Politics

మందబుద్ధి భారీకాయం కలిగిన ఉత్తర కుమారుడు లోకేశ్

Minister Anil Kumar Yadav Speaks Of Lokesh

ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ మరో మారు తెదేపా సీనియర్ నేత మాజీ మంత్రి ఉమామహేశ్వరరావును లక్ష్యంగా ఆయనపై విమర్శలు గుప్పించారు. దేవినేని ఉమా ఆడో మాగో తెలియడం లేదని చెప్పుకొచ్చారు. నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి అనిల్ పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్ అన్నట్టు ఉమా అంటే ఆడో మాగో తేడా తెలియదు. ఆయన సిఎం పైన నాపైనా విమర్శలు చేస్తుండటం సిగ్గుచేటు. నన్ను ఉత్తర కుమారుడని ఉమా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఉత్తర కుమారుడు లోకేష్ అన్న సంగతి అందరికీ తెలుసు. రాజకుమారుడు, మందబుద్ది, భారీకాయం, భయంతో పాటు రేలంగి లాగా సైజులున్న వ్యక్తి లోకేశే! నాకు భయమంటే ఏమిటో తెలియదు. మండలిలో అడుగు దూరం నుంచి లోకేష్ నన్ను చూశాడు. నా కళ్ళల్లో కాని గుండెలలో కాని భయం కనపడిందేమో ఆ ఉత్తరాకుమరుడిని అడిగి తెలుసుకోవాలి. ఎవరిని చంపి ఉమా రాజకీయాల్లోకి వచ్చాడో విజయవాడలో ప్రతి ఒక్కరికి తెలుసు అని మంత్రి అనీల్ కుమాద్ యాదవ్ అన్నారు. తెదేపా ప్రభుత్వంలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీ తప్ప ఐదేళ్ళలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. అందుకే శంఖుస్థాపన తండ్రి చేస్తే ప్రారంభోత్సవాన్ని కుమారుడు జగన్ చేయబోతున్నారు అని మంత్రి అనీల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు.