై నిషేదాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది కేపీ ఉల్లిని ఎగుమతి చేసేందుకు అనుమతి ఇస్తూ నోటిఫికేషన్ జరీ చేసింది.
* రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూహెచ్‌ఈఎఫ్) ప్రాంతీయ సదస్సుకు విజయవాడ వేదిక కానుంది. ఈ నెల 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు విజయవాడలో జరిగే ఈ సదస్సుకు పది దేశాలకుపైగా 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని డబ్ల్యూహెచ్‌ఈఎఫ్–2020 సదస్సు చైర్మన్ ఎస్.ఎన్. కుమార్ బుద్ధవరపు బుధవారం తెలిపారు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఈ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని, ‘కలసి అభివృద్ధి చెందుదాం– కలసి పంచుకుందాం’ అన్న లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.
* టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో గురవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాస్, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు.. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల ముందు వరకూ శ్రీనివాస్ చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన సచివాలయం జీఏడీలో పనిచేస్తున్నారు.
* ఉగ్రవాదులను వెంటేసుకు తిరుగుతూ పట్టుబడిన శ్రీనగర్ విమానాశ్రయంలోని యాంటీ హైజాకింగ్ విభాగ డీఎస్పీ దవీందర్ సింగ్ పట్టివేత వెనుక ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఉగ్రవాదుల ఫోన్ కాల్‌ను ట్యాప్ చేసిన పోలీసులకు ఏదో జరుగుతోందనిపించి వలపన్నారు. దీంతో వారు డీఎస్పీతో సహా మరో ఇద్దరు ఉగ్రవాదుల, ఒక లాయర్‌ను అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు షోపియన్ పోలీసులు ఓ ఫోన్‌కాల్‌ను ట్యాప్ చేశారు. దీనిలో హిజ్బుల్ స్థానిక కమాండ్ నవీద్ బాబు సోదరుడు ఓ పోలీసుతో కలిసి తాను జమ్మూ ట్రిప్‌కు వెళ్లే విషయమై మాట్లాడాడు. ఈ సంభాషణ విన్న పోలీసులు బాబు సోదరుడు మాట్లాడుతోంది ఒక కానిస్టేబులో.. లేక హెడ్ కానిస్టేబులో అయి ఉంటారని భావించారు.
* కియ ప్లాంట్ తమిళనాడుకి తరలుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనం ప్రచురితమైంది. తమిళనాడు ప్రభుత్వ అధికారులతో… కియ యాజమాన్యం సంప్రదింపులు జరుపుతున్నట్టు కథనం సారాంశం. రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో పారిశ్రామిక రాయితీలపై… ప్రభుత్వం పునరాలోచన చేయటమే తరలింపునకు కారణమంటూ కథనంలో పేర్కొన్నారు. కియ పరిశ్రమకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పలు రాయితీలు ఇచ్చింది. ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. చివరకు ఏపీలో పరిశ్రమ ఏర్పాటుకు కియ మొగ్గు చూపింది. ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా 15 వేల మందికి.. పరోక్షంగా మరో 40 వేల మందికి లబ్ధి చేకూర్చనుంది.
* ఏపీ సచివాలయం సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో స్టాటిస్టికల్ అధికారిగా పనిచేస్తోన్న పెండ్యాల శ్రీనివాస్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ సిద్దార్ధనగర్‌లోని కంచుకోట అపార్ట్‌మెంట్‌లో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు అత్యంత రహస్యంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. సంబంధిత దశ్యాలను చిత్రీకరిస్తు్న్న మీడియాను.. బందోబస్తు విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర భద్రతా సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద శ్రీనివాస్ వ్యక్తగత కార్యదర్శిగా చాలా ఏళ్లు పని చేశారు. ప్రభుత్వం మారడంతో ఎన్నికల అనంతరం తిరిగి తన మాతృ సంస్థకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. తొలుత శ్రీనివాస్ నివాసంలో అనిశా సోదాలు జరుపుతున్నట్లు ప్రచారం జరిగినా ఆ శాఖ అధికారులు తోసిపుచ్చారు.
* దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మరాఠ్వాడ ప్రాంతాల మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితలద్రోణి కొనసాగుతున్నది. దీనిప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. మరోవైపు ఆగ్నేయదిశ నుంచి వీస్తున్న వేడిగాలుల ప్రభావంతో హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు సాధారణస్థాయిదాటి నమోదవుతున్నాయి. బుధవారం హైదరాబాద్లో 32.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత, 19.8డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత, గాలిలో తేమ 38శాతంగా నమోదైనట్టు అధికారులు చెప్పారు.
*సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ మహాసభ ఈ నెల 22-24 తేదీల్లో మంచిర్యాలలో జరగనుంది. 22న సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సభను ప్రారంభిస్తారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మగ్ధూం భవన్లో మహాసభల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు.
*రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం ‘హాజీపూర్’ కేసులో నేడు తుది తీర్పు వెల్లడి కానుంది. ఇరవై ఏళ్లు కూడా నిండని ముగ్గురు అమ్మాయిలను అదే గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్రెడ్డి కిడ్నాప్, అత్యాచారం, హత్య చేయడంపై గతేడాది ఏప్రిల్లో మూడు కేసులు నమోదైన విషయం విదితమే. అంతకుముందే కర్నూలు జిల్లాలో అతడిపై మరో హత్యకేసు నమోదైంది
*పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీలపై భావోద్వేగాలు రెచ్చగొట్టేలా వాఖ్యలు చేస్తున్న వారిని పోలీసులు గమనిస్తున్నారు. విమర్శించినా, సమర్థించినా ఆయా వ్యాఖ్యల తీవ్రత ఆధారంగా వారిపై కేసులు నమోదు చేస్తారు’ అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్లో కొద్దిరోజులుగా సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా, మద్దతుగా సంస్థలు, వ్యక్తులు నిర్వహిస్తున్న సభలన్నింటిపైనా పోలీసు నిఘా ఉందని తెలిపారు.
*మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం తెలివైన చర్య కాదని 84% మంది ప్రజలు స్పష్టం చేశారు. ‘ది హిందూ బిజినెస్ లైన్’ ఆంగ్లపత్రిక నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
*భారత్లోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహా సంప్రదాయ వంటకాలు ఉంటాయి.. వండే విధానం, ఉపయోగించే దినుసులు మొదలుకొని చాలా ప్రత్యేకతలు వాటి సొంతం.. ఆయా వంటకాలకు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించినట్లు ప్రఖ్యాత చెఫ్ గరిమా అరోరా తెలిపారు.
*ముద్కేడ్-పర్బనీ సెక్షన్లో రెండో లైన్ పనులు జరుగుతుండడంతో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు ద.మ. రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. నిజామాద్ – పంఢర్పూర్, నాందేడ్ – ఔరంగాబాద్, పంఢర్పూర్ – నిజామాబాద్ మధ్య నడిచే రైళ్లను ఈ నెల 7న పూర్తిగా రద్దు చేశారు. 6, 7 తేదీల్లో పలు రైళ్లను పాక్షికంగా నడపనున్నారు.
*జాతీయ లోక్అదాలత్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 8న లోక్అదాలత్ కార్యక్రమం జరగనుంది. హైకోర్టు నుంచి తాలూకా స్థాయి వరకు అన్ని కోర్టు ఆవరణల్లో జాతీయ లోక్అదాలత్ జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి జి.వి.సుబ్రహ్మణ్యం ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి ఖర్చు లేకుండా సివిల్ కేసులతో పాటు జరిమానా విధించదగ్గ క్రిమినల్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. కోర్టులో ఉన్న కేసులను పరిష్కరించుకుంటే కోర్టులకు చెల్లించిన ఫీజులను కూడా వాపసు పొందవచ్చన్నారు.
*మహిళా సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని, 18 దిశ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయనుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దిశ మహిళా పోలీస్స్టేషన్ను ఈనెల 7న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం డీజీపీ ఏర్పాట్లను పరిశీలించారు.
*తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక జోన్గా మారుస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమశిల, లక్నవరం ప్రాంతాలను, కాళేశ్వరం, మిడ్మానేరు ప్రాజెక్టులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పారు.
*తాను ఆదివాసీల సోదరినని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ఆదివాసీ గిరిజనులు ఆత్మగౌరవంతో జీవించేలా పరిపాలన ఉండాలని.. వారి జీవన స్థితిగతులు పెంచగలిగేదే అభివృద్ధి అని చెప్పారు. గణతంత్ర వేడుకల్లో దిల్లీలో తెలంగాణ రాష్ట్ర శకటంపై ప్రదర్శన ఇచ్చిన 26 మంది గిరిజన కళాకారులను గవర్నర్ మంగళవారం రాజ్భవన్లో సన్మానించారు.
*వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21)లో కేంద్రం నుంచి అందే నిధులపై స్పష్టత రావడంతో తెలంగాణ ఆర్థికశాఖ బడ్జెట్ కసరత్తును వేగవంతం చేసింది. ఈ నెల మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రానికి అందే కేంద్ర పన్నుల వాటా, 15వ ఆర్థిక సంఘం నిధులపై ఇటీవల కేంద్రం బడ్జెట్లో స్పష్టతనిచ్చింది. మరోవైపు జనవరి ఆఖరు వరకూ రాష్ట్ర రాబడుల్లోనూ స్పష్టత వచ్చింది
*ఆర్టీసీ త్వరలో తీసుకురానున్న కార్గో సర్వీసులపై తన ఫొటో వాడొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. ఈ మేరకు సంస్థ ఎండీకి నోట్ పంపారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు కార్గో సర్వీసులను ఆర్టీసీ సిద్ధం చేస్తోంది. అయితే, ఈ బస్సులపై సీఎం కేసీఆర్ ఫొటోను వాడాలని అధికారులు భావించారు. ఆ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు
*పదో తరగతి మూల్యాంకన కేంద్రాలు ఈ సారి కూడా పాత 10 జిల్లా కేంద్రాల్లో 11 చోట్లే (హైదరాబాద్లో రెండు) ఏర్పాటుచేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. కొత్త జిల్లాల్లో స్పాట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి పలు వినతిపత్రాలు అందాయి. అయితే ఏ ఒక్క చోట కూడా డీఈవోలు ముందుకు రాలేదని అధికారవర్గాలు స్పష్టంచేశాయి. దీనికితోడు విద్యాశాఖలో కొత్త అధికారులు కావడం, ఇంకా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ను నియమించకపోవడం తదితర కారణాల వల్ల ఈ సారి కొత్తవి ప్రారంభించకపోవడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారు.
*భారతీయ రైల్వేలో చీఫ్ లోకో ఇన్స్పెక్టర్ల వేతనం భారీగా పెరగనుంది. ‘స్టెప్పింగ్ అప్ పే’ విధానాన్ని అమలుచేయాలని రైల్వేబోర్డు దేశంలోని అన్ని జోన్ల జనరల్ మేనేజర్లు, ఉత్పత్తి యూనిట్లకు ఆదేశాలు జారీ చేసింది. పదేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్య తాజాగా పరిష్కారం కావడంతో ద.మ.రైల్వే సహా పలు జోన్లకు చెందిన 300 మంది చీఫ్ లోకో ఇన్స్పెక్టర్ల వేతనం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పెరగనుందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ (ఎన్ఎఫ్ఐఆర్) జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య తెలిపారు.
*ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రంలో ఈ నెలలోనే విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభం అవుతుందని కేంద్ర ఇంధనం, సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో తెరాస సభ్యుడు బి.లింగయ్య యాదవ్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 270 మెగావాట్ల సామర్థ్యంతో ఇక్కడ నాలుగు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
*నీటిపారుదల శాఖలో ఇంజినీర్ల పదోన్నతుల ప్రక్రియకు సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపారు. 10 పర్యవేక్షక ఇంజినీరు (ఎస్ఈ) క్యాడర్ పోస్టుల్లోని వారికి ముఖ్య ఇంజినీర్లుగా(సీఈ) పదోన్నతులు కల్పించే దస్త్రంపై మంగళవారం సంతకం చేశారు. ఈఈ నుంచి ఎస్ఈలుగా 25 పోస్టులు, డీఈ నుంచి ఈఈలుగా 75 పోస్టుల పదోన్నతులకు 10 హెచ్ నిబంధనకు ప్రభుత్వం మినహాయింపును కల్పించింది
*ఒడిశాలోని బొగ్గు గనుల ప్రాంతంలో అటవీ భూముల పరిహారానికి రూ.450 కోట్లు ఇవ్వాల్సి ఉందని సింగరేణి వెల్లడించింది. ఈ గనుల్లో తవ్వకాలపై మంగళవారం తన కార్యాలయంలో సంస్థ సీఎండీ శ్రీధర్ అధికారులతో సమీక్ష జరిపారు. మొత్తం 783.27 హెక్టార్ల అటవీ భూములకు పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. 2021 మార్చినాటికి 50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సూచించారు.
*తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ల కల్పనపై విచారణను సుప్రీంకోర్టు వారంపాటు వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టులో ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ అరుణ్ మిశ్ర నేతృత్వంలోని జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది
*విశాఖజిల్లా పరవాడ మండలం కలపాక సమీపంలోని సింహాద్రి ఎన్టీపీసీ రిజర్వాయర్పై రూ.110 కోట్లతో 25 మెగావాట్ల ఫ్లోటింగ్ సౌర విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ వి.సుదర్శన్బాబు వెల్లడించారు. మంగళవారమిక్కడ ఆయన మాట్లాడుతూ.. 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రిజర్వాయర్పై సౌర విద్యుత్తు కేంద్రం ఏర్పాటు పనులను త్వరలో ప్రారంభించి 15 నెలల్లోగా పూర్తి చేస్తామన్నారు. పనులను బీహెచ్ఈఎల్ సంస్థకు అప్పగించినట్లు తెలిపారు.
*ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీ) ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారిలో ఖతార్లో ఎలక్ట్రీషియన్ ఉద్యోగానికి 12 మంది యువకులు ఎంపికైనట్లు ఛైర్మన్ మేడపాటి వెంకట్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏజే ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ డబ్ల్యూ ఎల్ కంపెనీ వీరిని ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. గుంటూరులోని అంతర్జాతీయ శిక్షణ కేంద్రంలో వీరికి 90 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చామన్నారు. ఇప్పటికే వీరు వీసా పొందినట్లు వివరించారు.
*సూక్ష్మ నీటి పారుదల నిధి కింద నాబార్డు నుంచి ఆంధ్రప్రదేశ్కు రూ.616 కోట్ల రుణం మంజూరైంది. 2019-20 సంవత్సరానికి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1.83 లక్షల హెక్టార్లలో సూక్ష్మ, బిందు సేద్యం విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి నాబార్డు నుంచి రుణ సహాయం అందిస్తున్నట్లు సీజీఎం ఎస్.సెల్వరాజ్ తెలిపారు. మరోవైపు ఈ నెల 6న సచివాలయంలో రాష్ట్ర క్రెడిట్ సెమినార్ నిర్వహిస్తున్నట్లు సెల్వరాజ్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 2020-21 దార్శనిక పత్రాన్ని విడుదల చేస్తారని వివరించారు.
తెలంగాణ మంత్రివర్గంలోకి ఐపీఎస్ అధికారి-తాజావార్తలు
Related tags :