సూక్ష్మ నీటి పారుదల నిధి కింద నాబార్డు నుంచి ఆంధ్రప్రదేశ్కు రూ.616 కోట్ల రుణం మంజూరైంది. 2019-20 సంవత్సరానికి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1.83 లక్షల హెక్టార్లలో సూక్ష్మ, బిందు సేద్యం విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి నాబార్డు నుంచి రుణ సహాయం అందిస్తున్నట్లు సీజీఎం ఎస్.సెల్వరాజ్ తెలిపారు. మరోవైపు ఈ నెల 6న సచివాలయంలో రాష్ట్ర క్రెడిట్ సెమినార్ నిర్వహిస్తున్నట్లు సెల్వరాజ్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 2020-21 దార్శనిక పత్రాన్ని విడుదల చేస్తారని వివరించారు.
ఏపీకి నాబార్డు ₹616కోట్ల ఋణం
Related tags :